breaking news
Bigbi Amitabh Bachchan
-
KBC 13: చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అమితాబ్ సాయం
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబచ్చన్‌కి ఉన్న గొప్ప మనసు గురించి తెలిసిందే. ఆయన ఎంతోమందికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఓ చిన్నారికి సైతం ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. వివరాలు ఇలా.. కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి బిగ్ బీ హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేబీసీ 13వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి అతిథులుగా సెలబ్రీటీలను పిలవడం పరిపాటి. ఎవరు వచ్చినా గెలుచుకున్న ప్రైజ్‌మనీని ఏదో ఒక మంచి పనికి ఉపయోగిస్తుంటారు. తాజాగా ఈ షోకి కొరియోగ్రాఫర్, దర్మకురాలు ఫరాఖాన్, హీరోయిన్ దిపికా పదుకొనే అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌కి చెందిన కొత్త ప్రోమోని సోనీటీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరిలాగే తాము గెలుచుకున్న మొత్తాన్ని స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న 17 నెలల చిన్నారి అయాన్ష్ సహాయార్థం ఇస్తామని ఫరాఖాన్ తెలిపింది. ఆ బాలుడికి రెండో ఏటా వేయాల్సిన ఒక ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లని, అందుకే చికిత్స కోసం సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపి ఎమోషనల్ అయింది. అమితాబ్ మాట్లాడుతూ.. ‘విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అయాన్ష్ కోసం ఫరా ఈ షోలో పాల్గొంటోంది. నాకు ఇక్కడ చెప్పాలో లేదో తెలియట్లేదు కానీ ఆ చిన్నారికి నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను’అని తెలిపాడు. కానీ ఎంత మొత్తం చేసేది మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా దీపికా తన ఫౌండేషన్ ‘లివ్ లవ్ లాఫ్’ గురించి షోలో మాట్లాడింది. 2014లో చాలా డిప్రెషన్లోకి వెళ్లానని, ఆ సమయంలో చనిపోవాలని కూడా అనుకున్నానని భావోద్వేగానికి లోనైంది. అందుకే మానసికంగా బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు ఫౌండేషన్ నెలకొల్పినట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
టాప్ హీరోయిన్ కాలేకపోయా..
పలు భాషల్లో నటించినా ప్రముఖ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయానని నటి తాప్సీ వాపోతున్నారు. బహుభాషా నటిగా గుర్తింపు పొందిన మూడు పదుల వయసుకు చేరవలో ఉన్న ఈ ఢిల్లీ భామ తమిళంలో ధనుష్ సరసన ఆడుగళం చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత కూడా జీవా తదితర పలువురు యువ నటులకు జంటగా నటించారు. ఇటీవల కాంచన-2లో లారెన్స్‌తో నటించి విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా దిగుమతి అయ్యారు. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా టాప్ నాయికల వరుసలో చేరలేకపోయారు. ఇది తనకు బాధాకరమైన విషయమేనంటున్న తాప్సీ ప్రముఖ హీరోల సరసన నటిస్తేనే తగినంత ప్రాచుర్యం లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్లో రాణించడం చాలా కష్టం అంటున్న తాప్సీకీ ఇప్పుడు బిగ్‌బీ అమితాబ్‌తో నటించే లక్కీ ఛాన్స్ లభించింది. అదే విధంగా అక్షయ్‌కుమార్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాలపై తను చాలా నమ్మకం పెట్టుకున్నారట. ఈ రెండు చిత్రాలు విడుదలైన తరువాత తన రేంజే మారిపోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కచ్చితంగా తానూ టాప్ హీరోయిన్ అనిపించుకుంటాననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.