breaking news
Bengaluru court
-
‘ధర్మస్థళ’పై ఉష్ గప్‌చుప్!
ధర్మస్థళ వివాదం ముదిరి పాకాన పడుతోంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో 20 ఏళ్ల అవధిలో తాను వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని, కొందరి బలవంతం వల్ల తాను అలా చేయాల్సి వచ్చిందని మంజునాథ దేవస్థానపు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు చేసిన ప్రకటనతో వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వివాదం కాస్తా మంగళవారం మరో మలుపు తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ధర్మస్థళ మారణహోమం కేసుపై బెంగళూరు కోర్టు మంగళవారం గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. శ్రీ మంజునాథ ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ డి. దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా న్యాయస్థానం ఈ ఆదేశాలను ఇచ్చింది.వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ధర్మస్థళ ఉదంతానికి సంబంధించి ఉన్న 8,842 లింక్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలకు సంబం«ధించిన కవరేజీకి సంబంధించిన లింకులు తొలగించాలని, డీ–ఇండెక్స్ చేయాలని కోరిన హర్షేంద్ర తన పిటిషన్లో ‘ఎక్స్’, ఫేస్బుక్ పోస్టులు, థ్రెడ్లను ప్రస్తావించారు. ఈ వివాదంపై యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాల్లో ప్రచురించడం, ప్రసారం చేయడం, ఫార్వార్డ్ చేయడం, అప్లోడ్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.బెంగళూరులోని పదో అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో హర్షేంద్ర దాఖలు చేసిన పిటిషన్లో గ్యాగ్ ఆర్డర్‌తో పాటు జాన్ డో ఆర్డర్‌ను పొందారు. హర్షేంద్ర తన పిటిషన్లో 338 సంస్థలు, వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. 4,140 యూట్యూబ్ వీడియోలు, 932 ఫేస్బుక్ పోస్ట్‌లు, 3,584 ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌లు, 108 న్యూస్ లింక్‌లు, 37 రెడ్డిట్ పోస్ట్‌లతో పాటు 41 ’ఎక్స్’ పోస్టులతో కలిసి 8,842 లింక్‌లను తన పిటిషన్లో పొందుపరిచారు.వీటిలో ’లెట్ మీ ఎక్స్ప్లెయిన్’ ఎపిసోడ్లు, ది న్యూస్ మినిట్‌లోని వీడియోలు ఉన్నాయి. ప్రతివాదులుగా జాబితా వార్తలు, కంటెంట్, వీడియోలు ఉంచిన థర్డ్ ఐ, ధూత, సమీర్, ది న్యూస్ మినిట్, డెక్కన్ హెరాల్డ్, ది హిందూ, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ప్రజావాణి, కన్నడ ప్రభ, హోస దిగంత, బెంగుళూరు మిర్రర్, ఉదయవాణి, దినమణి, దిన తంతి, దినకరన్, సంయుక్త కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి, కేరళ, న్యూస్ కా18 తదతరాలను చేర్చారు.గ్యాగ్ ఆర్డర్ కేవలం పిటిషన్లో ప్రస్తావించిన వాటిని మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హర్షేంద్ర జాన్ డో ఆర్డర్ కోసం న్యాయమూర్తికి విన్నవించారు. ఈ మేరకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో పిటిషన్లో పేరు లేని సంస్థలు, వ్యక్తులు, పార్టీలను ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఆదేశాల జారీ సందర్భంగా న్యాయమూర్తి విజయ కుమార్ రాయ్ ‘ప్రతి పౌరుడికి ప్రతిష్ట అనే చాలా ముఖ్యమైంది. సంస్థ, దేవాలయంపై ఆరోపణ వచ్చినప్పుడు అవి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. పరువు నష్టం కలిగించే ఒక ప్రచురణ కూడా సంస్థల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వు తమ భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, దానిని రద్దు చేయాలని కోరుతూ యూట్యూబ్ పోర్టల్ థర్డ్ ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. – శ్రీరంగం కామేష్ -
కేజీఎఫ్2 ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ బ్లాక్!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. హస్తం పార్టీ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సాంగ్స్ ప్లే చేశారంటూ మ్యూజిక్ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన క్రమంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి కన్నడ చిత్రం కేజీఎఫ్-2లోని పాటలను ఉపయోగించారని ఎంఆర్టీ మ్యూజిక్ మేనేజర్ ఎం నవీన్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ సహా ముగ్గురు సీనియర్ నాయకులపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన బెంగళూరు కోర్టు.. కాంగ్రెస్ ట్విటర్ ఖాతాతో పాటు.. భారత్ జోడో యాత్ర ప్రచార ట్విటర్ హ్యాండిల్‌ను సైతం తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు! -
పాకిస్తాన్‌కు జై కొట్టిన అమూల్యకు బెయిల్
బెంగళూరు: "పాకిస్తాన్ జిందాబాద్" అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేసిన యువతి అమూల్య లియోనాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల పాటు జైలు జీవితం తర్వాత ఆమె బెయిల్‌పై విడుదల కానుంది. కాగా గురువారం నాటి విచారణలో బెంగళూరు కోర్టు ఆమె బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేస్తే ఆమె పారిపోవడంతో పాటు మరోసారి ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశముందని అభిప్రాయపడింది. (ఆమె నోట పాక్ పాట) ఫిబ్రవరి 20న బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొంది. ఇందులో ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్ఈన్ ఓవైజీ కూడా పాల్గొనగా.. అతని సమక్షంలోనే 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినదించింది. దీంతో అమూల్య వ్యాఖ్యలపై నిరసనగా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాల కింద బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. (ఆ విద్యార్ధిని బెయిల్ పిటిషన్ కొట్టివేత..) -
నిత్యానందపై అరెస్ట్ వారంట్
యశవంతపుర (బెంగళూరు): అత్యాచారం, మహిళ కిడ్నాప్ కేసుల్లో నిందితుడైన వివాదాస్పద స్వామి నిత్యానందకు రామనగర కోర్టు అరెస్ట్ వారంట్ జారీచేసింది. నిత్యానంద ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అతని లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో రామనగర కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. నిత్యానందను అరెస్ట్ చేసి తమ ముందు ఉంచాలని రామనగర పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. నిత్యానంద ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. నిత్యానంద అహ్మదాబాద్‌లోని ఆశ్రమం నుంచి విదేశాలకు పరారైనట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. కొన్నినెలలుగా నిత్యానంద బెంగళూరు శివార్లలోని బిడది ఆశ్రమానికి ముఖం చాటేశాడు. అతడు బెంగళూరులో ఉండి ప్రవచనాలు చేస్తున్నట్లు ఆయన శిష్యులు ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. బెంగళూరులో లేని వ్యక్తి ఎలా ప్రవచనాలు చేస్తాడని పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి: నిత్యానందకు నోటీసులపై వింత జవాబు) -
‘లలితా’ నగలు స్వాధీనం
టీ.నగర్(చెన్నై): తిరుచ్చి లలితా జ్యువెలరీ నగల దుకాణంలో చోరీ అయిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నేత మురుగన్ పెరంబలూరులో పాతిపెట్టినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మురుగన్‌ను శనివారం పెరంబలూరు తీసుకువెళ్లి నగలను వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెలరీలో ఈ నెల 2న దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలను దోచుకున్న విషయం తెలిసిందే. దోపిడీ మూఠాలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం ముఠాలో కీలకవ్యక్తి సురేష్ ఇటీవల లొంగిపోయాడు. -
రజనీకాంత్ స్పందిస్తారా?
బెంగళూరు: తమ ఫేవరేట్ హీరో సినిమా విడుదలైనప్పుడు అభిమానులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. తమకు నచ్చిన రీతిలో అభిమానం ప్రదర్శిస్తుంటారు. తమ హీరో కటౌట్లకు పూల దండలు వేయడం, డప్పులతో ఊరేగింపుగా సినిమాకు రావడం చేస్తుంటారు. కొంతమంది అయితే తమ అభిమాన కథానాయకుడి చిత్రపటాలపై పాలాభిషేకాలు కురిపిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే రజనీ ఫ్యాన్స్ చేసే హడావుడి తారాస్థాయికి చేరుతుంది. ఆయన పోస్టర్లకు పెద్దఎత్తున క్షీరాభిషేకం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టులో ఇన్ జంక్షన్ సూట్ ఫైల్ అయింది. తన సినిమాలు విడుదల సందర్భంగా పాలు వృధా చేయకుండా అభిమానులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేసేలా ఆదేశించాలని కోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. దీనిపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.