breaking news
Bharti Cements
-
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత
సాక్షి, అమరావతి: పచ్చ ముఠాల దౌర్జన్యం.. విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్‌తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు! భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. క్రమశిక్షణరాహిత్యంలో భాగంగా కాంట్రాక్టర్ తొలగించిన కొంత మంది, ఇతరులతో కలిసి భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకుని ఉత్పత్తి నిలిపేయాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్లాంట్‌లోకి వెళ్లే దారులను మూసివేసి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అల్లరి మూకల దౌర్జన్యం వల్ల గని నుంచి లైమ్‌స్టోన్, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గతంలో రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదని మోహన్‌రెడ్డి వివరించారు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అంతేకాక ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం నష్టం కలుగుతోందని తెలిపారు. కొందరి రాజకీయాలతో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం... ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, కొందరి రాజకీయాల వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం నెలకొందని మోహన్‌రెడ్డి తెలిపారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ, ఖజానాకు పన్నుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్న కంపెనీ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో ఇదే రీతిలో కొందరు ఇండియా సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చిందని నివేదించారు. ఈ రోజు కూడా ప్లాంట్‌కు వెళ్లకుండా దారిలో టెంట్ వేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. 10 మందిపై చర్యలు తీసుకునేలా పరిస్థితిలో కూడా పోలీసులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్లాంట్‌లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కంపెనీపై ఆధారపడి బతుకుతున్న కారి్మకులను దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
ఉన్మాదానికి పరాకాష్ట..!
సాక్షి ప్రతినిధి, కడప: కల్తీనెయ్యి దుష్ప్రచార కుట్ర బయటపడడం, హెరిటేజ్ – ఇందాపూర్ బంధం బట్టబయలు కావడంతో కన్నంలో దొరికిపోయిన దొంగలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీన్నుంచి బయటపడడం కోసం బాబు అండ్ కో రకరకాల కుయుక్తులు ప్రదర్శిస్తోంది. ఉన్మాదం పరాకాష్టకు చేరుకుందా అన్నట్లు టీడీపీ పెద్దల ఆదేశాలతో తెలుగు తమ్ముళ్లు శుక్రవారం భారతీ సిమెంట్ కర్మాగారంపై పడ్డారు. కిలో నెయ్యి రూ. 300 నుంచి రూ. 658కి పెంచి హెరిటేజ్‌కు చెందిన ఇందాపూర్ డెయిరీకి టీటీడీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిపోవడంతో డైవర్ట్ చేయడం కోసం టీడీపీ నాయకులు ఓ కొత్త నాటకాన్ని ప్రదర్శించారు. హెరిటేజ్ పేరు బయటకు రావడంతో జనం దృష్టిని మళ్లించడం కోసం ఆపసోపాలు పడ్డారు. 18 ఏళ్ల క్రితం పెట్టిన భారతీ సిమెంట్ కంపెనీ వద్ద నిర్వాసితుల ఆందోళన పేరుతో తెలుగు తమ్ముళ్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో టీడీపీ స్థానిక నాయకులు కొంతమందిని పోగేసి నల్లింగాయపల్లె పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు. హైడ్రామా సృష్టించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు హెరిటేజ్‌కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఇప్పించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలను ప్రపంచమంతా చూసింది. అవి బయటపడడంతో భారతీ సిమెంట్ పైకి మనుషులను పంపించి కృత్రిమ ఆందోళనలు చేయించడం చూసి జనం ఆశ్చర్యపోయారు. చంద్రబాబు బృందం చూపిన ఈ నాటకాల బాటనే మిగిలిన వారు అనుసరిస్తే రేపు హెరిటేజ్ పరిస్థితి ఏమిటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.నిర్వాసితులకు అదనపు పరిహారం, ఉద్యోగాలు..భారతీ సిమెంటు కర్మాగారానికి అవసరమైన భూములను 2006లో సేకరించారు. ఎకరం రూ.1.5లక్షలతో కొనుగోలు చేశారు. 2010లో మరికొంత మంది రైతులు తమ భూములు తీసుకోవాలని అభ్యర్థిస్తే ఎకరం రూ.3.5లక్షలు చెల్లించి తీసుకున్నారు. అంతకు ముందు ఎకరం రూ.1.5లక్షలతో తీసుకున్న రైతులకు కూడా వారు కోరకపోయినా అదనంగా రూ.2లక్షలు చెల్లించారు. అంటే ప్రతి ఒక్క రైతు భూమి ఎకరాకు రూ.3.5లక్షలు చెల్లించారన్నమాట. పరిశ్రమ పూర్తయి 2009 నుంచి సిమెంటు ఉత్పత్తి జరుగుతోంది. పరిశ్రమకు భూములిచ్చిన 120 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు సంతోషంగా ఉన్నారు. నిర్వాసితుల నుంచి ఎలాంటి సమస్య, ఆందోళనలేదు. ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కాలుష్యం పేరిట, ఉద్యోగాల పేరిట తెలుగుతమ్ముళ్లు హడావిడి చేశారు. ఎప్పుడూ లేనిది ఇప్పడే ఎందుకు ఇలా హడావిడి చేస్తున్నారు అని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. సీఎంఓ డైరెక్షన్లో కమలాపురం తెలుగుతమ్ముళ్లు ఈ యాక్షన్ చేస్తున్నారని అక్కడివారు చర్చించుకోవడం విశేషం. -
‘ఖేలో ఇండియా జీతో ఇండియా’ గీతం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: భారతి సిమెంట్స్ నిర్మాణంలో ప్రముఖ ఆల్బమ్ తయారీ సంస్థ సెవెన్ నోట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఖేలో ఇండియా జీతో ఇండియా’అనే గీతాన్ని ఆదివారం రెడ్ ఎఫ్ఎం వేదికగా ఆవిష్కరించారు. టీ 20 వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ప్రారంభమైన నేపథ్యంలో ఈ పాటను రూపొందించామని భారతి సిమెంట్స్ యాడ్స్ మేనేజర్ విజయ్ తెలిపారు. రచయిత సిరాశ్రీ రాసిన పాటకు తాళ్లూరి నాగరాజు సంగీతాన్ని సమకూర్చారు. ప్రముఖ గాయకుడు కార్తిక్ గాత్రం అందింగా సత్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. టీ 20 వరల్డ్‌కప్ సాధించడానికి టీమిండియాకు అన్ని అర్హతలున్నాయని, ఈసారి కప్‌తో వస్తారని సెవెన్ నోట్స్ క్యూరేటర్ మణి ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ పాటతో టీమిండియాకు అభినందనలు తెలుపుదామని పిలుపునిచ్చారు. -
ఉన్నత స్థాయి ప్రమాణాల వల్లే ఆదరణ
భారతి సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి కడప: భారతి సిమెంట్స్ నాణ్యత విషయంలో అగ్రగామిగా నిలిచిందని కంపెనీ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం కడపలోని మానస హోటల్లో నిర్వహించిన సబ్ డీలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతి సిమెంట్స్ ఉన్నత స్థాయి నాణ్యత ప్రమాణాలను పాటిస్తోందని, సరైన సర్వీసులు అందిస్తోందని అందుకే నమ్మకమైన సిమెంటుగా తక్కువ కాలంలోనే వినియోగదారుల నమ్మకాన్ని సాధించిందని చెప్పారాయన. కార్యక్రమంలో కంపెనీ సీనియర్ టెక్నికల్ మేనేజర్ సి.ఓబుల్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన పలువురు సబ్ డీలర్లు, కంపెనీ మార్కెటింగ్ ఏజీఎం ఎం.నరసింహారెడ్డి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ ఎ.ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.


