breaking news
Benefits to farmers
-
రైతుల ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలని.. అంతర్జాతీయ కంపెనీలు అనుసరించే దోపిడీ విధానాల నుంచి భారత రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఎస్బీఐ అధ్యయన నివేదిక సూచించింది. అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ నెలలో తదుపరి చర్చల కోసం అమెరికా బృందం భారత్‌ను సందర్శించాల్సి ఉంది. ‘‘బలమైన బహుళజాతి సంస్థలు భారత మార్కెట్లో సదుపాయాలు, వ్యవసాయ విలువ ఆధారిత ఉత్పత్తుల కల్పన, రైతుల సంక్షేమం, వారి శ్రేయస్సు దిశగా పెద్దగా పెట్టుబడులు పెట్టుకుండానే ఇక్కడి మార్కెట్ అవకాశాలను కొల్లగడతాయి. కనుక వీటి బారి నుంచి రైతుల ప్రయోజనాలను తప్పకుండా కాపాడాలి’’అని ఈ నివేదిక సూచించింది.ఒత్తిడి పెంచుతున్న ట్రంప్...బహుళజాతి సాగు సంస్థలు బడా మార్కెట్లలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండడాన్ని ప్రస్తావించింది. మొక్కజొన్న, సోయాబీన్, యాపిల్స్, బాదం, ఇథనాల్‌పై టారిఫ్‌లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వీటితోపాటు అమెరికా పాడి ఉత్పత్తులకు అవకాశాలు కలి్పంచాలంటూ డిమాండ్ చేస్తోంది. మన రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో కేంద్ర సర్కారు అమెరికా డిమాండ్లను అంగీకరించడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడింది. రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడబోదని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం తేల్చి చెప్పారు. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రోజే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ద్వారా యూఎస్‌కు స్పష్టమైన సంకేతం పంపారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే దిశగా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు పెంచేయడం గమనార్హం. ఇంధన బిల్లు పెరగొచ్చు.. ఒకవేళ అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి భారత్ నిలిపివేసినట్టయితే చమురు దిగుమతుల బిల్లు 9 బిలియన్ డాలర్లు మేర పెరుగుతుందని.. 2026–27లోనూ 11.7 బిలియన్ డాలర్లు అధికం కావొచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.‘‘ అంతర్జాతీయ చమురు సరఫరాలో రష్యా 10 శాతం వాటా కలిగి ఉంది. అన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తే, అదే సమయంలో మిగిలిన దేశాలు ఉత్పత్తిని పెంచకపోతే చమురు ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది’’అని ఈ నివేదిక పేర్కొంది. -
2025 నాటికే 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని 2025 నాటికే సాధిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి తెలిపారు. ముందుగా నిర్దేశించుకున్న 2030తో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే చేరుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలను ఈ ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఆరంభించడం గమనార్హం. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న రెండు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం 10 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. వచ్చే ఏడాదికే 20 శాతం పెట్రోల్‌ను సరఫరా చేయగలమన్న నమ్మకంతో ఉన్నట్టు పురి చెప్పారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమంతో రూ.41,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఒక ఏడాదిలో ఆదా అవుతుండగా, దేశీయ రైతులకు, పరిశ్రమలకు ఈ మేరకు ప్రయోజనం లభించనుంది. చెరకు, విరిగిన, తినడానికి అనుకూలం కాని బియ్యంతో ఇథనాల్‌ను ప్రస్తుతం మన దేశంలో తయారు చేస్తున్నారు. 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల ద్విచక్ర వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలను 50 శాతం, నాలుగు చక్రాల వాహనాల నుంచి 30 శాతం మేర తగ్గించొచ్చని అంచనా. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 2021–22లో ముడి చమురు దిగుమతుల కోసం మన దేశం 120.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
మాఫీ కావాల్సిన రుణాలు రూ.3,971 కోట్లు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రుణమాఫీ ఫైల్‌పై మొదటి సంతకం చేస్తారని జిల్లా రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. వచ్చే నెల 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానం టీఆర్ఎస్ అధినేత నిలబెట్టుకుంటారనే విశ్వాసం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. వరంగల్, న్యూస్‌లైన్: ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే జిల్లాలో సుమారుగా 4లక్షల 50వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారుల అంచనా. జిల్లాలో రైతుల రుణాలు మొత్తం రూ.3,971 కోట్లు ఉన్నాయి. వాణిజ్య, సహకార బ్యాంకుల నుంచి రైతులు ఈ రుణాలను తమ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ అవసరాల కోసం తీసుకున్నారు. సాగుకు అవసరమైన పెట్టుబడులు, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం 3లక్షల 50వేల మంది రైతులు వివిధ బ్యాంకుల వద్ద రూ.1835 కోట్ల రుణం తీసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ అవసరాలకు వివిధ వాణిజ్య బ్యాంకుల వద్ద పాస్‌బుక్ ఆధారంగా బంగారాన్ని తాకట్టు పెట్టి 40వేల మంది రైతులు రూ.550 కోట్ల రుణాలు తీసుకున్నారు. సాగు అవసరాల నిమిత్తం దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన, వ్యవసాయ అనుబంధంగా బర్రెలు, గొర్రెల పెంపకానికి, బోర్లు వేసేందుకు, నూతన యంత్రాల కొనుగోలుకు 60వేల మంది రైతులు రూ.1586 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారు. గంపెడాశతో.. అప్పుల్లో ఉన్న తమకు తెలంగాణ తొలి ప్రభుత్వం రుణమాఫీ చేసి అండగా నిలుస్తుందని రైతులు గంపెడాశతో ఉన్నారు. జిల్లాలో 40 వరకు సహకార, వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులున్నాయి. వీటిలో 31 బ్యాంకు లు రైతులకు రుణాలిచ్చాయి. జిల్లాలో 2013 -14 ఆర్థిక సంవత్సరంలో క్రాఫ్, టర్మ్, వ్యవసాయ అనుబంధ రుణాలు 2,290 కోట్లు అందజేశారుు. 2012 -13 సంవత్సరంలో రూ.1810 కోట్లు అందజేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లా లీడ్ బ్యాంకు కమిటీ నిర్ణ యం మేరకు పంట రుణాలు హెక్టార్ యూనిట్‌గా అందించే మోతాదు పెంచా రు. వరికి రూ.24,200, జొన్నకు రూ.8, 800, మొక్కజొన్నకు రూ.12,100, వాణిజ్యపంటలైన మిర్చికి రూ.33వేల నుంచి 49వేలు, పత్తికి రూ.27500గా నిర్ణయించి ఈ విధంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అప్పులపాలవుతున్న అన్నదాత సాగునీటి వసతిలేక అనేక మంది రైతులు వర్షాధార వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. చెరువులు, కుంటలు, భూగర్భ జలాలపై ఆధారపడి వివిధ పంటలు పండిస్తున్న విషయం తెలిసిందే. కరెంట్, బోర్ల నమ్ముకొని సాగు చేస్తున్నప్పటికీ విద్యుత్ కోతలు రైతులపాలిట శాపంగా మారుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు కరెంట్‌పై ఆధారపడి పంటలు వేసి పెట్టుబడి రాక అప్పులపాలవుతున్నారు. దీనికి తోడు ఇటీవల విత్తనాలు, ఎరువుల మందుల ధరలు పెరిగాయి. పెట్టుబడికి ప్రభుత్వ, సహకార బ్యాంకుల కంటే ప్రైవేటు వడ్డీవ్యాపారలపైనే రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అకాల వర్షాలు, వడగళ్ళు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు సైతం రైతుల నడ్డి విరిచాయి. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఆదాయం కోల్పోతున్నారు. దీంతో రైతుల బతుకులు చితికిపోయాయి. సాగు నిమిత్తం సహకార, ప్రైవేటు బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేక వడ్డీలు కడుతూ కాలం వెల్లదీస్తున్నారు. వాస్తవానికి సీజన్లో అప్పుకంటే రీషెడ్యూల్ చేస్తున్న రుణాలే ఎక్కువగా ఉంటున్నారుు. అయితే ప్రభుత్వం రూ.లక్ష మేరకే రుణమాఫీ చేస్తుందా? ఏ పద్ధతి పాటిస్తుంది? అనే సంశయం రైతుల్లో నెలకొంది. టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల రుణాలు మాఫీ చేయడమే కాకుండా మళ్లీ రుణాలు ఇచ్చి వ్యవసాయానికి, రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు.