అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి
విశాఖపట్నం: అతివేగం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన తిమ్మాపురం-రుషికొండ మధ్య దారిలో చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న నితిన్(18), విజయహాసిని(18) మృతి చెందగా మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నితిన్ దువ్వాడ కాలేజిలో బీటెక్ చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.