breaking news
beedi labours
-
India: పాముకాటుతో ఏటా 50 వేల మంది మృతి.. ప్రపంచంలోనే అత్యధికం
న్యూఢిల్లీ: భారత్‌లో పాము కాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విష సర్పాల కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు పాముకాటు మరణాలపై బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ లోక్‌సభలో మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బిహార్ బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు.ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఏటా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది మరణిస్తున్నారు. ఇది ప్రంపంచలోనే అత్యధికం’అని పేర్కొన్నారు. అదే విధంగా బిహార్ చాలా పేద రాష్ట్రమని, పేదరికంతోపాటు సహజంగా వాతారవణ మార్పులు సైతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారుమరోవైపు వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ .. బీడీ కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులు దుమ్ము, ఇతర వృత్తిపరమైన ప్రమాదాలకు గురికావడాన్ని గమనించి బడ్జెట్ కేటాయింపుల్లో పరిగణనలోకి తీసుకుని 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించాలని కేంద్రాన్ని కోరారు. -
పింఛన్ ‘చాటన్’!
ఆసరా పింఛన్లలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బీడీ ప్యాకర్లు, చాటన్ దారులకు అందిస్తున్న జీవన భృతి ఈనెల నుంచి నిలిచిపోయింది. బీడీలు చుట్టే మహిళా కార్మికులకే పింఛన్లు అందించాలని ఉందని, ప్యాకర్లు, చాటన్‌దారులకు అందించాలనే నిబంధన ఏమీ లేదని సెర్ప్ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 750 మందికి పింఛన్లు రద్దు చేస్తూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. సెర్ప్ అధికారుల నిర్ణయంపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్(బాల్కొండ)/నవీపేట(బోధన్): కుదేలవుతున్న బీడీ పరిశ్రమకు అండగా నిలిచేందుకు రాష్ట్రప్రభుత్వం మూడేళ్ల కింద బీడీ కార్మికులకు జీవనభృతి పథకాన్ని అమలు చేసింది. 2014 ఏప్రిల్‌కు ముందు పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులకు రూ.1000 పింఛన్ అందజేస్తూ వస్తోంది. పనిదినాలు తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కార్మికులకు ఈ పింఛన్ పథకం కొద్దిమేర ఆసరాగా నిలిచింది. మొదట్లో ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే భృతి అన్న కొర్రీ విధించడంతో కార్మిక సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. దీంతో కుటుంబంలోని అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవనభృతిని అందిస్తున్నారు. జిల్లాలో 50 పైగా బీడీ కంపెనీలు ఉండగా వీటిలో దాదాపు లక్షన్నర వరకు కార్మికులు పని చేస్తున్నారు. బీడీలు చుట్టడం, చాటన్, ప్యాకింగ్, బట్టీ పెట్టడం వంటి పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ప్యాకర్లు, చాటన్‌దారులకు నిలిచిన పింఛన్లు.. తెలంగాణ ప్రభుత్వం బీడీలు చుట్టే మహిళలతో పాటు బీడీ ప్యాకర్లకు, చాటన్‌దారులకు నెలనెలా జీవనభృతి అందిస్తోంది. కాగా ఈనెల నుంచి ప్యాకర్లు, చాటన్‌దారులకు జీవనభృతి నిలిపివేస్తు న్నట్లు సెర్ప్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. బీడీలు చుట్టే మహిళా కార్మికులకు మాత్రమే జీవనభృతి అందించాల్సి ఉందని, చాటన్‌దారులు, ప్యాకర్లకు అందించే నిబంధన ఏమీ లేదని సె ర్ప్ అధికారులు స్పష్టం చేస్తూ.. ఈనెల నుంచి వారికి పింఛన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 750 మంది చాటన్‌దారులు, ప్యాకర్లకు జీవన్ భృతి నిలిచిపోయింది. అమలు కాని కనీస వేతనం.. జిల్లాలోని ఆయా బీడీ పరిశ్రమల్లో దాదాపు లక్షన్నర మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 97,010 మంది కార్మికులు జీవనభృతి పొందుతున్నారు. బీడీ కార్మికులు అంటే బీడీలు చుట్టేవారు కాకుండా ప్యాకర్లు, చాటన్‌దారులు కూడా ఉన్నారు. కాగా బీడీ కార్మికుల్లో అన్ని వర్గాల వారికి ఇప్పటికీ కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. ఈ చట్టం ప్రకారం వేతనాలు అందిస్తే ఒక్కో కార్మికుడికి కనీసం రూ.12వేల నుంచి రూ.15వేల వరకు వేతనం ప్రతినెలా అందించాల్సి ఉంటుంది. ప్యాకర్లు, చాటన్‌దారులకు కూడా పని ఆధారంగా నే వేతనం లభిస్తోంది. కనీస వేతన చట్టం ప్రకారం తమకు వేతనాలు అం దించాలని ప్యాకర్లు, చాటన్‌దారులు ఎ న్నో ఏళ్ల నుంచి కోరుతున్నా బీడీ కంపెనీల యాజమాన్యాలు స్పందించడం లే దు. వీరికి నెలకు రూ.5వేల నుంచి రూ. 6వేలకు మించి వేతనం అందడం లేదు. రద్దు నిర్ణయంతో ఆందోళన.. ఎప్పటిలాగే జీవనభృతి కోసం పోస్టా ఫీస్ కార్యాలయాలకు వెళ్లిన ప్యాకర్లు, చాటన్వాలాలు, బట్టీవాలాలకు పోసా ్టఫీస్ సిబ్బంది మొండిచేయి చూపించారు. జీవనభృతిని రద్దు చేశారని తెలిసి ఆందోళనకు గురయ్యారు. చాలీచాలని పని దినాలతో దుర్భర జీవనం గడుపుతున్న తమకు జీవనభృతి ఆసరాగా నిలిచిందని, ఇప్పుడు దానినీ రద్దు చేయడంతో ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతుండడం, వేతనంలో మార్పు లేకపోవడంతో తమ జీవితంలో వృద్ధి లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు. తమకు పింఛన్ వర్తించదని జీవనభృతి నిలిపివేతకు తీసుకున్న నిర్ణయంతో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. జీవనభృతి నిలిపివేయడం సరికాదు.. చాటన్‌దారులు, ప్యాకర్లకు జీవన భృతిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదు. ఇప్పటివరకు పింఛన్ ఇచ్చి ఇప్పుడు నిలిపివేస్తే ఎవరికి చెప్పుకోవాలి. చాలీచాలని వేతనాలతో ఎలా బతకాలి. జీవనభృతితో ఉన్న కాస్త ఊరట ఇప్పుడు తొలగిపోయింది. – శాకీర్, బీడీ చాటన్దారు, మోర్తాడ్ ఆందోళనలు చేస్తాం.. బీడీ పరిశ్రమలోని కార్మికులందరూ ఒకటే. పనిదినాలు తక్కువగా ఉండడంతో తక్కువ కమీషన్లను వేతనం రూపంలో పొందుతున్నారు. తాజాగా పింఛన్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కార్మికులకు జీవనభృతి పునరుద్ధరించాలి. బాధితుల పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తాం. – నాయక్వాడీ శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, నవీపేట బీడీలు చుట్టే కార్మికులకే.. బీడీ పరిశ్రమలోని బీడీలు చుట్టే కార్మికులకే జీవనభృతిని అందించాలని తాజా జీవో వెలువడింది. దాని ప్రకారమే గత డిసెంబర్లో జీవనభృతిని అందించాం. ఈ నిబంధనతో జిల్లాలోని 404 మంది జీవన భృతి రద్దయింది. – రవి, పెన్షన్ ఏపీఓ(డీఆర్డీఓ), నిజామాబాద్ -
నట్టింట్లో కయ్యం
బీడీ పింఛన్ తెచ్చిన వైనం అత్తాకోడళ్ల మధ్య వైరం ‘ఇంటికి ఒక్కరికే’ నిబంధనతో చిచ్చు పల్లెల్లో ప్రతిరోజూ పంచాయితే.. నిబంధన సడలించాలని డిమాండ్ అత్తాకోడళ్లు ఇన్నాళ్లు కలిసే ఉన్నారు. కలోగంజో తాగి.. ఉన్న ఒక్క అర్ర ఇంట్లో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు వాళ్ల మధ్య బీడీ పింఛన్ చిచ్చు పెడుతోంది. పింఛన్ దెబ్బకు అత్తాకోడళ్లు నిట్టనిలువుగా విడిపోయి కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఏళ్లకేళ్లుగా గుట్టుగా సాగిన సంసారాలు పింఛన్ పుణ్యమా అని బజారున పడుతున్నాయి. సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ గణతంత్ర దినోత్సవం కానుకగా బీడీ కార్మికులకు పింఛన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద రూ. 1000 పింఛన్ ప్రకటించింది. ఏళ్లకేళ్లుగా బీడీలు చుట్టినా ఫలితం దక్కని కార్మికులకు ఈ పథకం వరంగా మారింది. అయితే ప్రతి కుటుంబంలో ఒకరు మాత్రమే పింఛన్ తీసుకునేందుకు అర్హులనే నిబంధన పెట్టింది. ఇదే నిబంధన అత్తాకోడళ్ల మధ్య వివాదానికి దారి తీస్తోంది. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు బీడీ కార్మికులుగా పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది వరకు కార్మికులున్నారు. సుమారు 14 గంటల పాటు నిరంతరాయంగా బీడీలు చుడుతున్నారు. ప్రభుత్వం పీఎఫ్ నంబర్ ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తోంది. ఇక్కడే దాదాపు రెండొంతుల మంది బీడీ కార్మికులు దూరమయ్యారు. ఇక పీఎఫ్ ఉన్నప్పటికీ అదే ఇంటిలో మరొకరు పింఛన్ పొందుతున్నట్లయితే వారికి కూడా అర్హత ఉండదు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 41,691 మందికి మాత్రమే బీడీ పింఛన్లు అందుతున్నాయి. అత్తాకోడళ్ల మధ్య చిచ్చు.. సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో సగటు జీవన ప్రమాణాలు చాలా తక్కువ. సొంతంగా ఇళ్లు కట్టుకునే స్తోమత లేక ఉన్న ఇంటిలోనే అన్ని కుటుంబాలు కలిసి కాపురం చేస్తాయి. వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు కొడుకుల వద్దే కాలం వెళ్లదీస్తారు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన రోజున తల్లిదండ్రులు ఏ కొడుకు దగ్గర ఉంటే ఆ కొడుకుతో కలిసే సమాచారం ఇచ్చారు. పింఛన్‌కు ఎంపికైన బీడీ కార్మికుల్లో దాదాపు 30 శాతం మందికి ఆసరా పథకం అడ్డంగా మారింది. ఆ కుటుంబంలో ఉంటే అత్తకో.. మామకో పింఛన్ వస్తే బీడీ కార్మికురాలైన కోడలుకు పింఛన్ కోత పెడుతున్నారు. దీంతో కోడళ్లు బలవంతంగా అత్తామామలను బయటికి పంపుతున్నారు. లేదా వేరు కాపురా నికి సిద్ధమవుతున్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే అత్తాకోడళ్ల పంచాయితీ రచ్చబండ మీదకు వస్తోంది. ఈ వయసులో నాకు పింఛన్ తప్ప ఇంకేం ఆధారం ఉందని వృద్ధురాలైన అత్త అంటుంటే..! నా పిల్లల భవిష్యత్తును ఆగమైందని కోడలు వాపోతోం ది. ఈ పంచాయితీ ఇటు కుటుంబానికి, అటు గ్రామ పెద్దలకు తలనొప్పిగా మారింది. బీడీ కార్మికుల విషయంలో ఇంటికి ఒక్కరే అనే నిబంధన సడలించాలని పలువురు కోరుతున్నారు.