breaking news
Barbara pierce bush
-
బుష్ కుటుంబంలో విషాదం
మిడ్‌లాండ్(టెక్సాస్): అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్(సీనియర్) సతీమణి బార్బరా పియర్స్ బుష్(92) కన్నుమూశారు. వృద్ధాప్యంలోనూ చలాకీగా వ్యవహరించే ఆమె మంగళవారం ఇంట్లో ఉన్నప్పుడే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారని బుష్ కుటుంబ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. బార్బరా మరణంతో బుష్ కుటుంబంలో విషాదం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాల ప్రముఖులూ బుష్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. 16 ఏళ్లకే ప్రేమ-పెళ్లి: 1925, జూన్ 8న మాన్‌హట్టన్‌లో జన్మించిన బార్బరా పియర్స్ ఆష్లే హాల్ స్కూల్లో గ్రాడ్యువేషన్ పూర్తిచేశారు. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడు జార్జ్ బుష్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో టెక్సాస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అనంతరకాలంలో బుష్ రాజకీయాల్లో ఎదిగి రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారిలో జార్జ్ బుష్(జూనియర్) కూడా దేశాధ్యక్ష పదవి చేపట్టడం తెలిసిందే. ఫస్ట్‌లేడీగా ఉన్న రోజుల్లో అక్షరాస్యత వ్యాప్తి కోసం బార్బరా కృషిచేశారు. బార్బరా-బుష్ దంపతుల 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. వారికి ఐదురు సంతానం. 17 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఏడుగురు మునిమవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. సీనియర్ బుష్ (93) సైతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. Statement by the Office of @GeorgeHWBush on the passing of Barbara Pierce Bush this evening at the age of 92. pic.twitter.com/c6JU0xy6Vc — Jim McGrath (@jgm41) 17 April 2018 3. President and Mrs. Bush were married for 73 years. pic.twitter.com/B5P3iOMGU2 — Yashar Ali 🐘 (@yashar) 17 April 2018 -
హిల్లరీకి ఊహించని వ్యక్తి మద్దతు
న్యూయార్క్: డెమోక్రటిక్ పార్టీలో పుట్టి, పెరిగి, భర్తను అధ్యక్షుడిగా గెలిపించుకుని, తర్వాతి కాలంలో కీలక పదవులు చేపట్టి.. ప్రస్తుతం అదే పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న హిల్లరీ క్లింటన్‌కు.. ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మద్దతు పలకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి మరెవరోకాదు.. ఫొటోలో మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ పక్కన కూర్చుందే.. ఆయన కూతురు బార్బరా పియర్స్ బుష్! ముత్తాతల కాలం నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీ(జీఓపీ లేదా రిపబ్లికన్)లో కొనసాగుతూ, అదే పార్టీ నుంచి రెండు సార్లు దేశాధ్యక్ష పదవిని సైతం నిర్వహించిన కుటుబానికి చెందిన బార్బరా.. ఎవ్వరూ ఊహించని విధంగా డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ కోసం నిధులు సేకరించే కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హిల్లరీ కీలక సహాయకురాలు హుమా అబెదిన్ శనివారం న్యూయార్క్ రాష్ట్రంలోని పారిస్ లో నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బార్బరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ కార్యక్రమానికి బార్బరా వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవికాస్త వైరల్ అయిపోవడం విశేషం. బార్బరా మద్దతుతో ఆమె కుటుంబమంతా సొంత పార్టీ(రిపబ్లికన్) అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకులని బాహాటంగా తేలిపోయింది.. ఒక్క జార్జి బుష్(జూనియర్) తప్ప! అయితే జార్జి బుష్ నేరుగా హిల్లరీకి మద్దతు ప్రకటించలేదుకానీ మొదటి నుంచి ఆయన ట్రంప్ వ్యతిరేకి. అందుకే ఇప్పటివరకూ రిపబ్లికన్ అభ్యర్థి కోసం ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఆయన సోదరుడు జెబ్ బుష్ రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ట్రంప్ తో పోటీపడి, నెగ్గలేక ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పుకుని.. ప్రస్తుతం ప్రత్యర్థిని(ట్రంప్ ను) ఓడించేలా వ్యూహాలు రచిస్తున్నారు. జార్జి డబ్ల్యూ బుష్ తండ్రి, సీనియర్ బుష్ అయితే గతనెలలో 'హిల్లరీకి ఓటు వేయాల'ని బాహాటంగా పిలుపునిచ్చారు. జూనియర్ బుష్ భార్య లారా కూడా హిల్లరీని పరోక్షంగా సమర్థించారు. బుష్ కుటుంబానికి చెందిన పలువురు(ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్నవారు)కూడా సొంతపార్టీ అభ్యర్థిని కాదని, హిల్లరీకి జై కొడుతున్నారు. కాగా, ట్రంప్ మాత్రం బుష్ లాంటి కొన్ని కీలక రాజకీయ కుటుంబాల మద్దతు లేకపోయిన గెలుపునాదేనని ప్రకటిస్తున్నారు. చూద్దాం.. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో?