Ben Sears
-
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
తొలి టీ20లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో సఫారీ జట్టును మట్టికరిపించి జయభేరి మోగించింది. టీ20 ప్రపంచకప్-2026లో రన్నరప్‌గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో బిజీగా ఉంది.ఇందులో భాగంగా ఆదివారం మౌంట్ మౌంగనీ వేదికగా ప్రొటిస్‌తో తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా హామిల్టన్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన కివీస్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.డెవాన్ కాన్వే అర్ధ శతకంటాపార్డర్లో ఓపెనర్ టామ్ లాథమ్ (11), వన్‌డౌన్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్ (1) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో నిక్ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించగా.. కోల్ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్ క్లార్క్సన్ (9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్ ముల్డర్ రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయెట్జి, ఒట్నీల్ బార్ట్‌మాన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్, జార్జ్ లిండే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆదిలోనే ఎదురుదెబ్బలులక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో కొన్నోర్ ఎస్తరూజెన్ (8)ను బెన్ సియర్స్ వెనక్కి పంపగా.. వియాన్ ముల్డర్ (16)ను సాంట్నర్ అవుట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన టోనీ జార్జి (1) మెకాంచీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.107 పరుగులకే ఆలౌట్ మిగిలిన వారిలో రూబిన్ హెర్మాన్ (19) ఫర్వాలేదనిపించగా.. జార్జ్ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఫలితంగా న్యూజిలాండ్ 68 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. సాంట్నర్ రెండు, మెకాంచి, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం నాటి మూడో టీ20కి ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదిక.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు! -
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్‌కు ఊహించని అవకాశం
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్‌కు ఊహించని అవకాశం దక్కింది. గతేడాది గాయాలతో సతమతమైన అతనికి ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా కైల్ జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేస్తాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది.ఆడమ్ మిల్నే గాయపడటంతో అప్పటివరకు ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న జేమీసన్ ప్రధాన జట్టులోకి ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడు జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేశాడు. సియర్స్ ఫిబ్రవరి 5న ముంబైలో అమెరికాతో జరగబోయే వార్మప్ మ్యాచ్‌లోపు జట్టుతో కలుస్తాడు. సియర్స్‌కు ప్రపంచకప్ అవకాశం కల్పించడంపై న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. సియర్స్ చాలా కష్టపడి ఫిట్నెస్ సాధించాడని కితాబునిచ్చాడు. ప్రధాన జట్టులో ఎవరికైనా గాయాలైతే సియర్స్ మొదటి ఆప్షన్‌గా ఉంటాడని స్పష్టం చేశాడు.తాజాగా ముగిసిన న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్‌లో సియర్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి, రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీనికి ముందు కౌంటీ డివిజన్ వన్ టోర్నీలోనూ అతను సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లతో రాణించాడు. ఇప్పటివరకు 22 అంతర్జాతీయ టీ20లు ఆడిన సియర్స్ 23 వికెట్లు తీశాడు. 140 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం సియర్స్ ప్రత్యేకత. బౌన్స్ అతని అదనపు బలం.టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు మిచెల్ సాంట్నర్ (c), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధీ, బెన్ సియర్స్ (రిజర్వ్)ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో అఫ్గనిస్తాన్, కెనడా, దక్షిణాఫ్రికా, యూఏఈ మిగతా జట్లుగా ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదో టీ20 తిరువనంతపురం వేదికగా జనవరి 31న జరుగనుంది. -
నంబర్ వన్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. ప్రపంచవాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండగా.. పాకిస్తాన్, న్యూజిలాండ్ మాత్రమే వన్డే సిరీస్ ఆడాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లకు చెందిన కొందరు ఆటగాళ్ల ర్యాంక్‌లు మాత్రమే మారాయి. బ్యాటింగ్‌లో టీమిండియా ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి విరాట్ (5), శ్రేయస్ అయ్యర్ (8) టాప్-10లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 72 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 21వ స్థానానికి చేరగా.. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 89 స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి కుల్దీప్తో పాటు రవీంద్ర జడేజా (9) ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. పాక్‌తో సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్ పేసర్ బెన్ సియర్స్ ఏకంగా 64 స్థానాలు మెరుగపర్చుకుని 100వ స్థానానికి చేరాడు. పాక్ పేసర్ నసీం షా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకాడు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ రెండో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా (9) ఒక్కడే ఉన్నాడు. జడ్డూ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10 నుంచి 9కి చేరాడు. పాక్‌తో జరిగిన సిరీస్‌లో 85 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మైఖేల్ బ్రేస్‌వెల్ (5) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-5లోకి వచ్చాడు. -
NZ vs Pak: పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. సిరీస్ క్లీన్‌స్వీప్
పాకిస్తాన్‌తో మూడో వన్డేలోనూ న్యూజిలాండ్ (NZ vs PAK 3rd ODI) ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మౌంట్ మౌంగనూయ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్.. తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. నసీం షా (Naseem Shah) బౌలింగ్‌లో ఓపెనర్ నిక్ కెల్లీ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ రైస్ మరియూ , హెన్రీ నికోల్స్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.కెప్టెన్ ధనాధన్రైస్ 61 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 పరుగులు చేయగా.. నికోల్స్ 40 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 31 రన్స్ రాబట్టాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) 53 బంతుల్లో 43 పరుగులతో అలరించగా.. టిమ్ సీఫర్ట్ (26) కూడా రాణించాడు. మిగతావాళ్లలో కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్ అర్ధ శతకం (40 బంతుల్లో 59) ఆకట్టుకున్నాడు.కాగా అవుట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఈ మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించగా.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 264 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లలో ఆకిఫ్ జావేద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. నసీం షా రెండు, ఫాహిమ్ అష్రఫ్, సుఫియాన్ ముకీమ్ ఒక్కో వికెట్ తీశారు.బాబర్ ఆజం ఎట్టకేలకుఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ మరోసారి నిరాశపరిచింది. 40 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అబ్దుల్లా షఫీక్ (56 బంతుల్లో 33) ఫర్వాలేదనిపించగా.. ఇమామ్ ఉల్ హక్ (1) పూర్తిగా విఫలమయ్యాడు.బాబర్ ఆజం మాత్రం ఈసారి అర్ధ శతకంతో రాణించాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (37), తయ్యబ్ తాహిర్ (33) మాత్రమే ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేయగా ఉస్మాన్ ఖాన్ (12), సల్మాన్ ఆఘా (11) నిరాశపరిచారు. నసీం షా 17 పరుగులు చేశాడు.బెన్ సీర్స్ మరోసారికివీస్ బౌలర్లలో గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన బెన్ సీర్స్ మరోసారి ఫైఫర్ సాధించాడు. 9 ఓవర్ల బౌలింగ్‌లో 34 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మిగిలిన వాళ్లలో జేకబ్ డఫీ రెండు, మైకేల్ బ్రేస్‌వెల్, ముహమ్మద్ అబ్బాస్, డారిల్ మిచెల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పరిపూర్ణ పరాజయంకాగా మూడో వన్డేలో ఓటమితో పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటన పరిపూర్ణ పరాజయంతో ముగిసింది. నిజానికి కేన్ విలియమ్సన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర వంటి స్టార్లు లేకుండానే కివీస్ పాక్‌తో మ్యాచ్‌లు ఆడింది. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు మాత్రం ఆతిథ్య జట్టుపై ఏ దశలోనూ ఆధిపత్యం కనబరచలేకపోయింది.ఇక అంతకు ముందు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ పాకిస్తాన్ కివీస్ చేతిలో 4-1తో ఓటమిపాలైంది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సల్మాన్ ఆఘా, వన్డే సిరీస్‌లో మహ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. మరోవైపు.. రెగ్యులర్ సారథుల గైర్హాజరీలో కివీస్‌ను మైకేల్ బ్రేస్‌వెల్ ముందుండి నడిపించాడు. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మూడో వన్డే స్కోర్లు👉న్యూజిలాండ్: 264/8 (42)👉పాకిస్తాన్: 221 (40)👉ఫలితం: 43 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయంచదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్


