breaking news
bikes collisioned
-
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెండు బైకులు గాల్లోకి లేచి..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అతివేగం కారణంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి వద్ద వేగంగా వస్తున్న ఓ బైక్.. మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో హై స్పీడ్‌లో బైక్ మీద వస్తున్న వ్యక్తితో సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంలో ఉన్న బైక్.. రెండు బైకులును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి లేచి రోడ్డుపై పడిపోయారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఇక, ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. -
రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి
రాచర్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగుంటపల్లి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో బైక్ పై ఉన్న యామ వెంకటేశ్వర్లు(46) అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.