breaking news
Bhadarchalam
-
APSRTC: ఆర్టీసీలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయం
సాక్షి, అమరావతి: విమాన ప్రయాణాల తరహాలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఒక పట్టణం లేదా నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యంలేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తిరుపతి నుంచి భద్రాచలం వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తిరుపతి నుంచి విజయవాడకు, అక్కడి నుంచి భద్రచలానికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 22 గంటల వరకు ఉండవచ్చు. మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దశల్లో మరిన్ని పట్టణాలకు ఈ సౌలభ్యాన్ని విస్తరించనుంది. ఇది కూడా చదవండి: బాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు -
శ్రీసీతారాముల కళ్యాణ వైభోగం
-
టెండర్లు లేకుండానే హుండీలు, టేబుళ్లు కొనుగోలు
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. భక్తుల సౌకర్యాలు, ఆలయ అవసరాల పేరిట చేపట్టే పనుల్లో నిబంధనలను కాలరాస్తున్నారనే ఆరోపణలున్నాయి. దేవస్థానం అన్నదాన సత్రంలో 20 టేబుళ్లు, పర్ణశాల ఆలయం కోసం 8 హుండీలను కొనుగోలు చేశారు. గుంటూరులో తయారు చేయించినట్లుగా చెపుతున్న వీటిని ఆదివారం భద్రాచలం తీసుకొచ్చారు. టేబుళ్ల కోసం సుమారు రూ.2 లక్షలు, హుండీలకు రూ.1.50 లక్షలు వెచ్చించినట్లు తెలిసింది. ఈ టేబుళ్లను కొత్తగా నిర్మించిన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భద్రాద్రి రామాయంలో ఉన్న హుండీలను పర్ణశాలకు పంపించి, కొత్తగా తెచ్చిన వాటిని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలయాధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సరిపడా హుండీలు ఉన్నప్పటికీ.. మళ్లీ కొత్తగా కొనుగోలు చేయటం విమర్శలకు తావిస్తోంది. కాగా, ప్రస్తుతం అన్ని దేవాలయాల్లోనూ స్టీల్ హుండీలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. డబ్బులు, ఇతర కానుకలు తుప్పు పట్టకుండా ఉండేందుకు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే భద్రాద్రి దేవస్థానం అధికారులు కొత్తగా కొనుగోలు చేసినవి ఇనుపవి కావటం గమనార్హం. అందులోనూ గేజ్ తక్కువగా ఉన్న ఇనుముతో చేసినవి కావడంతో ఇవి కొంతకాలం మాత్రమే ఉపయోగపడతాయని పలువురు అంటున్నారు. నిబంధనలు పట్టవా..? దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా టెండర్లను పిలవాలి. కానీ ఇక్కడి అధికారులు కొటేషన్ ద్వారా ఈ పనులు అప్పగించినట్లు తెలిసింది. కమీషన్ల కోసమే వారు ఇలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. గతంలో అన్నదాన సత్రంలో భోజనాలు వడ్డించే ట్రేలను తయారుచేసిన దుకాణదారుల నుంచే వీటిని కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది. భోజనం వడ్డించేందుకు చంధ్రశేఖర్ ఆజాద్ ఈవోగా ఉన్న సమయంలో రెండు ట్రేలను కొనుగోలు చేయగా, అవి నాసిరకంగా ఉండటంతో బిల్లు చెల్లించేందుకు ఆయన నిరాకరించారు. అవి కొంతకాలానికే నిరుపయోగంగా మారాయి. వాటిని అన్నదాన సత్రంలోని ఓ మూలన పడేయగా, ప్రస్తుతం తప్పుపట్టాయి. అయితే వీటికి కూడా బిల్లు చేసి ఆ మొత్తాన్ని కాజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానానికి పాలకమండలి కూడా లేకపోవటంతో అడిగే వారు లేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని భ క్తులు కోరుతున్నారు. కొటేషన్లతోనే కొనుగోళ్లు : రవీందర్, దేవస్థానం ఏఈ కొటేషన్ల ద్వారానే హుండీలు, భోజనం చేసేందుకు టేబుళ్లు కొనుగోలు చేశామని ఆలయ ఏఈ రవీందర్ తెలిపారు. నిబంధనల మేరకే అన్నీ జరిగాయన్నారు. -
భద్రాచలం మాదే.. భాగ్యనగరం మాదే..
ఖమ్మం, న్యూస్‌లైన్: భద్రాచలం, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని, లేదంటే అంతర్యుద్ధం చేస్తామని టీఎస్‌జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి హెచ్చరించారు. శనివారం టీఎస్‌జేఏసీ ఆధ్వర్యంలో ‘భద్రాచ లం మాదే.. భాగ్యనగరం మాదే..’ అనే నినాదంతో పెవిలియన్ గ్రౌండ్‌నుంచి జడ్పీ సెంటర్‌కు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. భద్రాచలం జిల్లాలో 500 ఏళ్లుగా అంతర్భాగంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సం స్కృతీసంప్రదాయాలకు నిలయంగా ఉన్న భద్రాచలంను తెలంగాణ ప్రాంతనుంచి విడదీయాలని చూడటం అవి వేకం అన్నారు. ఆంధ్రాలో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై ఆక్కడి ఉద్యమకారులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇది సరికాదన్నారు. ఇక ముందు తెలంగాణ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి మధిర నియోజకవర్గం కన్వీనర్ బొమ్మెర రామ్మూర్తి, టీఎస్ జేఏసీ జిల్లా కన్వీనర్ మిరి యాల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు చేకూరి నరేంద్రకుమార్, సురేష్, రజనీకాంత్, వాసన్, వీరబాబు పాల్గొన్నారు.