breaking news
Barricades Set up
-
జలాల్పురం చెరువుకట్టపై బారికేడ్లు ఏర్పాటు
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్పురం (Jalalpuram) చెరువు కట్టపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం బారికేడ్లు (Barricades) ఏర్పాటు చేశారు. గడిచిన పదిహేను రోజుల్లో రెండు కార్లు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో రక్షణ చర్యలు చేపట్టడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ నేపథ్యంలో ‘అసలే ఇరుకు.. ఆపై మలుపు’ అనే శీర్షికన ఈనెల 22న సాక్షి (Sakshi) మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రమాదాలు నివారించడానికి పోలీసులు చెరువు కట్టపై 11 భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.మెనర్ డ్రైవింగ్.. తల్లికి శిక్ష సిరిసిల్ల క్రైం: బాలుడు వాహనం నడుపుతూ ఒకరి మరణానికి కారణమైన కేసులో.. అతని తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం అందించిన వివరాలివి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం బస్టాండ్ సమీపంలో ఈ నెల 18న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. రుద్రంగి మండలానికి చెందిన గడ్డం లక్ష్మి.. మైనర్ అయినప్పటికీ తన కొడుక్కి వాహనం ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగింది.చదవండి: గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతిప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కంటే రాములు (72) తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్‌కు బైక్ ఇచ్చిన తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే.. పెద్దలు జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. -
ఇప్పటికి కళ్లు తెరిచారు
* దుర్ఘటన తర్వాత మేల్కొన్న ఏపీ ప్రభుత్వం * ఘాట్లు, రోడ్లపై రద్దీ లేకుండా జాగ్రత్తలు రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రచార యావతో భక్తులను గాలికొదిలేసిన ప్రభుత్వం పుష్కరఘాట్‌లో 27 మందిని బలిగొన్న తర్వాత మేల్కొంది. ఊహల్లో విహరిస్తూ అంతా అద్భుతంగా ఉందనే ప్రచారంతో నేల విడిచి సాము చేసిన ప్రభుత్వ పెద్దలు.. విపక్షాలు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. అదనపు పోలీసు బలగాలను దింపి దుర్ఘటన జరిగిన పుష్కరఘాట్ మొదలు మిగిలిన ఘాట్లలోనూ మోహరించారు. తొక్కిసలాట జరిగిన ఘాట్ ఎదుట కోటగుమ్మం సెంటర్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం సీఎం వాహనశ్రేణి సులభంగా తిరిగేందుకు బారికేడ్లను ఏర్పాటు చేయలేదు. దీనివల్ల భక్తులు ఒకేచోట పోగుపడి మళ్లీ ఇబ్బందులు నెలకొంటాయని రాత్రికి రాత్రి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీంతో గోదావరి రైల్వేస్టేషన్లో దిగిన భక్తులు నేరుగా క్యూలైన్లోకి వెళ్లి పుష్కరఘాట్‌లోకి ప్రవేశించే వీలు ఏర్పడింది. స్టేషన్లో ఎక్కువమంది దిగితే రద్దీని పక్కనున్న కోటిలింగాల రేవుకు మళ్లించారు. క్యూలైన్లు, ఘాట్లలో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. భక్తులు రోడ్లపైకి రాకుండా క్యూలైన్లలో వెళ్లేలా చూశారు. అదే సమయంలో క్యూలైన్లలోనూ భారీగా జనం ఉండకుండా జాగ్రత్తపడ్డారు. దృష్టంతా పుష్కరఘాట్పైనే: పుష్కరఘాట్లోనూ ఎక్కడా జనం నిలబడకుండా వెంటనే స్నానం చేసి వెళ్లిపోయేలా చూశారు. పోలీసులు, వలంటీర్లు నదిలో స్నానం చేసిన వెంటనే భక్తులను తీసుకొచ్చి బయటకు పంపించివేశారు. మంగళవారం మంచినీరు లేక జనం అల్లాడిపోవడంతో బుధవారం మంచినీటి ప్యాకెట్లను ఘాట్లు, క్యూలైన్లలో పంపిణీ చేయించారు. ఇదంతా కేవలం పుష్కరఘాట్‌లోనే కనిపించింది. మిగిలిన ఘాట్లలో ఈ స్థాయి ఏర్పాట్లు చేయలేదు. ఘాట్లలో అర్ధరాత్రి తిరిగిన ముఖ్యమంత్రి మంగళవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాట్లలో అర్ధరాత్రి తిరిగారు. సరస్వతి, కోటిలింగాల, పుష్కరఘాట్లలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమీక్షలు నిర్వహించనున్నారు. పోలీసులకు మరిన్ని వాకీటాకీలు సాక్షి, రాజమండ్రి: రాజమండ్రి పుష్కరఘాట్ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలీసుల మధ్య మరింత సమన్వయం కోసం మరిన్ని వాకీటాకీలు మంజూరు చేసిం ది. వీటిని రాజమండ్రిలోని 18 ఘాట్లకు కేటాయించారు. ముఖ్యంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే పుష్కరఘాట్‌కు ఎనిమిదింటిని కేటాయించారు. మంగళవారం నాటి దుర్ఘటన తర్వాత ఈ ఘాట్‌వద్ద పోలీసు బందోబస్తును పెంచారు. 11 మంది ఐపీఎస్‌లు ప్రస్తుతం ఇక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.