అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి | students dies in a road accident in visakha | Sakshi
Sakshi News home page

అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి

Jan 27 2017 10:24 PM | Updated on Nov 9 2018 4:12 PM

అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి - Sakshi

అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి

అతివేగం ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది.

విశాఖపట్నం: అతివేగం ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన తిమ్మాపురం-రుషికొండ మధ్య దారిలో చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న నితిన్(18), విజయహాసిని(18) మృతి చెందగా మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నితిన్‌ దువ్వాడ కాలేజిలో బీటెక్ చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement