breaking news
BC-A list
-
ముదిరాజ్‌లను బీసీ–ఎలో చేర్చొద్దు
► గంగపుత్రులకు అన్యాయం చేయవద్దు ► గంభీరావుపేటలో ర్యాలీ గంభీరావుపేట : ముదిరాజ్ కులస్తులను బీసీ–ఎ జాబి తాలో చేర్చి తమకు అన్యాయం చేయవద్దని గంగపుత్ర సంఘం నాయకులు డిమాండ్ చేశా రు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్ఐ కార్తీక్‌కు వినతిపత్రం ఇచ్చా రు. గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీసే లా వ్యవహరించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. చేపల వృత్తి ముదిరాజ్‌లదని, గంగపుత్రులకు అన్యాయం చేసేలా సీఎం కేసీఆర్ ప్రకటించ డం విడ్డూరంగా ఉందన్నారు. సర్కారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు కూర దేవేందర్, మండల అధ్యక్షుడు కరువారి శంకర్, నాయకులు దామోదర్, కాత మల్లేశం, శ్రీధర్, శ్రీనివాస్, ధర్మపురి, శ్రీకాంత్, దేవేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముదిరాజ్‌లను బీసీ–ఎ జాబితాలో చేర్చవద్దు
గంగపుత్రుల డిమాండ్ ► కలెక్టరేట్ ముట్టడి ► అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనపై తీవ్రనిరసన సిరిసిల్ల : ముదిరాజ్ సామాజికవర్గాన్ని బీసీ–ఎ జాబితాలో చేర్చుతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయడం సరికాదని గంగపుత్రులు అన్నారు. సీఎం ప్రకటనను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీప్రదర్శన నిర్వహించారు. తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముదిరాజ్‌లను బీసీ–ఎ గ్రూపులో చేర్చవద్దని డిమాండ్ చేశారు. చెరువుల్లో చేపలు పట్టే వృత్తిలో ఉన్న నిజమైన మత్స్యకారులకు అన్యాయం చేయొద్దని, సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా బీసీ–ఎ జాబితాలోని 53 ఉప కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్లం చేశారు. అణగారిన కులాలు అధికంగా ఉన్న బీసీ–ఎ జాబితాకు 7శాతం రిజర్వేషన్ సరిపోదన్నారు. వీరి మధ్య ఇప్పటికీ ఆర్థిక అసమానతలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్ ను 14శాతానికి పెంచి ముదిరాజ్‌లను బీసీ–ఎ గ్రూపులో చేర్చితే తమకు అభ్యంతరం లేదని అన్నారు. అనంతరామన్ కమిషన్ కులాలు, వృత్తుల విషయంలో ఇదే స్పష్టత ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ తన ప్రకటనపై పునరాలోచించాలని గంగపుత్రులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్ డి.కృష్ణభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూర దేవేందర్, ప్రధాన కార్యదర్శి ఖాత మల్లేశం, నాయకులు నర్సయ్య, రవి, మహేశ్, తోకల తిరుమల్, పారిపెల్లి శ్రీనివాస్, వెంగల శ్రీనివాస్, పరశురాములు, కె.శ్రీధర్, మునీందర్, సాయాబు, ప్రశాంత్, హన్మయ్య, దేవరాజు, రాజయ్య, శ్రీనాథ్, ఎల్లయ్య, శంకర్, శివప్రసాద్, సాయికుమార్, సతీశ్ పాల్గొన్నారు.