breaking news
beautiful skin
-
పిగ్మెంటేషన్, బ్లాక్‌హెడ్స్‌తో బాధపడుతున్నారా? ఈ ప్యాక్ వేసుకోండి
బ్యూటీ టిప్స్ ►అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేసి 20 నిమిషాల ΄ాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనితో పాటు ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు దూరం అవుతాయి. ►ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను చక్కగా కలిపి ముఖానికి ΄్యాక్‌లా అప్లై చేయండి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా తరచు చేస్తుండడం వల్ల. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. ►పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. ఇది కాస్త చల్లబడిన తర్వాత బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. బాగా తర్వాత తేలికపాటి క్లెన్సర్‌ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. -
కొవ్వుతో అందమైన శరీర భాగాల రూపకల్పన
- చర్మవ్యాధుల వైద్యుల సదస్సులో డాక్టర్ సుమిత శంకర్ అరండల్‌పేట(గుంటూరు) : కొవ్వు అనగానే వామ్మో... కొవ్వు వెంటనే తగ్గించుకోవాలి, లేకపోతే ప్రమాదం అన్న మాటలు తరుచూ వింటుంటామని, అది నిజమే అయినప్పటికీ అదే కొవ్వుతో మన శరీర భాగాలను అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చని ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ సుమితశంకర్ తెలిపారు. మంగళగిరి సమీపంలోని హాయ్లాండ్లో శనివారం నాలుగు రాష్ట్రాల చర్మవ్యాధుల వైద్య నిపుణుల సమావేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సుమిత శంకర్ మాట్లాడుతూ పలు కారణాల వల్ల వివిధ శరీర భాగాలు కుచించుకొని, పాడైపోయే ప్రమాదం ఉందని, దాన్ని తిరిగి ఉత్తేజపరచడానికి, యథాస్థితికి రావడానికి ఈ కొవ్వు ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. పలు శరీర భాగాల పెరుగుదల, పునరుత్పత్తిలో స్టెమ్ సెల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. అటువంటి స్టెమ్‌సెల్స్ తయారు కావడంలో కొవ్వు పదార్ధం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దాదాపు 3 దశాబ్దాల నుంచి శరీరం నుంచి కొవ్వును తొలగించే ప్రక్రియ జరుగుతూ వస్తుందని చెప్పారు. తొలగించిన కొవ్వును బ్రెస్ట్ పెరుగుదలకు, బుగ్గలు నునుపు తేలేందుకు, బటక్స్‌ను అందంగా మార్చేందుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. పరిశోధనల క్రమంలో కొవ్వును తాజాగా చర్మం ముడతలు పడకుండా, ముక్కు అందంగా తీర్చిదిద్దేందుకు వాడుతూ వచ్చారని చెప్పారు. ప్రస్తుతం రేడియేషన్ ద్వారా కుచించుకుపోయిన చర్మాన్ని పునరుత్తేజపరచడం, కాలిపోయిన చర్మాన్ని యథాస్థితికి తీసుకురావడం వంటి వాటికి ఈ కొవ్వును వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కొవ్వు ద్వారా తయారయ్యే స్టెమ్‌సెల్స్‌ను ఉపయోగించి జుట్టుపెరుగుదల, కొత్తగా వెంట్రుకలను మొలిపించడంతో పాటు పళ్లు గట్టితనానికి, మెరవడానికి దీనిని వినియోగించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. -
అందానికివే మంత్రదండాలు !
అందం అదృష్టం కాదు. ఇందుకోసం ఎంతో శ్రద్ధ కావాలి. చాలా కొద్దిమంది మాత్రం అందమైన చర్మాన్ని, ఆకర్షణీయమైన రూపానికి కారణమయ్యే జన్యువులను కలిగివుంటారు. కాబట్టి ఎక్కువ కష్టపడకుండానే యవ్వన రూపాన్ని కోల్పోకుండా ఉంటారు. ఇక మిగిలిన వాళ్లకు కూడా సహాయపడగలిగే ఆధునిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. అదే ఈస్తటిక్ డెర్మటాలజీ. ఏ వయసులోనైనా ఆకర్షణీయంగా కనబడడాన్ని ఈ వైద్యపరిజ్ఞానం సుసాధ్యం చేస్తున్నది. యాంటి ఏజింగ్ అనేది కేవలం వయసు తక్కువ కనిపించేట్టుగా చేసే ప్రయత్నం మాత్రమే కాదు. వయసుకు తగిన అందాన్ని కాపాడుకోవడం, ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవడం కూడా.. మీ భావవ్యక్తీకరణలను కనిపించకుండా ఫ్రీజ్ చేసేసి, ముడతల్ని ఇస్త్రీ చేసేసి, సాగిన చర్మానికి కృత్రిమ మెరపులద్దడం యాంటి ఏజింగ్ కాదు. నిజానికి ఈ కృత్రిమ హంగులు అంత మంచివి కూడా కాదు. యాంటి ఏజింగ్ అనేది ఒక మంత్రదండం లాంటిది. అయితే మీరు తప్పుబట్టాల్సింది మ్యాజిక్‌ని కాదు... మెజీషియన్‌ని.. అందుకే నిపుణుడైన, అనుభవజ్ఞుడైన డాక్టర్‌పై నమ్మకం పెట్టడం అవసరం. ఇంజెక్షన్లు నాకు అత్యంత ఇష్టమైన మంత్రదండాలు, సరైన పద్ధతిలో ఇస్తే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సన్నని గీతలు చెరిపేయడానికి, చర్మాన్ని బిగుతుగా, మృదువుగా చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ముఖ ఆకృతిని సరిచేయడంలో కూడా ఇవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కాస్మెటిక్ చికిత్సల్లో ఇంజెక్టబుల్స్ అత్యంత సురక్షితమైనవని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ చేసిన ఇటీవలి అధ్యయనంలో తేలింది. ప్రముఖమైన ఇంజెక్టబుల్స్ ఇవీ... బొటాక్స్: ఇది ఒక ప్రొటీన్. ఇంజెక్షన్ ఇచ్చిన చోట కండరాన్ని ఈ బొటాక్స్ వ్యాకోచింపచేస్తుంది. మన భావవ్యక్తీకరణల వల్ల ఏర్పడిన సన్నని గీతల వంటి చిన్న చిన్న ముడతలను తొలగించడానికి సాధారణంగా దీన్ని ఉపయోగిస్తారు. అయితే దవడ పునర్నిర్మాణం, ముఖ కండరాలు కిందకి జారిపోవడం (అంటే మెడ దగ్గరి ముఖ కండరాలు, నుదురును కిందికి జారినట్టు చేసే కండరాలు) వంటి వాటికి కూడా వీటిని ఉపయోగిస్తారు. బన్నీస్మైల్, ముక్కు రంధ్రాల్లో మంట లాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. అంతేగాక మైగ్రేన్ తలనొప్పి, అధిక చెమట లాంటి ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స అందిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తవడానికి కేవలం 10 నిమిషాల సమయం చాలు. ఫిల్లర్: ఫిల్లర్ అనేది ఒక జెల్ లాంటి పదార్ధం. ఇది జీవసంబంధమైన పదార్థాలతో తయారుచేసింది. (బయలాజికల్ జెల్). దీన్ని లోపం ఉన్న భాగానికి ఇంజెక్ట్ చేస్తారు. విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కనిపించే గీతలు (నవ్వినప్పుడు ఏర్పడే గీతలు, కోపం ముఖం వల్ల ఏర్పడిన గీతల్లాంటివి) ఉన్నచోటికి కూడా దీన్ని ఇంజెక్ట్ చేస్తారు. లోపలికి పోయిన బుగ్గలు, కళ్ల కింది భాగాల్లోకి కూడా పంపిస్తారు. పెదవులు, గడ్డం, బుగ్గల లాంటి భాగాలను బలోపేతం చేసి, వాటి పరిమాణాన్ని పెంచుతారు. ఏవైనా మచ్చలు, లేదా హైడ్రేషన్, చర్మం రిఫ్రెష్ చేయడం ద్వారా సన్నని స్టాటిక్ గీతలను కూడా తగ్గిస్తారు. చికిత్స చేయాల్సిన భాగం రంగును బట్టి దీనికి 5 నుంచి 20 నిమిషాలు పడుతుంది. బొటాక్స్, ఫిల్లర్ల గురించి మరింత సమాచారం కొరకు కింది వీడియోలను చూడవచ్చు. www.drrashmishetty.com/pages/botox.html www.drrashmishetty.com/pages/filler.htm అందంగా మార్చడం వెనుక డాక్టర్ నైపుణ్యం ఉంటుంది. అంతేగాక సమస్యను విశ్లేషించడం, చికిత్సకు ప్రణాళిక రూపొందించడం కూడా కీలకమే. - డాక్టర్ రశ్మిశెట్టి రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్, రోడ్ నెం. 4, బంజారాహిల్స్, హైదరాబాద్ 9000770895, 8008001225