breaking news
beautifull locations
-
Travel: మంచు పర్వతాలలో మహానుభూతి..
మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు.. దూరం నుంచి వినిపించే ‘హర హర మహాదేవ్’ అనే నామ స్మరణం.. ఇవన్నీ కలిసి అమర్నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి. అమర్నాథ్ గుహాలయానికి చేరిన తరువాత గమ్యం కన్నా ప్రయాణమే బాగా గుర్తుంటుంది. ప్రతీ అడుగు ప్రకృతికి దగ్గరగా, ప్రతీ క్షణం దేవదేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. హిమాలయాల మధ్య నడుస్తూ వెళ్తుంటే సమయం కూడా కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.జమ్మూ అండ్ కశ్మీర్లో ఉన్న అమర్నాథ్ గుహాలయం ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ గుహలో ప్రకృతి స్వయంగా మంచుతో రూపొందించిన శివలింగాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు. గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, మంచు వాసన, మౌనం.. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. గుహలో మంచు లింగం ముందు నిలబడిన క్షణంలో మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది మాటల్లో కాదు... అనుభవంలో ఉంటుంది.సందర్శనీయ ప్రదేశాలుఅమర్నాథ్ యాత్రలో పహల్గామ్ రూట్ చాలా అందంగా ఉంటుంది. పచ్చని పచ్చిక బయలు, గంభీరంగా నిలబడిన హిమ శిఖరాలు, వాగుల మధ్య సాగే ఈ మార్గం ప్రతీ మలుపులో కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. చందన్ వారి దగ్గర చల్లని గాలి మనసుని రిఫ్రెష్ చేస్తుంది.శేష్నాగ్ లేక్ దగ్గర నీళ్లు ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. పంచతరణి చేరిన తరువాత హిమాలయాల వైభవం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు చూస్తూ వెళ్తుంటే గమ్యం ఎంత మధురమో ప్రయాణం అంతే మధురంగా అనిపిస్తుంది.యాత్ర పూర్తి చేసుకున్న తరువాత శ్రీనగర్‌లో డాల్ లేక్ పై హౌజ్‌బోట్‌లో గడిపిన సాయంత్రం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మొఘల్ గార్డెన్స్‌లో నడవడం, లోకల్ బజార్లో కశ్మీర్ సంస్కృతిని చూడడం కూడా ఈ ప్రయాణానికి ఇంకో అందాన్ని జోడిస్తాయి.కశ్మీర్ క్యూజిన్ లో దమ్ ఆలూ, రాజ్మా చావల్, కావా టీ, కశ్మీరీ రోటీ లాంటి సింపుల్ డిషెస్ చల్లని వాతావరణంలో ఇంకా రుచిగా అనిపిస్తాయి. లోకల్ టీ స్టాల్స్ దగ్గర దొరికే గరం గరం చాయ్ అనేది జర్నీ మధ్య ఒక చిన్న బ్రేక్‌ని మెమొరబుల్ చేస్తుంది.ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఏప్రికాట్స్ టేస్ట్ చేస్తూ లోకల్ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీ భోజనం అక్కడి వాతావరణం లాగే సింపుల్‌గా, ఆథెంటిక్‌గా ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరుకుతాయి. ఫ్లైట్‌లో హిమాలయాలపై ప్రయాణిస్తున్న సమయం నుంచే ఈ యాత్ర ఫీలింగ్ మొదలవుతుంది.శ్రీనగర్ చేరుకున్న తరువాత రోడ్డు మార్గంలో పహల్గామ్ లేదా బాల్టాల్ వరకు వెళ్లవచ్చు. ఈ రోడ్ ట్రిప్‌లో కశ్మీర్ వ్యాలీ అందాలు ప్రతీ విండో ఫ్రేమ్‌ని ఒక పోస్టుకార్డ్లా మార్చేస్తాయి.విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ లేదా ఢిల్లీ మీదుగా శ్రీనగర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రయాణం అనేది ప్రకృతి మధ్య నిశ్శబ్దంగా సాగుతుంది.ఏం చూడాలి?ఉదయం మంచు శిఖరాలపై పడిన వెలుగు చూడటం ఒక అందమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. పర్వతాల మధ్య సాగే భక్తులు, గుర్రాల సవారి, చల్లని గాలిలో ఎగురుతున్న ప్రార్థనా ధ్వజాలుం ఇవన్నీ కలిసి ఒక సినిమా సీన్ లా అనిపిస్తాయి.డాల్ లేక్‌లో శిఖారా రైడ్, లోకల్ మార్కెట్స్‌లో హ్యాండీక్రాఫ్ట్స్ కశ్మీర్లో కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ షాపులు.. ఇవన్నీ చూస్తూ గడిపిన సమయం కూడా మెమొరబుల్‌గా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలుఅమర్నాథ్ గుహాలయం హిమాలయాల మధ్య సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ప్రతీ సంవత్సరం కొన్ని వారాలు ΄ాటు మాత్రమే అమర్నాథ్ యాత్రను నిర్వహిస్తారు.మంచుతో ఏర్పడే స్వయంభు శివలింగాన్ని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు.పహల్గామ్, బాల్టాల్ అనే రెండు ప్రధాన యాత్రా మార్గాల ద్వారా గుహాలయానికి చేరుకోవచ్చు.జూలై, ఆగస్టు నెలల్లో హిమాలయాల అందాలు మరింత ఆకట్టుకుంటాయి.ఎక్కడ ఉండాలి?శ్రీనగర్‌లో హౌజ్‌బోట్స్, లేక్ వ్యూ హోటల్స్, బోటిక్ స్టేస్ ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి. ఉదయం డాల్ లేక్‌పై పడవల శబ్దంతో మేల్కొనడం ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది.పహల్గామ్లో కాటేజీలు, హోటల్స్, నేచర్ రిసార్ట్స్‌లో చల్లని గాలి, పచ్చని చెట్లు, పర్వతాల అందాలు రోజంతా మనసుని రిఫ్రెష్ చేస్తాయి. యాత్ర మార్గంలో ఉండే క్యాంపులు కూడా హిమాలయాల మధ్య ఒక యూనిక్ స్టే ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి 5 రోజుల అమర్నాథ్ యాత్రను బడ్జెట్లో ప్లాన్ చేస్తే సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య పూర్తి చేయవచ్చు. కొంచెం కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతుందిప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం మంచి హోటల్స్, ఫ్లైట్స్, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణంతో కలిపి రూ.70,000 నుంచి రూ.1 లక్షా 10 వేల వరకు ప్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తే టోటల్ బడ్జెట్ కాస్త పెరగవచ్చు.శ్రీనగర్ హోటల్స్‌లో పర్ నైట్ రూ.2,000 నుంచి రూ.8,000 వరకు ఆప్షన్స్ ఉంటాయి. ప్రీమియం లేక్ వ్యూ స్టేస్ కోసం రూ.10,000 వరకు కూడా ఖర్చు చేస్తారు.ఫుడ్ కోసం ప్రతీ రోజు సగటున రూ.700 నుంచి రూ.1,500 వరకు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.గమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా వివరాలు, వాతావరణం, స్థానిక పరిస్థితులను స్వయంగా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
నీలి అలల మధ్య పచ్చని కల..
కొన్ని ప్రదేశాలు చూడటానికి వెళ్లాలి అనుకుంటాం. కొన్ని ప్రదేశాలు మాత్రం మనల్ని రారమ్మని పిలుస్తాయి. అలాంటి కోవలోకి చెందినదే ‘రాజా అంపట్’. ఇండోనేషియాలోని సౌత్‌వెస్ట్ పాపువాప్రాంతంలో ఉన్న ఈ ‘రాజా అంపట్’ అనేప్రాంతం వేలాది చిన్న ద్వీపాల సమూహం. ప్రకృతి తన అందం మొత్తం ఒక్కసారి చూపించాలి అనుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కనులారా వీక్షించవచ్చు. పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లని ఇసుక తీరాలు కలిసి ఒక చిత్రకారుడి కాన్వాస్‌లా కనిపిస్తాయి. ప్రతి ప్రయాణంలో ఒక కొత్త దృశ్యం, ప్రతి అలలో ఒక కొత్త అనుభవం నిండి ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలు..రాజా అంపట్ అంటే ఇండోనేషియా భాషలో నలుగురు రాజులు అని అర్థం.ఇది ఇండోనేషియాలోని సౌత్‌వెస్ట్ పాపువాప్రాంతంలో ఉంటుంది.ఈప్రాంతం మొత్తం వేలాది చిన్న ద్వీపాలతో కలిసి ఉంటుంది.ప్రకృతి, సముద్ర జీవ వైవిధ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.సముద్రం రంగుల మార్పులు ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాల్లో ఒకటి.రాజా అంపట్ చేరగానే మనకు ముందు కనిపించేది విశాల సముద్రం. అక్కడి నీటి రంగుల్లో ఆకాశంలోని మబ్బుల కదలికలను స్పష్టంగా చూడవచ్చు. కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల టార్కాయిస్, మరికొన్ని చోట్ల గాఢమైన నీలం. ద్వీపాల మధ్య వెళ్తున్న బోట్ ప్రయాణం ఒక సినిమా సీ¯Œ లా అనిపిస్తుంది. చుట్టూ చిన్న చిన్న లైమ్‌స్టోన్ ద్వీపాలు నీటి నుంచి వెలుస్తున్నట్టు ఉంటాయి. వాటిని చూస్తుంటే ప్రకృతి. సముద్రం మధ్యలో తన సంతకం పెట్టినట్టు అనిపిస్తుంది. అలలు మెల్లిగా బోట్‌ని తాకుతుంటే సమయం కూడా అక్కడ నిలిచిపోయిందేమో అనిపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలు..రాజా అంపట్‌లో ప్రతి ద్వీపం ఒక కొత్త కథ చెబుతుంది. ప్లేనెమో వ్యూ పాయింట్ నుంచి చూస్తే పచ్చని ద్వీపాలు నీలి సముద్రంపై విరిసిన ఆకుల్లా కనిపిస్తాయి. వాయాగ్ అనేప్రాంతంలో సముద్రం, ద్వీపాల మధ్య కనిపించే దృశ్యం ఒక కలలా ఉంటుంది. మిసూల్ దగ్గర నీటి కింద ఉన్న పగడపు దిబ్బల ప్రపంచం మరింత ఆకర్షిస్తుంది. సముద్రంపై చూస్తున్నప్పుడు ఒక అందం, నీటి కింద చూస్తున్నప్పుడు మరొక అందం కనిపిస్తుంది. కొన్ని చోట్ల సముద్రం అంతా స్పష్టంగా ఉంటుంది కాబట్టి బోట్ నుంచి కూడా నీటి కింద లైఫ్ ఎలా ఉందో కనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?రాజా అంపట్‌లో ఉండటం అంటే కేవలం రూమ్‌కి పరిమితం అవ్వడం మాత్రమే కాదు. సముద్రం దగ్గర కట్టిన వుడెన్ కాటేజీలు, నీటిపై నిలబెట్టిన విల్లాలు, అడవి మధ్య ఉన్న ఎకో రిసార్ట్స్ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ప్రతి ఉదయం అలల శబ్దాలతో మేలుకోవడం, సాయంత్రం సముద్రంపై పడిన సూర్యాస్తమయం చూస్తూ కూర్చోవడం అక్కడి రోజుల్లో భాగం అయిపోతుంది. నగర హడావిడి నుంచి దూరంగా ప్రకృతి మధ్య గడిపిన సమయం మనసుకి ఒక కొత్త ప్రశాంతతను ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలైతే ముందు ఇండోనేషియా రాజధాని జకార్తా లేదా బాలీ చేరుతారు. అక్కడి నుంచి పాపువాప్రాంతం వైపు విమానం వెళుతుంది. ప్రయాణంలో నగర దృశ్యాలు తగ్గి సముద్రం, ద్వీపాల ప్రపంచం మొదలవుతుంది.విజయవాడ నుంచి రాజా అంపట్ వెళ్లాలి అనుకుంటే హైదరాబాద్ లేదా చెన్నై నుంచి వెళ్లవచ్చు. ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో సముద్రం మధ్య చిన్న ఎయిర్పోర్ట్ చేరిన అనుభవమే యాత్రలో ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగులుతుంది. ఆకాశం నుంచి కనిపించే ద్వీపాల దృశ్యం రాజా అంపట్ అందాన్ని ముందుగానే పరిచయం చేస్తుంది.ఏం చూడాలి?ఉదయం వేళలో సముద్రంపై పడిన సూర్యకిరణాలు రాజా అంపట్ని మరింత వెలుగులతో నింపేస్తాయి. బోట్లో ద్వీపాల మధ్య తిరుగుతుంటే ప్రతి మలుపు దగ్గర కొత్త దృశ్యం కనిపిస్తుంది. కొన్ని చోట్ల పక్షుల గానం వినిపిస్తుంది. మరికొన్ని చోట్ల సముద్రం శబ్దం మాత్రమే ఉంటుంది. నీటి కింద కనిపించే కోరల్ గార్డెన్స్, రంగురంగుల చేపలు, నిశ్చలంగా తిరిగే సముద్ర జీవులు అక్కడ ప్రకృతి వైభవాన్ని మరింత దగ్గర నుంచి చూపిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో సముద్రంపై విరిసిన బంగారు వెలుగు ప్రయాణంలో మర్చిపోలేని క్షణంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?ఇండోనేషియా రుచులను ఎంజాయ్ చేయడానికి రాజా అంపట్ మంచి చాయిస్ అని చెప్పవచ్చు. తాజా సీఫుడ్ సముద్రం దగ్గర కూర్చుని ఆస్వాదించే అనుభవం ప్రత్యేకం. కొబ్బరి ఫ్లేవర్స్, లోకల్ స్పైసెస్, సముద్రపు రుచులు కలిసిన భోజనం ప్రయాణంలో భాగం అయిపోతుంది. సాయంత్రం వేళలో సముద్రం ముందు కూర్చుని లోకల్ ఫిష్ కర్రీ, గ్రిల్డ్ సీఫుడ్ లేదా ఇండోనేషియన్ డిషెస్ ఆరగించడం అక్కడి జీవన శైలిని దగ్గరగా అనుభవించిన అనుభూతిని ఇస్తుంది.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి రాజా అంపట్కి ఐదు రోజుల యాత్ర కోసం బడ్జెట్ రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల మధ్య ఉంటుంది. స్టాండర్డ్ కంఫర్ట్ యాత్ర రూ.1 లక్షా 40 వేల నుంచి రూ.2 లక్షల వరకు చేరవచ్చు.ప్రీమియం రిసార్టులు, ఎక్స్క్లూసివ్ ఐలాండ్ ఎక్స్‌పీరియెన్స్ యాడ్ చేస్తే రూ.2 లక్షల 50 వేల వరకు ఉండవచ్చు.స్టే చార్జీలు ప్రతి రాత్రికి రూ.4 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటాయి. ఫుడ్ ఖర్చు రోజుకు సాధారణంగా రూ.1,000 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. ఐలాండ్ హాపింగ్ బోట్ ఎక్స్‌పీరియెన్స్ మెరైన్ ఎక్స్΄్లోరేషన్ యాక్టివిటీస్ ఈ యాత్రలో ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతాయి.ఇండోనేషియాకి భారతీయ ప్రయాణికులకు వీసా అవసరం ఉంటుంది. ట్రావెల్ ప్లాన్ ను బట్టి లేటెస్ట్ వీసా గైడ్‌లైన్స్‌ని ముందుగా పరిశీలించడం – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
ప్రకృతి అందాలు
-
ప్రకృతి గీసిన ఐదు రంగుల చిత్రం!
అన్వేషణం ప్రకృతి ఎన్ని రకాల సొబగులతో మురిపిస్తుందో కదా! కొండలు, గుట్టలు, లోయలు, నదులు, చెట్లు, కొమ్మలు, ఆకులు, పూలు... అసలు అందం లేనిదేది? ఆకట్టుకోనిదేది? అలా తమ అందాలతో కనువిందు చేసేవి ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి... ఫైవ్ ఫ్లవర్ లేక్. ఈ పేరే కాస్త విచిత్రంగా ఉంది కదూ! పువ్వులేంటి, అయిదు రకాలుండటమేంటి, వాటికీ సరస్సుకీ సంబంధమేంటి అనిపిస్తుందా! అదే మరి దీని ప్రత్యేకత! చైనాలో ఉన్న వుహుయా జిహాయ్గో నేషనల్ పార్క్‌లోని ప్రాకృతిక సౌందర్యాన్ని చూడాలంటే పెట్టిపుట్టాలేమో అనిపిస్తుంది. అందుకే ఆ పార్క్‌ని ఫెయిరీ ల్యాండ్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అంటే దేవతలు నివసించే స్థలమని వారి ఉద్దేశం. ఆ పార్కు అందం ఒకెత్తయితే... అందులో ఉన్న ‘ఫైవ్ ఫ్లవర్ లేక్’ అందం మరొకెత్తు. స్వచ్ఛమైన సరస్సు, చుట్టూ పచ్చని మొక్కలు, రంగురంగులు పూలతో... ప్రఖ్యాత చిత్రకారుడు ప్రతిష్టాత్మకంగా గీసిన చిత్రంలా ఉంటుంది. అసలు దీనికి ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసా? ఈ సరస్సు చుట్టూ ఎన్నో రకాల పూలమొక్కలు ఉంటాయి. వాటన్నిటి పూలనూ పరిశీలిస్తే ప్రతిదానిలోనూ నాలుగు రంగులు ఎక్కువగా ఉంటాయి. ఏపుగా పెరిగిన ఆ చెట్ల నీడ స్వచ్ఛమైన నీటిలో పడి, ఆ పూలరంగు సరస్సులో ప్రతిఫలిస్తుంది. నీటికి ఉన్న నీలిరంగుతో పాటు... పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు రంగులు మిళితమై అయిదు రంగుల్లో మెరిసిపోతుంటుంది. అందుకే దీనికి ఫైవ్ ఫ్లవర్ లేక్ అనే పేరు వచ్చింది. మరో విశేషమేమిటంటే, ఈ సరస్సు చుట్టూ ఉన్న మొక్కలు సంవత్సరమంతా పూస్తూనే ఉంటాయి. అసలు పూలు లేకపోవడమన్నదే ఎప్పుడూ ఉండదు. దాంతో ఈ సరస్సు ఏడాది పొడవునా అలా రంగురంగులుగానే కనిపిస్తుంది! ఈ ఇంటి ఖరీదు ఎంతో తెలుసా? సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించి, పైసా పైసా కూడగట్టినా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే బ్రిటన్‌కు చెందిన మైఖేల్ బక్ అనే ఆయన కేవలం 150 పౌండ్లతో ఇల్లు కట్టేశాడు. మైఖేల్ పేదవాడేమీ కాదు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ ఎంత ఉన్నా ఆడంబరంగా బతకాల్సిన అవసరం లేదన్నది అతడి ఉద్దేశం. తన ఇంట్లోవాళ్లు ఆడంబరాలకు పోయి మితిమీరిన ఖర్చు చేయడం నచ్చలేదతనికి. మనిషి తలచుకుంటే చాలా సింపుల్‌గా బతకగలడని నిరూపించాలనుకున్నాడు. దాని ఫలితమే అతడు తన గార్డెన్లో కట్టిన ఈ ఇల్లు. ముందుగా సహజసిద్ధమైన కలప, ఆకులు, మట్టి, ఈనెలు తదితర వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు మైఖేల్. పైకప్పు వేయడానికి అవసరమైన నట్లు, మేకుల వంటి వాటికి మాత్రం ఓ నూట యాభై పౌండ్లు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఒక్కసారి హోటల్‌కి వెళ్లి భోంచేసినా ఇంకా ఎక్కువ బిల్లు అవుతుందేమో. కానీ ఆ మాత్రం డబ్బుతో ఇల్లు కట్టేశాడు. ఎనిమిది నెలలపాటు ఒక్కడే కష్టపడి దీన్ని కట్టుకున్నాడు మైఖేల్. అలా అని ఆషామాషీగా కట్టలేదు. చూశారుగా ఎంత బాగుందో! అంత తక్కువ సొమ్ముతో ఇంత అందమైన ఇంటిని కట్టడం ఇంకెవరికైనా సాధ్యమా!


