breaking news
bhagatsingh
-
కంగనాను భగత్ సింగ్‌తో పోల్చిన హీరో
సాక్షి, చెన్నై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో మొదలైన వివాదం తర్వాత అనేక మలుపులు తిరిగింది. డ్రగ్స్ వినియోగం వెలుగులోకి రావడం.. అనంతరం కంగనా బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించడం.. ఆ తర్వాత ముంబైని పీఓకేతో పోల్చడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో కేంద్రం కంగనాకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్లో జరుగుతున్న ఈ పరిణామాలపై దక్షిణాది హీరో విశాల్ స్పందించారు. కంగనాపై ప్రశంసలు కురిపించడమే కాక ఆమెను ఏకంగా భగత్ సింగ్‌తో పోల్చారు. ఈ మేరకు విశాల్ ట్వీట్ చేశారు. ‘మీ ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్.. ఓ విషయం గురించి మాట్లాడటానికి మీరు రెండు సార్లు ఆలోచించలేదు. ఏది తప్పు.. ఏది ఒప్పు అని బేరీజు వేయలేదు. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు. అయినా ప్రభుత్వ ఆగ్రహాన్ని ఎదుర్కొంటూనే.. మీరు బలంగా నిలబడ్డారు. ఇది చాలా పెద్ద ఉదాహరణ. మీరు చేసిన ఈ పని.. గతంలో అంటే 1920లో భగత్‌సింగ్ చేసినదానికి సమానమైనది’ అంటూ ప్రశంసించారు విశాల్. (చదవండి: కంగనాను బెదిరించలేదు: సంజయ్ రౌత్) Dear @KanganaTeam pic.twitter.com/73BY631Kkx — Vishal (@VishalKOfficial) September 10, 2020 అంతేకాక ‘తప్పు జరగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే సెలబ్రిటీనే కావాల్సిన అవసరం లేదు.. ఓ కామన్ మ్యాన్ కూడా చేయవచ్చు అని నిరూపించారు. నేను మీకు నమస్కరిస్తున్నాను’ అంటూ విశాల్ ట్వీట్ చేశారు. పలు సామాజిక అంశాల పట్ల తన గళాన్ని విప్పే విశాల్.. ఇలా కంగనాకు మద్దతుగా నిలవడంపై ఇండస్ట్రీలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
వందేళ్లకు పైగా బతకాలంటే..
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భగత్ సింగ్ అనుచరుడు నసీమ్ మీర్జా చంగేజి (106) తన నూరేళ్ల జీవన ప్రస్థానానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఆరోగ్యంగా వందేళ్లు జీవించాలంటే అన్ని విషయాల్లోనూ మితంగా ఉండటమే మేలని సూచించారు. తన ఆరోగ్య రహస్యం చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారనీ...దీనికి ఏ డాక్టర్ దగ్గర పరిష్కారం లేదని తేల్చి చెప్పారు. తక్కువ తినాలి..తక్కువ మాట్లాడాలి.. తక్కువ నిద్రపోవాలని, అదే తన ఆరోగ్య రహస్యమని నసీమ్ స్పష్టం చేశారు. లైఫ్ స్పాన్ ను పొడిగించే మందులేవీ వైద్యుల దగ్గర లేదన్నారు. తాను హాకీ చాంపియన్ అనీ, రోజూ సాయంత్రం హాకీ సాధన చేస్తానని తెలిపారు. హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ తో హాకీ ఆడేవాడినని గుర్తు చేసుకున్నారు. షహీద్ భగత్ సింగ్ స్వేచ్ఛా భారతాన్ని చూడాలనుకుంటున్నారు. అందుకే పార్లమెంట్ లో బాంబులు విసిరారు. బ్రిటిష్ ప్రభుత్వం భగత్ ను ఉరి తీస్తుంది, లేదా జీవిత ఖైదు చేస్తుందని హెచ్చరించినా భగత్ వినలేదనీ నసీమ్ మీడియాకు తెలిపారు. తాను కూడా స్వాతంత్య్ర సమరయోధుడనే.. కానీ చావాలనుకోలేదు.. భారతదేశం స్వాతంత్ర్యం చూడాలనుకున్నానని తెలిపారు. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, భగత్ సింగ్ కలలు కన్న స్వేచ్చ సమాజంలో రాలేదని నిరాశ వ్యక్తం చేశారు. అన్ని మతాలు, కులాలు సామరస్యం, శాంతితో జీవించాలని భగత్ సింగ్ కోరుకున్నారన్నారు. భగత్ సింగ్ కు ఆశ్రయం ఇచ్చినట్టు తెలిసి ఉంటే బ్రిటీష్ ప్రభుత్వం తనను కూడా ఉరి తీసేదన్నారాయన. అలాగే సుభాష్ చంద్ర బోస్ పంజాబ్ వెళ్లి బాంబులు ఎలా తయారు చేయాలో యువత బోధించాడని , ఆ తరువాత జపాన్ వెళ్లి, భారత జాతీయ కాంగ్రెస్ మూలాలను ఏర్పాటు చేశాడనీ, ఓడ ప్రమాదంలో మరణించాడని తెలిపారు. కాగా షహీద్ దివాస్ ఉత్సవం (అమరుల డే) సందర్భంగా మార్చి 23 న ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో అమరవీరుల భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల విగ్రహాలకు ఆవిష్కరణ సందర్భంగా నసీమ్ ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సత్కరించారు.