breaking news
Black gram seeds
-
మినుము సాగుకు అదును ఇదే..
విజయనగరం ఫోర్ట్: మినుము పంట సాగుకు అదును ఇదేనని విజయనగరం మండల వ్యవసాయ అధికారి గాలి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మినుము సాగు విధానం, అధిక దిగుబడుల సాధనపై పలు సూచనలిచ్చారు. ఆయన మాటల్లోనే... సాగుకు అనువైన నేలలు.. మాగాణి, మెట్ట భూములు మినుము పంటకు అనుకూలం. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ నేలల్లో మినుము పంటను వేసుకోవాలి. విత్తడం ఇలా.. మరి మాగాణాల్లో అయితే వరి కోయటానికి 4, 5 రోజుల ముందు విత్తనాలను వెదజల్లుకోవాలి. ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం, ఎరువులు వేయడం వంటివి చేయరాదు. అధిక మోతాదులో విత్తనాన్ని వాడాలి. మెట్ట భూముల్లో అయితే తేమను నిలుపుకోగలిగి మురుగునీరు పోయేనేలలు మినుముకు అనుకూలం. భూమిని బాగా దుక్కిచేయాలి. విత్తనం దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి భూమిలో కలియదున్నాలి. వరి మాగాణాల్లో అయితే విత్తనాలను వెదజల్లాలి. మెట్ట భూముల్లో అయితే వరుసల మ«ధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కలు మధ్య 10 సెం.మీ అంతరంతో గొర్రుతో గాని సీడ్ డ్రిల్‌తో గాని విత్తాలి. రకాలు... ఎల్ఐజీ–645: ఈ రకం పంట కాలం 85 నుంచి 90 రోజులు. హెక్టారుకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లావుపాటి పాలిసీ రకం. ఎండు తెగులను తట్టుకుట్టుంది. ఎల్.బి.జి –402: ఈ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. హెక్టారుకు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎత్తుగా పెరిగి కలుపును అణిచి వేస్తుంది. చౌడును కొంత వరకు తట్టుకుట్టుంది. ఎల్బీజీ 22: ఈ పంట రకం 85 రోజులు. హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం. ఎల్బీజీ–17: ఈ రకం పంట కాలం 80 నుంచి 85 రోజులు. బూడిద తెగులను తట్టుకుంటుంది. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. ఎల్బీజీ– 752: ఈ రకం పంటకాలం 75 నుంచి 80 రోజులు. పల్లాకు, ఎండు తెగులను తట్టుకుంటుంది. విత్తన మోతాదు: వరి మాగాణాల్లో అయితే ఎకరాకు 16 కేజీలు, మెట్ట భూముల్లో అయితే ఎకరాకు 10 కిలోల విత్తనం అవసం అవుతుంది. కిలో విత్తనానికి 30 గ్రాముల కార్పోసల్ఫాన్, 2.5 థైరమ్ లేదా కాప్టాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. నీటి యాజమాన్యం: వర్షాభావ పరిస్థితి ఎర్పడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు పెట్టాలి. వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు. ఒకటి రెండు తేలిక తడులు, 30 రోజులకు, 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. కలుపు నివారణ: పెండి మిథాలిన్ ద్రావణం ఎకరాకు లీటరు నుంచి లీటరన్నర ఎకరాకు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. సస్యరక్షణ: మరకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేయాలి. ఎండు తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కలు వడిలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. పైరుపై మందులను వాడి నివారించడం లాభసాటి కాదు. తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పల్లాకు తెగులు: ఇది జెమిని వైరస్ జాతి వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్టయితే పైరు గిడసబారిపోయి , పూతపూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి. -
పప్పులే కాదు.. భూమికి బలాన్నీ ఇస్తాయి!
జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పడుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రైతులు పెసర, మినుము విత్తనాలు వేసుకుంటున్నారు. మార్కెట్లో పప్పు ధాన్యాలకు మంచి రేటు పలుకుతుండడంతో చాలా మంది రైతన్నలు ఇప్పుడు వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పైగా ఇవి అతి తక్కువ కాలంలో చేతికొస్తాయి. గాలిలోని నత్రజనిని రైజోబియుం బాక్టీరియూ సాయంతో స్థిరీకరించి, పంట ఎదుగుదలకు దోహదపడడంతో పాటు ఎకరానికి 16-20 కిలోల నత్రజని ఎరువును అందిస్తాయి. పంట తీసుకున్న తర్వాత భూమిలో కలియదున్నితే పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడి భూసారాన్ని పెంచుతాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకొని, తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటయ్య. ఆ వివరాలు... పెసర పంటే ఎందుకు? పెసరను పంటమార్పిడి పైరుగా, అంతరపంటగా కూడా వేసుకోవచ్చు. ఆయుకట్టు ప్రాంతాలలోనూ, చెరువులు-వ్యవసాయ బావులు వంటి నీటి వనరుల కింద వరి పండించే భూముల్లోనూ ముందుగా పెసర వేసుకొని, ఆ తర్వాత వరి వేసుకోవచ్చు. అయితే పైరు ఒకేసారి కోతకు రాకపోవడం, చీడపీడలకు సులభంగా లోనవడం వంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెసరను అన్ని రకాల నేలల్లో సాగు చేయువచ్చు. కానీ చౌడు నేలలు, మరుగు నీరు నిలిచే భూములు పనికిరావు. అనువైన రకాలివే ఎల్జీజీ-407 రకం పంటకాలం 70-75 రోజులు. మొక్కలు నిటారుగా పెరిగి కాయులు మొక్క పైభాగాన కాస్తారుు. గింజలు మెరుస్తూ వుధ్యస్థ లావుగా ఉంటారుు. ఈ రకం ఎల్లో మొజారుుక్, నల్ల ఆకువుచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎల్జీజీ-410 రకం 75 రోజుల పంట. మొక్కలు నిటారుగా, గుబురుగా పెరుగుతారుు. గింజలు పెద్దవిగా మెరుస్తూ ఉంటారు. పైరు ఒకేసారి కోతకు వస్తుంది. ఎల్జీజీ-450 రకం పైరు 65-70 రోజుల్లో కోతకు వస్తుంది. మొక్కలు వుధ్యస్థ ఎత్తులో ఉండి, గుబురుగా కన్పిస్తారుు. పంట చేతికొచ్చే సవుయుంలో వర్షాలు కురిసినప్పటికీ గింజలు కొంతమేర చెడిపోవు. పూసా-105 రకం పంటకాలం 65-70 రోజులు. ఇది అన్ని ప్రాంతాలకూ అనువైనది. కాయులన్నీ పైభాగంలోనే ఉండి ఒకేసారి కోతకు వస్తాయి. ఈ రకం పల్లాకు, ఆకువుచ్చ తెగుళ్లను కొంతమేర తట్టుకుంటుంది. ఎంజీజీ -295 రకం 65-70 రోజుల పంట. మొక్కలు నిటారుగా పెరుగుతారుు. ఈ రకం నల్లవుచ్చ తెగులును తట్టుకుంటుంది. గింజ వుధ్యస్థ లావుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. డబ్ల్యూజీజీ-37 రకం పంటకాలం 60-65 రోజులు. గింజలు ఆకర్షణీయుంగా, పచ్చగా మెరుస్తుంటారు. దీనిని అన్ని ప్రాంతాల్లో సాగు చేయువచ్చు. పైరు ఒకేసారి కోతకు వస్తుంది. ఎల్లో మెజారుక్ తెగులును తట్టుకుంటుంది. ఎల్జీజీ-460 రకం 60-65 రోజుల పంట. కాయులు గుత్తులుగా ఉండి కోయుడానికి సులువుగా ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎంఎల్-267 రకం 65 రోజుల పంట. అన్ని ప్రాంతాలకూ అనువైనది. మొక్క నిటారుగా ఉండి కింది నుండి పై దాకా కాస్తుంది. పెసర రకాలన్నీ ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని అందిస్తాయి. తేమను నిలుపుకునే నేలల్లో... మినుమును నల్లరేగడి భూవుుల్లో పొగాకు పంటకు వుుందు ఎక్కువగా సాగు చేస్తారు. పంటల సరళిలో దీనిని పంటవూర్పిడి పైరుగా, అంతరపంటగా వేస్తారు. అయితే తొలకరిలో వేసే మినువుు పంట నీటి ఎద్దడిని త ట్టుకోలేదు. కాబట్టి తేవును నిలుపుకోలేని తేలికపాటి భూవుులు, ఎర్ర నేలలు మినువుు సాగుకు పనికిరావు. ఖరీఫ్ పైరుకు పల్లాకు, ఆకుముడత తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి. ఈ రకాలు వేసుకోవచ్చు ఎల్బీజీ-20 రకం ఆకులు సన్నగా, పొడవుగా వుుదురాకుపచ్చ రంగులో ఉంటారుు. ఈ రకం పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు నల్లగా మెరుస్తుంటారుు. పైరు 70-75 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. డబ్ల్యుబీజీ-26 రకం మొక్కలు గుబురుగా, పొట్టిగా ఉంటారుు. గింజలు సాదాగా ఉంటారు. ఈ రకం పల్లాకు తెగులును కొంతమేర తట్టుకోగలదు. దీని పంటకాలం 70-75 రోజులు. ఎకరానికి సుమారు 5 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఎల్బీజీ-623 రకం కాయులు పొడవుగా, లావుగా ఉంటాయి. వాటి పైన నూగు చాలా తక్కువగా ఉంటుంది. గింజలు లావుగా మెరుస్తూ ఉంటారుు. మొక్కలు గుబురుగా పెరుగుతారుు. ఈ రకం బూడిద తెగులును కొంతమేర తట్టుకుంటుంది. దీని పంటకాలం 75-80 రోజులు. ఎకరానికి 7 క్వింటాళ్లకు పైగా దిగుబడిని అందించగలదు. టీ-9 రకం మొక్కలు గుబురుగా, పొట్టిగా ఉంటారుు. ఆకులు సన్నగా, వుుదురాకుపచ్చ రంగులో ఉంటారు. దీని పంటకాలం 70-75 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. సాగు ఇలా... పెసర పంటకు ఎకరానికి 6-7 కిలోలు, మినుముకు 8-10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తడానికి ముందు కిలో విత్తనాలకు 30 గ్రాముల కార్బోఫ్యూరాన్ మందును పట్టించి శుద్ధి చేయాలి. పైరును తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/థయోమిథాక్సామ్ చొప్పున కలపాలి. ఈ పైర్లను కొత్తగా సాగు చేసే వారు రైజోబియం కల్చర్‌ను కూడా కలిపితే మంచి దిగుబడులు వస్తాయి.