breaking news
Bjorn Fortuin
-
పసికూన.. ‘ప్రపంచ రికార్డు’!
సొంతగడ్డపై నమీబియా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికాను రెండుసార్లు ఓడించిన ఏకైక అసోసియేట్ జట్టుగా నిలిచింది. కాగా నమీబియా.. సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా విండ్‌హోక్ నమీబియా- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌తో శుక్రవారం ఈ సిరీస్‌కు తెరలేచింది. నమీబియా క్రికెట్ గ్రౌండ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 163 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఓపెనర్ల ధనాధన్టాపార్డర్లో ఓపెనర్లు లూరేన్ స్టీన్కాంప్ (29 బంతుల్లో 41), జాన్ ఫ్రిలింక్ (38 బంతుల్లో 60) ఆకట్టుకోగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ గెర్హాడ్ ఎరాస్మస్ 19 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వారిలో అలెగ్జాండర్ విలోషెంక్ (13*), రూబెల్ ట్రంపెల్మాన్ (12) మాత్రమే పది పరుగుల మార్కు దాటగా.. మిగతా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెనేలన్ సుబ్రేయాన్ మూడు వికెట్లతో మెరవగా.. కెప్టెన్ బిజోర్న్ ఫార్చూన్, అరంగేట్ర ఆటగాడు డువాన్ యాన్సెన్ తలా రెండు.. నకొబాని మొకోనా, డెవాల్డ్ బ్రెవిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 145 పరుగులకే పరిమితమైంది. డెవాల్డ్ బ్రెవిస్ ఒంటరి పోరాటం (50 బంతుల్లో 75) వృథాగా పోయింది.తొలి జట్టుగా చరిత్ర..టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా నెదర్లాండ్స్ జట్టు సౌతాఫ్రికాను ఓడించింది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో సౌతాఫ్రికాపై గెలిచిన తొలి అసోసియేట్ జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. అయితే, 2025లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నమీబియా సౌతాఫ్రికాను తొలిసారి ఓడించి నెదర్లాండ్స్ తర్వాతి స్థానంలో నిలిచింది. తాజాగా మరోసారి ప్రొటిస్ జట్టుపై గెలిచి (16 పరుగుల తేడాతో).. రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి అసోసియేట్ జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.ఫైనల్ చేరతాం.. గెలుస్తాంటీ20 ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాపై తొలి మ్యాచ్‌లో గెలుపొందడంపై నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ హర్షం వ్యక్తం చేశాడు. రెండోసారి తాము ఈ పని చేశామని.. ఇదేమీ గాలివాటం విజయం కాదన్నాడు. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారని ప్రశంసించాడు. ఈ సౌతాఫ్రికా- నమీబియా సిరీస్‌లో ఫైనల్ చేరి.. టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. చదవండి: సూర్యకుమార్ యాదవ్ ఆవేదన -
సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్!.. యాన్సెన్ కవల సోదరుడికి ఛాన్స్
నమీబియా పర్యటన నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ బిజోర్న్ ఫార్చూన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి సౌతాఫ్రికాతో పాటు నమీబియా, జింబాబ్వే ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు మూడు జట్ల మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుంది. నమీబియా పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా తొలుత జింబాబ్వేతో కలిసి ట్రై సిరీస్‌లో ఆడనుంది.అనంతరం నమీబియాతో సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే, ఈ సిరీస్ నుంచి వైట్‌బాల్ కెప్టెన్లు తెంబా బవుమా (వన్డే), ఐడెన్ మార్క్రమ్ (టీ20)లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వీరితో పాటు కగిసో రబడ, లుంగి ఎంగిడి, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్‌లకు కూడా రెస్ట్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో 31 ఏళ్ల బిజోర్న్ ఫార్చూన్కు కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే.. స్టార్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ కవల సోదరుడు డువాన్ యాన్సెన్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. తొలిసారి అతడు సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.ఇక కార్బిన్ బాష్ సోదరుడు ఎథాన్కు తొలిసారి టీ20 జట్టులో చోటు దక్కడం మరో విశేషం. వీరితో పాటు కన్నోర్ ఎస్తెన్హూజెన్, నకొబాని మొకొయెనా కూడా తొలిసారి వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. హెర్మాన్ బ్రదర్స్ జోర్డాన్, రూబిన్లు కూడా జట్టులో చేరారు.నమీబియా పర్యటనకు క్రికెట్ సౌతాఫ్రికా ఎంపిక చేసిన జట్టుబిజోర్న్ ఫార్చూన్ (కెప్టెన్), ఈథన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కన్నోర్ ఎస్తేర్హూజెన్, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, డువాన్ యాన్సెన్, క్వెనా మఫాక, నకోబని మొకొయెనా, నకబా పీటర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, లూథో సిపమ్లా, జేసన్ స్మిత్, ప్రెనేలన్ సుబ్రేయన్.కాగా ఆగష్టు 28 నుంచి సెప్టెంబరు 13 వరకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు నమీబియాలో పర్యటించనుంది. ఆగష్టు 28- సెప్టెంబరు 6 వరకు ట్రై సిరీస్‌లో ఆడనున్న సౌతాఫ్రికా జట్టు.. సెప్టెంబరు 9, 11, 13 తేదీల్లో ఆతిథ్య నమీబియాతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ టూర్ మొత్తానికి విండ్హెక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్ వేదిక.చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత తుదిజట్టులో ఊహించని పేరు!


