breaking news
Beating a Student
-
బాలున్ని చితకబాది.. ఒంటిపై మూత్రం పోసి..
లక్నో: ఉత్తరప్రదేశ్, మీరట్లో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ బాలునిపై దాడి చేసి మూత్రం పోశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ రోజు రాత్రి బాధితుడు ఇంటికి కూడా వెళ్లలేదు. మరునాడు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత బాధితుడు పోలీసులకు అసలు విషయాన్ని బయటపెట్టాడు. కొందరు దుండగులు తనను బందించి శరీరంపై మూత్రం పోశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు పాల్పడినవారిలో బాలుని స్నేహితులు ఉన్నారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇదీ చదవండి: Lightning Strikes In Gujarat: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత -
జేడీయూ లీడర్ షాకింగ్ వీడియో..
పాట్నా: బిహార్లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి గదిలో బందించి చితక్కొడుతున్న వీడియో బయటకు వచ్చి హల్ చల్ చేస్తోంది. అధికార పార్టీ జేడీయూకు చెందిన విద్యార్థి విభాగం నేతలు ఈ దాష్టీకానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటన రెండు నెలల కిందటే జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. జేడీయూ విద్యార్థి విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి మనీశ్ మాలిక్ శివం అనే విద్యార్థిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఓ గదిలో బందించి ఆ విద్యార్థి బట్టలు విప్పేసి మరికొందరితో కలసి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన తాజాగా బయటకు రావడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.