breaking news
bike skid
-
ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి..
జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎలాంటి హానీ చేయకపోయినా సరే శిక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే ఇలాగే ఓ మూగజీవాన్ని శిక్షించబోయిన ఆకతాయికి ఊహించని షాక్ తలిగింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడు.. రోడ్డుపై ఉన్న ఓ గేదెను తన్నాడు. ఆ వెంటనే బైక్‌పై నుంచి జారి కిందపడ్డాడు. బైక్‌ను రైడ్ చేస్తున్న అతని స్నేహితుడు కూడా అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. Instant karma 😂 pic.twitter.com/jNFMfEf9Fm — CCTV IDIOTS (@cctvidiots) April 30, 2023 అయితే గతంలో ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గేదె ఏం చేసిందని తన్నావు.. చూడు ఇప్పుడు నీకు ఏం జరిగిందో.. అందుకే మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలికారు. మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇన్స్టాంట్ ఖర్మ అంటే భయ్యా.. తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. క్షణం కూడా ఆలస్యం కాదు.. అంటూ యువకుడ్ని చీవాట్లు పెట్టాడు. చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం! -
నల్లకుంటలో ఘోర ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి
-
ఘోర ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని విద్యానగర్- నల్లకుంట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సౌత్ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఎండ్రిక్ హఠన్(23) అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఎండ్రిక్ విద్యానగర్ నుంచి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళ సభ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బైక్‌పై అధిక వేగంతో వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో అధిక వేగంతో డివైడర్‌ను డీకొని స్తంభానికి బలంగా డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. -
బైక్‌ను తన్నిన పోలీసు.. గర్భిణి మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: హెల్మెట్ చెకింగ్ కోసం ఆగకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంబడించి కాలితో తన్నడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ గర్భిణి మరణించింది. బైక్ నడుపుతున్న ఆమె భర్తకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో జరిగింది. తిరుచ్చిరాపల్లిలోని తువకూడీ టోల్‌ప్లాజా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా భార్యతో కలసి బైక్‌పై బయలుదేరిన రాజాను ఆపడానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కామరాజ్ యత్నించారు. కానీ రాజా బైక్‌ను ఆపలేదు. వెంటనే మరో బైక్‌పై వెంబడించిన కామరాజ్.. తిరుచ్చిరాపల్లి–తంజావూరు హైవేపై రాజా బైక్‌ను కాలితో తన్నారు. దీంతో బైక్‌పై ఉన్న దంపతులిద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల గర్భిణి ఉషాను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కామరాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉషా మృతికి సంతాపం తెలిపిన సీఎం పళనిస్వామి.. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఉష కుటుంబానికి రూ.రెండు లక్షల ఆర్థిక సాయాన్ని మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రకటించారు. -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో
-
ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ఆ వైపు నుంచి ఓ ట్రక్కు వస్తోంది. అంతలో ఓ బైక్ అత్యంత వేగంగా వచ్చి టర్నింగ్ పాయింట్ దగ్గర స్కిడ్ అయి ట్రక్కు కిందకు దూసుకుపోయింది. ట్రక్కు కింద బైక్ పడితే ఎలా ఉంటుందో ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. చూడటానికి ఇది ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం. కానీ ఈ ప్రమాదంలో బైక్‌లోని ఏ పార్టు పనికిరాకుండా పోయింది.. బైకు పైన ఉన్న వ్యక్తికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. జస్ట్ మిస్ లేకపోతే ప్రాణాలు పోయేవి. బహుషా చావును దగ్గరి నుంచి చూడటం అంటే ఇదేనేమో.. ఇతనికి భూమి మీద నూకలున్నాయనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
విషాద యాత్ర
మారేడుమిల్లికి మిత్రులతో కలిసి బయలుదేరిన విద్యార్థులు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బైక్ ఇద్దరు విద్యార్థులు దుర్మరణం గోకవరం: వారంతా నవయువకులు.. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎనిమిది మంది మారేడుమిల్లికి విహారయాత్రకు బయలుదేరారు. గమ్యం చేరకుండానే ఓ మలుపు రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. గోకవరం మండలం సింగారమ్మచింత, జగన్నాథపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కన చెట్టుని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. కాకినాడకు చెందిన ఓలేటి లోవరాజు (19), గుత్తుర్తి పవన్‌కళ్యాణ్ (20), కొల్లు సతీష్, మరో ఐదుగురు యువకులు కలిసి మూడు బైక్‌లపై శనివా రం ఉదయం 6 గంటలకు కాకినాడ నుంచి మారేడుమిల్లి విహారయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యలో మల్లిసాల వద్ద తెలిసిన వారి ఇంటి వద్ద అల్పాహారం తీసుకుని తొమ్మిది గంటలకు ప్రయాణం కొనసాగించారు. అక్కడ బయలుదేరిన కొద్ది సేపటికే సింగారమ్మచింత దాటిన తరువాత భారీ మలుపులో వీరు ప్రయాణిస్తున్న ఒక పల్సర్‌బైక్ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓలేటి రాజు, గుత్తుర్తి కళ్యాణ్ అక్కడికక్కడే మృత్యువాత పడగా అదే వాహనంపై ఉన్న సతీష్ తీవ్ర గా యాలపాలయ్యాడు. అతడిని సహచరులు 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులు ఇద్దరూ కాకినాడ ఏపీటీ కళాశాల విద్యార్థులు కాగా, క్షతగాత్రుడు పదో తరగతితో చదువు ఆపేశాడు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఘటన స్థలానికి చేరుకున్న గోకవరం పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అదే మలుపులో రెండు వారాల క్రితం ఓ కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఆ కారు అక్కడే ఉంది. కారును ఆనుకుని ఉన్న చెట్టును ఢీకొని ప్రస్తుతం ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. బైక్ వేగంగా నడపడంతో మలుపులో ఉన్న కారును చూసి కంగారు పడి వాహనాన్ని అదుపు చేయలేక చెట్టుని ఢీకొట్టి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సహ విద్యార్థులు మాత్రం తాము ముందు వెళ్తున్నామని వెనుక వస్తున్న బైక్ చెట్టుని ఢీకొట్టి శబ్ధం రావడంతో వెనక్కు వెళ్లామంటున్నారు. ఎస్సై వెంకటసురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెగిపోయిన ఆధారం కాకినాడ క్రైం : వారిద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులు. ఒకరు రెండో సంవత్సరం చదువుతుండగా, మరొకరు కోర్సు పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. స్నేహితులతో మారేడుమిల్లి జలపాతం వద్దకు విహార యాత్రకు కాకినాడ నుంచి మూడు బైక్‌లపై ఎనిమిది మంది ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. వారిలో ఒక వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మంచి ఉద్యోగం చేస్తాడనుకుంటే.. కాకినాడ ఫ్రేజర్‌పేట ధనమ్మతల్లి వీధికి చెందిన ఓలేటి లోవరాజు స్థానిక ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి కామేశ్వరరావు మోటరైజ్డ్ బోట్‌పై చేపలవేటకెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇంట్లో ఎవరూ పెద్దగా చదువుకోక పోవడంతో మూడో కుమారుడైన రాజును కష్టపడి చదివిస్తున్నాడు. ‘స్నేహితులం వాటర్ ఫాల్స్ వద్ద ఫొటోలు తీయించుకోవడానికి వెళుతున్నాం అమ్మా, సాయంత్రానికి తిరిగొచ్చేస్తాం. నాన్నతో చెప్పి కంగారు పెట్టకు’ అని ఇంటి వద్ద నుంచి శనివారం ఉదయం 6 గంటలకు బయలుదేరి వెళ్లిన తన కుమారుడు ఇలా అర్థాంతరంగా మృతి చెందుతాడని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా తల్లి పార్వతి విలపించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. ఉద్యోగం చేసి ఇల్లు కట్టిస్తానన్నాడు.. ‘అమ్మా.. నాన్నా, నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నాన్న రెక్కల కష్టంపైనే కుటుంబ గడవడం కష్టంగా ఉండేది. పాడైన పెంకుటింటిని అప్పు తీసుకుని పక్కాగా కట్టిస్తాను’ అని చెప్పిన కొన్ని రోజులకే ఇలా అర్థాంతరంగా తమ కుమారుడు గుత్తుర్తి పవ¯ŒS కల్యాణ్ (18) మృతి చెందుతాడనుకోలేదని తల్లి సత్యవతి విలపించిన తీరు హృదయవిదారకంగా ఉంది. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, మోటార్ బైక్‌పై వద్దు ఆర్టీసీ బస్సుపై వెళ్లమని చెప్పినా, వినకుండా స్నేహితుడి బైక్‌పై వెళ్లి ఇలా తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా అంటూ గుండెలు బాదుకుంటూ విలపించింది. తనకు ఇద్దరు సంతానమని, కుమార్తె తర్వాత పదమూడేళ్లకు పుట్టిన నువ్వు ఇలా మృత్యువుకు చేరుతావనుకోలేదని విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. వీరితో పాటూ బైక్‌పై వెళ్లిన కాకినాడ పాతబస్టాండ్ వెంకటేశ్వరకాలనీకి చెందిన కొల్లు సతీష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఇతని తలకు తీవ్రంగా గాయాలు కావడం, తల, ముక్కు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సతీష్ మెయి¯ŒSరోడ్డు బట్టలు దుకాణంలో సేల్స్మే¯ŒSగా పనిచేస్తున్నాడు. తండ్రి వీరబాబు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మారేడుమిల్లి పిక్నిక్కు వెళ్లొస్తామని చెప్పి వెళ్లిన తమ కుమారుడు ఇలా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అపస్మారకస్థితిలో ఉండడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.