breaking news
binamy
-
నిఖేశ్ లీలలు ఇన్నిన్ని కాదయా!
సాక్షి, హైదరాబాద్: అనతి కాలంలో అంతులేని అవినీతితో వందల కోట్లకు పగడలెత్తిన నీటి పారుదల ఏఈఈ నిఖేశ్‌కుమార్ లీలలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. తనవద్దకు పనికోసం వచ్చిన ప్రజలతోపాటు చిన్ననాటి స్నేహితులు, సొంత కుటుంబ సభ్యులను కూడా ఆయన మోసగించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తన మిత్రులు, కుటుంబ సభ్యులకు తెలియకుండానే వారిని నిఖేశ్ బినామీ లుగా మార్చు కున్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నిఖేశ్‌కుమార్‌ను.. ఏసీబీ అధికారులు వరుసగా మూడో రోజు శనివారం కూడా ప్రశ్నించారు. చిన్న పని ఉందంటూ.. అవినీతిలో నిఖేశ్‌కుమార్ స్టైలే వేరుగా ఉన్నది. తన పదేళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన 2020 – 2024 మధ్యే ఎక్కువ ఆస్తులు పోగేశాడు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బాగా పీక్‌లో ఉన్నప్పుడు ఆయన గండిపేట్‌లో పనిచేశాడు. అక్కడ రియల్ ఎస్టేట్ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వటంలో కీలకంగా మారాడు. ఫీల్డ్ లెవల్ ఆఫీసర్ కాబట్టి ఏ స్థలం ఎఫ్టీఎల్లోకి వస్తుంది..ఏది రాదు అన్నది ఆయనే మార్క్ చేయాల్సి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి కోట్లలో డబ్బులు గుంజాడు. ఒక్కో ఫైల్ క్లియర్ చేసేందుకు లక్షల్లో లంచంగా తీసుకున్నాడు. నగదు రూపంలో మాత్రమే లంచాలు తీసుకొనేవాడు. ఆ డబ్బును స్థిరాస్తులుగా మార్చుకోవడానికి తన చిన్ననాటి స్నేహితులను వాడడం ప్రారంభించాడు. ఏదో ఒక సాకుతో, లేదంటే చిన్న పని ఉందని చెప్పి తన ఇంటర్మీడియెట్ స్నేహితుల నుంచి ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు తీసుకున్నాడు. తన సొంత అన్న, ఇతర కుటుంబ సభ్యుల ఆధార్, పాన్ కార్డులను కూడా తీసుకుని ఆస్తుల కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.లా బినామీలను పిలిచి విచారించగా.. ‘అసలు మేం ఎప్పుడు ఈ ఆస్తులు కొన్నాం? మాకు ఏమీ తెలియదు? ఏదో పని ఉందని మా దగ్గరి నుంచి ఆధార్‌కార్డు, పాన్‌కార్డులు తీసుకున్నాడు’ అని వారు సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా చదువులు కూడా పూర్తికాని తన కుటుంబ సభ్యుల పేర్లమీద కూడా కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. సాక్షుల స్టేట్మెంట్లు రికార్డు సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను విశ్లేషించిన ఏసీబీ అధికారులు.. వాటి గురించి నిఖేశ్‌ను గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఆయన ముందుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిఖేశ్‌కుమార్ ఆస్తులు కొనుగోలు చేసిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను పిలిచి, వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. మైలాన్, బ్లిస్, కపిల్ ఇన్ఫ్రా కంపెనీల్లో నిఖేశ్‌కుమార్ మొత్తం నగదు రూపంలోనే పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. పలు బ్యాంకు లాకర్లలో నిఖేశ్ దాచి ఉంచిన బంగారం ఇతర ఖరీదైన వస్తువులు, ఆస్తుల పత్రాలపైనా వివరాలు సేకరించారు. కాగా నిఖేశ్‌ను ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియనున్నది. -
సివిల్ సప్లయ్ స్టేజ్–1 కాంట్రాక్టర్‌కు మంత్రి బినామీ
- ఎఫ్‌సీఐ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర - ఆందోళన చేస్తాం: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం : పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆశాఖ స్టేజ్–1 కాంట్రాక్ట్‌కు బినామీగా వ్యవహరిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల స్టేజ్–1 కాంట్రాక్ట్‌లన్నీ మంత్రి, టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయన్నారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి కాకుండా వేర్‌హౌస్‌ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు ఆహారధాన్యాలు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. భారత ఆ హార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ప్రతి జిల్లాలోనూ గోదాములు ఉన్నాయన్నారు. జిల్లాలో జంగాలపల్లి, తిమ్మనచెర్లలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాలలోని వేర్‌హౌస్‌ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మరోవైపు ఎఫ్‌సీఐ గోదాముల్లో పని చేస్తున్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. కందుకూరులోనే దాదాపు 400 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రామగిరి మండలంలో గనులు మూసివేసి 3 వేల కుటుంబాలు రోడ్డున పడేలా చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదేనన్నారు. ఎస్కేయూలో పని 400 మంది ఫ్రీఫుడ్ కార్మికులను తొలిగించారన్నారు. వేలాది మంది ఆరోగ్యమిత్రలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి మేట్లు, ఆదర్శరైతులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలిగించారన్నారు. ఆత్మకూరు మండలం బి. యాలేరులో చెరువు ఆక్రమణతో 400 వాల్మీకి కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. సమావేశంలో యువజన విభాగం అనంతపురం రూరల్ మండలం అధ్యక్షుడు కట్టకిందపల్లి వరప్రసాద్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.