breaking news
blue line
-
మెట్రో ట్రాక్‌పై హైడ్రామా: 24 నిమిషాలు స్తంభించిన బ్లూ లైన్!
కోల్‌కతా: శనివారం ఉదయం కోల్‌కతా మెట్రో నెట్‌వర్క్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. కాళీఘాట్ మెట్రో స్టేషన్లో ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టడంతో బ్లూ లైన్ పరిధిలోని రైలు సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఉదయం పూట ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్పందించి సకాలంలో చర్యలు చేపట్టడంతో ఒక ప్రాణం నిలబడటంతో పాటు ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించింది.ఉదయం 7.20కి స్తంభించిన రైళ్లుమెట్రో రైల్వే అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం సుమారు 7:20 గంటల సమయంలో కాళీఘాట్ స్టేషన్‌లోని అప్ లైన్ పట్టాలపైకి ఒక వ్యక్తి అకస్మాత్తుగా దూకాడు. అది గమనించిన వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది, ప్రమాదాన్ని నివారించేందుకు ట్రాక్‌లకు సరఫరా అయ్యే విద్యుత్‌ను తక్షణమే నిలిపివేశారు. ఆ వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఊహించని ఘటనతో కవి సుభాష్- దక్షిరేశ్వర్ స్టేషన్ల మధ్య నడిచే బ్లూ లైన్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ప్రయాణికుల రద్దీ.. పాక్షిక సర్వీసుల నిర్వహణరద్దీగా ఉండే ఉదయం వేళల్లో మెట్రో సేవలు ఆగిపోవడంతో పలు స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మెట్రో అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా, ప్రభావితం కాని మార్గాల్లో పాక్షిక సర్వీసులను నడిపారు. దక్షిరేశ్వర్ నుంచి మైదాన్ వరకు, అలాగే మహానాయక్ ఉత్తమ్ కుమార్ (టోలీగంజ్) నుంచి కవి సుభాష్ స్టేషన్ల మధ్య మాత్రమే ఈ సమయంలో రైళ్లను నడిపించారు.ప్రాణాలతో బయటపడిన వ్యక్తిమెట్రో సిబ్బంది, ఆర్పిఎఫ్ బలగాలు సకాలంలో స్పందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అధికారులు ట్రాక్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక ఉదయం 7:44 గంటలకు బ్లూ లైన్ పూర్తిస్థాయి సేవలను పునరుద్ధరించారు. కేవలం 24 నిమిషాల్లోనే పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చినప్పటికీ, రద్దీ సమయంలో జరిగిన ఈ అంతరాయం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మళ్లీ మొరాయించిన బ్లూలైన్ మెట్రో
సాక్షి, న్యూఢిల్లీ: బ్లూలైన్ మార్గంలో మెట్రో రైలు ప్రయాణం మరోసారి నగరవాసులకు చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్య తలెత్తిన కారణంగా బుధవారం ఈ మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా ప్రయాణించడమేకాకుండా పలు స్టేషన్లలో చాలాసేపు ఆగుతూ ఆలస్యంగా ముందుకుసాగాయి. దీంతో అనేక స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ద్వారకా సెక్టర్ 21 నుంచి నోయిడా, వైశాలి వరకుగల మెట్రో లైన్‌పై ఉదయం పది గంటలకు ఓ మెట్రో రైలు ఆగిపోయి ముందుకు కదలలేదు. చాలాసేపు మొరాయించింది. నోయిడా సిటీ సెంటర్ వెళ్లే మెట్రో రైలులోనే సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ద్వారకా సెక్టార్-21 నుంచి నోయిడాకు బయలుదేరిన ఈ రైలు ద్వారకా సెక్టార్ - 14 స్టేషన్లో ఆగిపోయింది. సమస్య ఈ రైలులోనే ఉన్నట్లు గుర్తించిన మెట్రో అధికారులు ప్రయాణికులందరినీ దించి ఆ తరువాత సమీపంలోని డిపోకు పంపారు. రైలులో తల్తెతిన సమస్య ఏమిటనేది పరీక్ష అనంతరం తేలుతుందని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ సమస్య కారణంగా బ్లూలైన్పై ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలువురు ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ఇతర లైన్లపై మాత్రం రైళ్లు యథావిథిగా నడిచాయి. 45 నిమిషాలసేపు ఆగిపోయింది కపిల్ అనే ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ ద్వారకా సెక్టార్ -9లో ఉదయం గం 9.15 నిమిషాలకు మెట్రో రైలు ఎక్కానన్నాడు. ఆ తరువాత ఈ రైలు పది గంటలదాకా అక్కడే ఉండిపోయింది. ప్రయాణంలో ఆలస్యం కారణంగా నోయిడాలోని కార్యాలయానికి చేరుకునేసరికి మధ్యాహ్నం 12 గంటలైందన్నాడు. కాగా ఈ నెల రెండో తేదీన కూడా మెట్రో రైలు ప్రయాణికులు నానాయాతనలకు గురైన సంగతి విదితమే. ద్వారకా-నోయిడా సిటీసెంటర్-వైశాలి మార్గంలోని జనక్‌పురి స్టేషన్ సమీపంలో ఓవర్‌హెడ్ వైర్ తెగిపోయిన కారణంగా మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు ఏడు లక్షలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ)... జాతీయ రాజధానితోపాటు జాతీయ ప్రాదేశిక ప్రాంతం పరిధిలోని గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్ మెట్రో రైలు సేవలను అందజేస్తోంది. ప్రపంచంలో 13వ అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ ఇదే. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వయోలెట్ అని ఐదు రకాల కలర్ కోడ్ లైన్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గం అత్యంత పొడవైనది. దీని పొడవు 193.2 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గంలో 38 భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలో ఎస్కలేటర్లు, ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. రోజుకు మొత్తం 2,700 ట్రిప్పులను డీఎంఆర్సీ నడుపుతోంది. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి పదకొండు గంటలవరకూ వీటి సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నాలుగు లేదా ఆరు బోగీలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. -
ప్రయాణికులకు నరకం చూపిన ఢిల్లీ మెట్రో
దేశరాజధాని ఢిల్లీలో మెట్రోరైలు ప్రయాణికులకు నరకం చూపించింది. అందులో ఓ సాంకేతిక లోపం తలెత్తడంతో పలు రైళ్లు చాలా ఆలస్యంగా నడచాయి, చాలా సేపటి పాటు కొన్ని స్టేషన్లలో ఆగిపోయాయి. దాంతో వాటిలో జనం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ద్వారకా సెక్టార్ 21 నుంచి నోయిడా సిటీ సెంటర్ / వైశాలి ప్రాంతానికి వెళ్లే బ్లూలైనులో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది. నోయిడా నుంచి బయల్దేరిన ఒక రైలు ద్వారకా సెక్టార్ 14 స్టేషన్ వద్ద ఆగిపోయిందని ఢిల్లీ మెట్రో రైలు అధికార వర్గాలు తెలిపాయి. తర్వాత రైలును పక్కకు తీసుకెళ్లిపోయి సమీపంలోని డిపోలో మరమ్మతులు చేయించామని, అందులో ఉన్న ప్రయాణికులందరినీ దించేశామని చెప్పారు. అయితే, ప్రయాణికులు చెప్పేది మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తాను ఉదయం 9.15 గంటలకు ద్వారకా సెక్టార్ 9 స్టేషన్ వద్ద రైలు ఎక్కానని, అది 10 గంటల వరకు అక్కడే ఉండిపోయిందని, తాను మధ్యాహ్నం 12 గంటలకు గానీ ఆఫీసుకు వెళ్లలేకపోయానని సంగీత అనే ప్రయాణికురాలు చెప్పారు. బ్లూలైన్ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 7 లక్షల మంది ప్రయాణికులు వెళ్తుంటారు.


