breaking news
Blood on call
-
రక్తం ఇస్తారా?... వచ్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: దాతల వద్దకే వెళ్లి రక్తం సేకరించేందుకు ప్రత్యేక మొబైల్ వాహనాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రతీ జిల్లా లో ఇటువంటి మొబైల్ వాహనాలను అం దుబాటులో ఉంచుతారు. ప్రయోగాత్మకంగా 18 రక్తసేకరణ వాహనాలను సిద్ధం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులతో వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఆయా జిల్లాలకు పంపుతారు. వీటి ద్వారా రక్త సేకరణ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొబైల్ వాహనాల్లో సౌకర్యాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు పరిశీలించారు. బ్లడ్ బ్యాంకుల్లో మాదిరిగానే ఈ వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఏసీ, రెండు పడకలు, బీపీ, బరువు చెక్ చేసే యంత్రం తదితర సదుపాయాలుంటాయి. ఒకేసారి ఇద్దరి నుంచి రక్తం సేకరించడానికి వీలుంది. బ్లడ్ బ్యాంక్‌లకు చేరే వరకూ రక్తాన్ని భద్రపరిచేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్‌ను వ్యాన్‌లో అమర్చారు. ఒక్కో వాహనం ధర రూ. 35 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని త్వరలో ప్రారంభించి రక్త దాతలకు అందుబాటులోకి తెస్తామని ఎన్హెచ్ఎం అధికారులు తెలిపారు. శిబిరాల ఏర్పాటు కష్టం అవడంతో.. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులు, శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. ఎక్కడ రక్తదాన శిబిరం నిర్వహించాలన్నా వైద్యపరంగా నిబంధనల ప్రకారం సౌకర్యాల ను కల్పించడం కష్టమవుతోంది. స్కూళ్లు, ఇతరత్రా కార్యాలయాల వద్ద రక్తాన్ని సేకరించడం ఇబ్బందిగా మారింది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వారు ఆహ్వానించగానే వెళ్లేలా ఈ వాహనాలను సిద్ధం చేశారు. రక్తదాతలు పిలిస్తే వెంటనే వెళ్లాలనేది వీరి ఉద్దేశం. ఊరూరా తిరిగి రక్తదానం ప్రాముఖ్యతను చెప్పి సేకరించాలనేది సర్కారు ఆలోచన. ఈ వాహనాల్లో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు సాంకేతిక నిపుణులు ఉంటారని ఎన్హెచ్ఎం వర్గాలు తెలిపాయి. దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి మొబైల్ రక్త సేకరణ వాహనాలను మన రాష్ట్రంలోనే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాయి. -
హలో.. బ్లడ్ కావాలండీ..!.
- బ్లడ్ ఆన్ కాల్‌కు విశేష స్పందన - ప్రజల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అవగాహన - రవాణాకు జిల్లాలో ద్విచక్రవాహనం సాక్షి, ముంబై: రాష్ట్రంలో ‘బ్లడ్ ఆన్ కాల్ (104)’కు ఇప్పుడిప్పుడే మంచి స్పందన లభిస్తోంది. ఈ సేవలను జనవరి 6వ తేదీన ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7,000 కాల్స్ వచ్చాయి. వాటిలో అవసరమైన 4,750 మందికి బ్లడ్ బ్యాగులను పంపిణి చేశామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ (ఎస్‌బీటీసీ) సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోజూ కనీసం 55 కాల్స్ వస్తున్నాయి. చాలావరకు అత్యవసర కేసులకు సంబంధించినని కావు.. రోగులకు చికిత్స, శస్త్రచికిత్స అందజేసేందుకుగాను నిలువ ఉంచేందుకు ఫోన్ చేస్తుంటారు..’ అని తెలిపారు. ఇందులో సిజేరియన్, ప్రసూతి ఇతర అత్యవసర చికిత్సల నిమిత్తం ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తుంటాయన్నారు. అలాంటప్పుడు తమకు వచ్చిన ఫోన్ కాల్స్‌ను సమీప బ్లడ్ బ్యాంక్‌లకు కనెక్ట్ చేస్తామని అధికారి చెప్పారు. కాగా, బ్లడ్ ఆన్ కాల్ సేవల కోసం ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తున్నారు. వీటికి బ్లడ్‌ను రవాణా చేసేందుకు ఐస్ బాక్సులను అమరుస్తారు. కాగా వీరు ఈ బ్లడ్‌ను గంట లోగానే ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటుందని ఎస్‌బీటీసీ అధికారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ వాహనాలను నడిపేందుకు ముగ్గురు వ్యక్తులను అందుబాటులో ఉంచారు. ఇదిలా వుండగా ముంబై నగరవ్యాప్తంగా తొమ్మిది బ్లడ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారి తెలిపారు. సమీపంలో ఉన్న స్టోరేజ్ యూనిట్‌తో జిల్లా బ్లడ్ బ్యాంక్ సమన్వయం కలిగి ఉంటుంది. తర్వాత రైడర్ అవసరమున్న వారికి ఈ బ్లడ్‌ను డెలివరి చేస్తారు. కాగా, తాము ఇప్పటివరకు దాదాపు 190 ఆస్పత్రులకు, నర్సింగ్ హోమ్‌లకు బ్లడ్ బ్యాగ్‌లను అందజేశామన్నారు. అయితే చాలా మంది ఈ సేవలకు సంబంధించి ఫోన్‌కాల్స్ చేసి విచారిస్తున్నారని, నగర వాసుల్లో వీటిపై అవగాహన పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంబంధం లేని కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడం లేదని ఆ అధికారి తెలిపారు. రోజుకు దాదాపు 55 కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నామన్నారు.