బీసీ గురుకుల ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | bc gurukula inter admisstions are open | Sakshi
Sakshi News home page

బీసీ గురుకుల ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Jul 31 2016 11:50 PM | Updated on Aug 17 2018 3:08 PM

జిల్లాలోని మహాత్మాజ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్‌ వరకు చేసిందని, 2016–17 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిట్యాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రవిప్రకాశ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వనపర్తి : జిల్లాలోని మహాత్మాజ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్‌ వరకు చేసిందని, 2016–17 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిట్యాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రవిప్రకాశ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని చిట్యాల, కొడంగల్‌లో బాలురు, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో బాలికలను ఎంపిక చేస్తామన్నారు. మొదటి సంవత్సరం కోసం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. పదో తరగతి ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని, దరఖాస్తులు రూ.150 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలన్నారు. ఆగస్టు 11న ప్రవేశాలు, 16న తరగతులను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement