breaking news
bc gurukula
-
వంట సామాన్లలో పంట పండింది!
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ శాఖలో అడ్డగోలుగా దోపిడీ జరుగుతోంది. గురుకులాలకు సరఫరా చేసిన వంట సామగ్రిలో ఇష్టారాజ్యంగా కాసులు దండుకుంటున్నారు. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) చెందిన 105 గురుకులాలకు ప్రభుత్వం వంట సామగ్రి అందించింది. ప్రతి గురుకులానికి స్టౌవ్తోపాటు మరో పది రకాల సామగ్రిని సరఫరా చేశారు. రాజకీయ జోక్యంతో జిల్లాల వారీగా వాటిని సరఫరా చేసే బాధ్యతను స్థానికులకు కట్టబెట్టారు. దీంతో బయట మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే వాటికి అధిక ధర చెల్లించడంతో పెద్దఎత్తున ప్రజాధనం లూటీఅయ్యింది.ఉదా.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన ఏజెన్సీ గురుకులాలకు సరఫరా చేసిన 11 రకాల సామగ్రిని చెల్లించిన ధరలు చూస్తే విస్తుపోవాల్సిందే. గ్యాస్ స్టవ్ డబుల్ బర్నర్ కమర్షియల్ ధర రూ.26,298.38 అని నిర్ణయించి దానికి ఐదు శాతం స్టేట్ జీఎస్టీ, మరో ఐదు శాతం సెంట్రల్ జీఎస్టీ కలుపుకుని మొత్తం రూ.31,032.09 వసూలు చేశారు. నిజానికి మార్కెట్లో దీని ధర రూ.9 వేల లోపే ఉంటుందని చెబుతున్నారు.వంద కిలోల ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ ధర రూ.14,078 అని చెప్పి దానికి జీఎస్టీ కలుపుకుని రూ.16,612.49 వసూలుచేశారు. ఇలా ఇష్టానుసారం ధరలు నిర్ణయించి ఒక్కో గురుకులానికి మొత్తం రూ.86,686 చొప్పున లాగేశారు. ఇలా రాష్ట్రంలో 105 గురుకులాలకు కలిపి మొత్తంగా రూ.91,02,030 నిధులు ఖర్చుచేశారు. మార్కెట్ ధరకు మించి అయినవారికి అప్పనంగా ప్రజాధనం దోచిపెట్టడం వెనుక ఎవరి వాటా ఎంత అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గురుకులాలకు సరఫరా చేసిన సామగ్రికి చెల్లించిన ధరలు.. (జీఎస్టీతో కలిపి)⇒ గ్యాస్ స్టవ్ డబుల్ బర్నర్ కమర్షియల్ రూ.31,032.09⇒ వంద కిలోల ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ రూ.16,612.49⇒ మిక్సర్ గ్రైండర్ (750 వాట్స్) 3 జార్లు రూ.9,313.95⇒ఐదు కిలోల వెయింగ్ మెషిన్ రూ.7,738.89⇒ హెవీ డ్యూటీ చిన్నసైజు రైస్ స్ట్రైనర్ రూ.6,096.70⇒ హెవీ డ్యూటీ ఐరెన్ కడాయి రూ.5,109.70⇒ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ 10 లీటర్లు రూ.4,882.69⇒ అల్యూమినియం కుక్కర్ 5 లీటర్లు రూ.3,777.25⇒ 1.5 లీటర్ల జగ్ రూ.608.98⇒ ఐరన్ కురుపి 30 అంగుళాలు రూ.961.68⇒ 13 అంగుళాల ఎత్తున్న జీఐ బక్కెట్ రూ.551.27 -
బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.జూనియర్ ఇంటర్మిడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీలతో అగ్రికల్చర్ – క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్ కాలేజీలలో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్ https:// mjptbcwreis. telangana.gov.in (ro) https:// mjpabcwreis. cgg.gov.in/ TSMJBCWEB/ లో లేదా 040–23328266 నంబర్లో సంప్రదించాలని సూచించారు. బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు 10వ తరగతి చదివిన గురుకుల స్కూల్లో సంబంధిత ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని వివరించారు. -
సాగర్‌లో మరో బీసీ బాలుర గురుకుల పాఠశాల
నాగార్జునసాగర్ : అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో మరో బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తెలిపారు. మంగళవారం పైలాన్ కాలనీలోని బీఈడీ కళాశాలలో పెద్దవూర మండలపార్టీ అధ్యక్షుడు కర్నబ్రహ్మానందరెడ్డితో కలిసి రికార్డులను పరిశీలించారు. గురుకుల పాఠశాల ఏర్పాటుకు కావాల్సిన భవనం కోసం ఆ కళాశాల ఆవరణలోనే మధ్యంతరంగా నిలిచిపోయిన భవనంతో పాటు మరికొన్ని ఎన్ఎస్పీకి చెందిన గోదాంలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 119 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరైనట్లు వెల్లడించారు. అందులో భాగంగానే సాగర్ నియోజకవర్గానికి పాఠశాల మంజూరైనట్లు తెలిపారు. విద్యపరంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆచార్య నాగార్జునుడి సన్నిధిలో ప్రపంచ దేశాలనుంచి విద్యార్థులు వచ్చి అభ్యసించినట్లు పేర్కొన్నారు. అందుకే ఆ పాఠశాలను సాగర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన భవనం నిర్మించే వరకూ పాఠశాల తాత్కాలికంగా నడిచేందుకు భవనం అవసరమని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే ప్రారంభించాల్సి ఉందని అందుకే భవనాలను పరిశీలించినట్లు తెలిపారు. బీఈడీ కళాశాల కూడా ఇక్కడే ఉంటుందని ఆ కళాశాలను నల్లగొండకు తరలించడమనేది లేదన్నారు. ఎమ్మెల్యే వెంట తుమ్మడం బీసీగురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జనార్థన్‌రెడ్డి, కర్నబ్రహ్మానందరెడ్డి, శేఖరాచారి, శ్రీను తదితరులున్నారు. -
బీసీ గురుకులాల్లో సీట్లు పెంచండి: జాజుల
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సీట్ల సంఖ్యతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య భారీగా ఉందని తెలిపింది. దీంతో నిర్దేశిత సంఖ్యలో మార్పులు చేసి మరింత మందికి ప్రవేశాలు కల్పించాలని కోరింది. అలాగే మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు çబీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు. -
బీసీ గురుకుల ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి : జిల్లాలోని మహాత్మాజ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ వరకు చేసిందని, 2016–17 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిట్యాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవిప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని చిట్యాల, కొడంగల్‌లో బాలురు, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో బాలికలను ఎంపిక చేస్తామన్నారు. మొదటి సంవత్సరం కోసం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. పదో తరగతి ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని, దరఖాస్తులు రూ.150 ఫీజు చెల్లించి ఆన్లైన్లో మాత్రమే చేయాలన్నారు. ఆగస్టు 11న ప్రవేశాలు, 16న తరగతులను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


