breaking news
Besant Nagar
-
బ్లూ సీ డ్రాగన్! అందంగా ఉందని టచ్ చేస్తే అంతే!
బ్లూసీ డ్రాగన్లు(గ్లాకస్ అట్లాంకస్) ఒక రకమైన సముద్రపు జీవి. ఇది చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని బీచ్ తీరానికి సమీపంలో కనిపించాయి. ఇవి చూడటానికి నీలిరంగులో ఉండి వింతగా ఉంటాయి. చూస్తే పట్టుకోవాలనిపిస్తునంది. కానీ టచ్ చేశారో ఇక అంతే. చెన్నైని మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాను బీభత్సానికి బీచ్‌కి కొట్టుకొచ్చి ఉండవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువుగా సముద్రం ఉపరితలంపైనే సంచరిస్తాయి. ఇవి చాలా విషపూరితమైనవని. ఇది కుట్టిందంటే చాలా విపరీతమైన నొప్పి వస్తుందని, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా మారుతుందని అంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వత్సన్ రామ్‌కుమార్ ఈ జీవులను బీచ్‌లో గుర్తించారు. బీసెంట్ నగరంలోని బ్రోకెన్ బ్రిడ్జి సమీపంలో ఈ బ్లూసీ డ్రాగన్ సముహాన్ని చూసినట్లు తెలిపారు. అక్కడే కొందరూ వీటి కారణంగా బాధతో విలవిల లాడి ఉన్నారని, మరికొందరు ఇసుకలో చనిపోయిన ఉండటాన్నికూడా చూసినట్లు వెల్లడించారు వత్సన్. ఇవి సముద్రంలో కనిపించడం చాలా అరుదని, ఉప్పెన లేదా తుపాను సమయాల్లోనే ఒడ్డుకు నెట్టబడటంతో కనిపించడం జరుగుతుందని శాస్త్రవేత్త కిజాకుడన్ అన్నారు. ఈ నీలిరంగు డ్రాగన్ విషపూరితమైనవని, బీచ్‌ల వద్దకు వచ్చేవాళ్లకు ఇవి ప్రమాదం కలిగిస్తాయని అన్నారు. అంతేగాదు బీచ్‌ల వద్ద ఇవి కనిపిస్తే టచ్ చేయొద్దని హెచ్చరించారు కూడా. ఈ బ్లూ సీ డ్రాగన్(నీలిరంగు డ్రాగన్)ని పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్ (ఫిసాలియా ఫిసాలిస్), మ్యాన్-ఆఫ్-వార్ అని కూడా పిలుస్తారని అన్నారు. ఇది ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే పసిఫిక్ మ్యాన్ ఓ' వార్ లేదా బ్లూబాటిల్ జాతిగా పరిగణిస్తారని చెప్పారు. ఇది ఫిసాలియా జాతికి చెందిన ఏకైక జాతి అని శాస్త్రవేత్త కిజాకుడన్ వెల్లడించారు. (చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారత నగరాలు ఇవే!) -
చెన్నైలోనే ఎమీజాక్సన్
ఇతర భాషా నటీమణులు తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పుడు నక్షత్ర హోటళ్లలోనే బస చేస్తుంటారు. ఇక నటి నయనతార లాంటి టాప్ హీరోయిన్లు నక్షత్ర హోటళ్లలో ఉండే వారి ఖర్చు నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది. నిర్మాతలకు భారం తగ్గించాలన్న ఆలోచనతో నయనతార చెన్నైలో స్వంత నివాసం ఏర్పరచుకున్నారు. స్థానిక ఎగ్మూర్‌లో ఒక అధునాతన ఫ్లాట్‌ను కొనుగోలు చేసి అందులో నివశిస్తున్నారు.ఆమె ప్రేమికుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివ కూడా ఆ ఫ్లాట్‌లోనే నివశిస్తున్నట్లు సమాచారం. నటి ఎమీజాక్సన్ కూడా నయనతార బాటలోనే పయనిస్తున్నారు.మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన ఈ ఇంగ్లీష్ బ్యూటీ ఇప్పటివరకూ స్టార్ హోటల్‌నే బస చేస్తూవచ్చారు. మధ్యలో హిందీ చిత్రాలపై దృష్టి సారించిన ఎమీ అక్కడ సక్సెస్ దరిచేరకపోవడంతో మళ్లీ కోలీవుడ్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌కు జంటగా 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన ఈ భామ ఇకపై చెన్నైలోనే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారట. దీంతో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోదలచిన ఎమీ స్థానిక బీసెంట్ నగర్ సముద్రతీర ప్రాతంలో ఒక అందమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దానికి తనకు నచ్చిన విధంగా పాశ్చాత్యం సొబగులను అందించుకునే పనిలో ఉన్నారట. త్వరలోనే ఆ ఫ్లాట్‌లో మకాం పెట్టనున్న ఎమీజాక్సన్ తనకు తోడుగా తను తల్లి మార్గెట్ను తీసుకురావాలని భావిస్తున్నారట. మరో రక్షణగా ఒక విదేశీ శునకాన్ని దిగుమతి చేసుకోనున్నారట.