'మా భూములు ఇవ్వం'
విజయనగరం: భోగాపురం విమానాశ్రయ భూముల సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను వారు మధ్యలోనే నిలువరించారు. డిప్యూటీ కలెక్టర్ అనిత సహా సర్వే అధికారులను సర్వే చేయకుండా ఆపేశారు.
తమ భూములు విమానాశ్రయం కోసం ఇవ్వబోమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట చోటుచేసుకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.