breaking news
Bhuma Akhila
-
నీకు సస్పెన్షన్ కి.. రిజిగ్నేషన్ కే తేడా తెలీదు, అఖిలప్రియకి గంగుల కౌంటర్
-
సంప్రదాయాన్ని కొనసాగిద్దాం
* ఆళ్లగడ్డ ఉపఎన్నికపై అన్ని పార్టీలకు మైసూరా విజ్ఞప్తి * ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా అంతా సహకరించాలి * 15న కలిసేందుకు సమయం ఇచ్చిన సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతూ మరణించిన వారి స్థానంలో వారి కుటుంబసభ్యులు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగించాలని వైఎస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన భూమా అఖిలపై పోటీ పెట్టరాదని తాము అందరినీ కోరుతున్నామన్నారు. తమ పార్టీ తరఫున ద్విసభ్య కమిటీ దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసేందుకు ప్రయత్నించగా ఈ నెల 15వ తేదీన కలిసేందుకు సమయం ఇచ్చారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మృతితో ఖాళీ అయిన నందిగామ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేయవద్దని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ వైఎస్సార్సీపీని కోరారన్నారు. దీంతో సంప్రదాయాన్ని అనుసరించి తమ పార్టీ అభ్యర్థిని అక్కడ పోటీలో నిలబెట్టలేదన్నారు. ఆళ్లగడ్డ ఎన్నికల సమయంలో తమ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మృతి చెందడంతో ఆమె కుమార్తెను ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ప్రకటించామన్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం తమ అభ్యర్థిపై పోటీ చేయవద్దని అందరినీ కోరుతున్నామని వివరించారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో ఉండటంతో ఫోన్లో తెలియచేసినట్లు చెప్పారు. పార్టీలో చర్చించి చెబుతామని వారు తెలిపారన్నారు. సీపీఐ, సీపీఎం నేతలను కూడా కలిసి పోటీ పెట్టవద్దని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.


