మారుతి దర్శకత్వంలో రామ్‌చరణ్
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్ తరువాత చేయబోయే సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ, సుకుమార్ లాంటి దర్శకులను లైన్లో పెట్టిన చెర్రీ, ఇప్పుడు ఆ లిస్ట్‌లో మరో దర్శకుణ్ని చేర్చాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచే చిన్న దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్న మగధీరుడు ఇటీవల ఓ భారీ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు.
ఒకప్పుడు డబుల్ మీనింగ్ సినిమాలు మాత్రమే తీస్తాడన్న పేరున్న మారుతి, భలే భలే మగాడివోయ్ సక్సెస్‌తో ఆ పేరు చెరిపేసుకున్నాడు. ముఖ్యంగా క్లీన్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ భారీ వసూళ్లను సాధించి మారుతిని స్టార్ డైరెక్టర్‌ను చేసింది. దీంతో వెంకటేష్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు మారుతి.
ప్రస్తుతం వెంకీ హీరోగా బాబు బంగారం సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి, ఆ సినిమా తరువాత రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, మారుతికి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.