breaking news
Became pregnant
-
89 ఏళ్ల వయస్సులో...
లండన్: కోవిడ్–19 మహమ్మారి వల్ల గత కొన్నిరోజులుగా అన్ని దుర్వార్తలే వింటున్న నేపథ్యంలో ‘ఫార్ములావన్’ మాజీ చీఫ్ ఎకిల్‌స్టోన్ నుంచి ఓ శుభవార్త వచ్చింది. 1978 నుంచి 2017 వరకు ఫార్ములావన్‌కు సీఈఓగా ఉన్న ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. మామూలుగా అయితే ఎవరైనా తండ్రి కావడం సాధారణ విషయమే. కానీ ఎకిల్‌స్టోన్‌కు ఇప్పుడు 89 ఏళ్లు! అదే ఈ వార్తకున్న విశేషం! ఆయనకు లేటు వయసులోనూ నాన్నయ్యే ‘ఫార్ములా’ పంట పండింది. ఎకిల్‌స్టోన్ మూడో భార్య 44 ఏళ్ల ఫాబియానా ఫ్లోసి ఈ జూలైలో తన వృద్ధండ పెనిమిటికి వారసుణ్ని బహుమతిగా ఇవ్వనుంది. వైద్య పరీక్షల్లో ఆమెకు కలిగే సంతానం మగ శిశువని తేలింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తన భార్య తెగ సంబరపడుతున్నట్లు ఎకిల్‌స్టోన్ తెలిపారు. తమ ఇద్దరి మధ్య వయసురీత్యా చాలా వ్యత్యాసం ఉండటంతో ఈ వార్తను ఊహించలేదన్నారు. ఎకిల్‌స్టోన్‌కు తన మాజీ ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇక తాజా వైరస్ మరణమృదంగంపై ఆయన స్పందిస్తూ ‘మొ దట్లో ఏంటీ నాన్సెన్స్ అనుకున్నా. ఫ్లూ గురించి ఎప్పుడూ వినేదే! యేటా ఓ సీజన్‌లా వచ్చిపోయేదే అని భావించా... కానీ ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది’ అని కరోనాపై వ్యాఖ్యానించారు. -
ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో..
= మృత ఆడశిశువుకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ = రోడ్డు పక్కన వదిలి వెళ్లిన వృద్ధురాలు = మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు ప్రకాశం జిల్లా : ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో.. ఏ మృగాడి కామవాంఛకు బలి పశువుగా మారిందో.. తెలియదు..కానీ ఓ మతి స్థిమితం లేని మహిళ గర్భం దాల్చింది. నడిబజారులో నిస్సహాయస్థితిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న మహిళను గుర్తు తెలియని వృద్ధురాలు చూసింది. మానవత్వంతో సమీపంలోని వైద్యశాలకు చేర్చింది. ఆస్పత్రిలో ఆ అభాగ్యురాలు మృత శిశువుకు జన్మనిచ్చింది. మహిళకు తోడుగా వచ్చిన వృద్ధురాలు మృతశిశువును రోడ్డు పక్కన వొదిలేసి వెళ్లింది. ఈ సంఘటన యర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ (కోట్ల ఎస్తేరు) కొద్దిరోజుల క్రితం యర్రగొండపాలెం చేరింది. అప్పటి నుంచి పట్టణంలో యాచన చేస్తూ జీవిస్తోంది. ఎస్తేరుకు నెలలు నిండటంతో వృద్ధురాలి సాయంతో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరింది. అర్ధరాత్రి సమయంలో నొప్పులు రావడంతో డ్యూటీలో ఉన్న నర్స్, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌కు సమాచారం అందించారు. బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్ చంద్రశేఖర్ వైద్యసహాయం అందించారు. దీంతో తల్లి మృతశిశువు(ఆడ)కు జన్మనిచ్చి తాను ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎస్తేరుకు తోడుగా వచ్చిన వృద్ధురాలు మృతశిశువును అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన వొదిలి వెళ్లింది. సోమవారం ఉదయం రోడ్డు పక్కన పడి ఉన్న మృతశిశువును గమనించిన కొందరు ఎస్సై ఎం.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఎస్సై ఆదేశాల మేరకు ఏఎస్సై షేక్ రఫీ ఉద్దీన్ శువును పరిశీలించారు. అనంతరం వైద్యశాలలోనే ఉన్న ఎస్తేరు ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వక పోవడంతో వైద్యాధికారి చంద్రశేఖర్‌ను విచారించారు. అనంతరం కొంత సమయం వేచి చూసిన పోలీసులు, మహిళ తరుపు బంధువులు ఎవరూ రాక పోవడంతో మృతశిశువును ఖననం చేశారు.