జాతీయ ఉత్తమ రైతుగా బులిరాజు
కొత్తపేట :
కొత్తపేటకు అభ్యుదయ రైతు దండు సత్యనారాయణరాజు (బులిరాజు) కేరళ రాష్ట్రం కాసరగడ్లోని ఇండియ¯ŒS కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), సెంట్రల్ ప్లాంటేష¯ŒS క్రాప్స్ రీసెర్చ్ ఇ¯ŒSస్టిట్యూట్ (సీపీసీఆర్ఐ)ల నుంచి జాతీయ ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. బులిరాజు మందపల్లి సమీపంలోని తన కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు, సేంద్రియ విధానం, మైక్రో ఇరిగేష¯ŒSతో మొక్కలకు ఎరువులు, పురుగు మందుల వంటి పద్ధతుల్లో అధిక దిగుబడులు, ఆదాయం సాధిస్తున్నారు. బులిరాజు శనివారం కాసరగడ్లో రీసెర్చ్ ఇ¯ŒSస్టిట్యూట్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచ¯ŒS మొహపాత్ర, డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప, సోషల్ సైన్సెస్ హెడ్ డాక్టర్ ఒ.తంబ¯ŒS చేతుల మీదుగా జాతీయ ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.