breaking news
best-selling smartphone
-
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ అదే!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 7’ నిలిచింది. 2017 మొదటి త్రైమాసికంలో 2.15 కోట్ల ‘ఐఫోన్ 7’ యూనిట్లు అమ్ముడయినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ మార్కెట్లో జరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో ఇది ఆరు శాతంగా నమోదైంది. 1.74 కోట్ల హ్యాండ్సెట్ల అమ్మకాలతో యాపిల్ కంపెనీకే చెందిన ఐఫోన్ 7 పస్ స్మార్ట్‌ఫోన్ రెండో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా 2017 మొదటి త్రైమాసికంలో 35.33 కోట్ల స్మార్ట్ఫోన్లు సేల్ అయినట్టు స్ట్రాటజీ ఎనలిటిక్స్ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్-5 స్మార్ట్ఫోన్లలో రెండు యాపిల్ కంపెనీవే కావడం విశేషం. 89 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఒప్పో ఆర్9ఎస్ మూడో స్థానంలో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ జే3, శామ్సంగ్ గెలాక్సీ జే5 నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. కాగా, భారత్‌లో టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 5ఎస్’ అవతరించింది. -
2016 బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ ఏదో తెలుసా?
లండన్ : స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో జోరు మీదున్న ఆపిల్ మరోసారి తన సత్తా చాటుకుంది. 2016లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ కిరీటం ఆపిల్ ఐఫోన్ 6ఎస్ దక్కించుకుంది. ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 2016లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ నిలిచినట్టు తెలిసింది. ఇటీవల ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఐఫోన్ 7, నాలుగో క్వార్టర్లో బెస్ట్-సెల్లర్ గా నిలిచినట్టు ఈ ర్యాంకింగ్స్ తెలిపాయి. దాని తర్వాత ఐఫోన్ 7ప్లస్ ఉంది.ఎన్నో నూతన ఆవిష్కరణలను, కొత్త కొత్త ఫీచర్లతో ఐఫోన్లను ఆపిల్ మార్కెట్లోకి తీసుకొస్తుడటంతో కంపెనీ మళ్లీ సత్తా చాటుకుంటోందని ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపింది. కొత్త ఫోన్లతో పాటు పాత ఐఫోన్లను కంపెనీ విక్రయాలకు ఉంచుతోందని రిపోర్టు పేర్కొంది. 2016లో ఎక్కువగా రవాణా అయిన స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో పాత ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్లే ఉన్నాయని మార్కిట్ వెల్లడించింది. అదేవిధంగా గెలాక్సీ నోట్7 పేలుళ్లకు ముందు మార్కెట్లో తన సత్తా చాటిన శాంసంగ్ ఫోన్లు గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎస్7లు కూడా ఐదు, తొమ్మిదవ స్థానాల్లో నిలిచాయి. పేలుళ్ల దెబ్బతో శాంసంగ్ అల్లాడినప్పటికీ, ఎక్కువగా సరుకురవాణా అయిన టాప్-10 స్మార్ట్ఫోన్లలో శాంసంగ్ ఫోన్లే ఐదున్నాయి. టాప్-10 ర్యాంకింగ్స్ లో చైనీస్ కంపెనీ ఓపో మోడల్స్ కూడా నిలిచాయి.