breaking news
bank mergings
-
రెండు బ్యాంకుల విలీనానికి ఆర్బీఐ ఆమోదం
సహకార బ్యాంకింగ్ విభాగంలో ఇటీవల మోసాలకు గురైన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎన్ఐసీబీ)ను సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎస్సీబీ)లో విలీనం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీనం అధికారికంగా 2025 ఆగస్టు 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తేదీ నుంచి అన్ని ఎన్ఐసీబీ శాఖలు సారస్వత్ బ్యాంక్‌లో భాగంగా పనిచేస్తాయి.సారస్వత్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..ఎన్ఐసీబీ డిపాజిటర్లతో సహా ఖాతాదారులను 2025 ఆగస్టు 4 నుంచి సారస్వత్ బ్యాంక్ కస్టమర్లుగా పరిగణిస్తామని తెలిపింది. వారి ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని పేర్కొంది. ఈ విలీన ప్రక్రియలో భాగంగా ఎన్ఐసీబీ ఆస్తులు, అప్పులన్నింటినీ సారస్వత్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంటుంది. డిపాజిట్లు, అడ్వాన్సులతో సహా ఎన్ఐసీబీ బ్యాంకింగ్ కార్యకలాపాలను సారస్వత్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు.ఈ విలీనంతో సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌గా మారుతుంది. మార్చి 31, 2025 నాటికి మొత్తం వ్యాపారం (డిపాజిట్లు + అడ్వాన్సులు) రూ.91,800 కోట్లుగా ఉంది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ మార్చి 2025 నాటికి మొత్తం రూ.3,500 కోట్ల వ్యాపారం సాగించింది. ఇదీ చదవండి: బీర్ పరిశ్రమలో ఊహించని సమస్య2025 ఫిబ్రవరిలో న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు చెందిన ప్రభాదేవి ప్రధాన కార్యాలయం, గోరేగావ్ శాఖలో ఆర్బీఐ సాధారణ తనిఖీ సమయంలో రూ .122 కోట్ల అవకతవకలను కనుగొంది. ఫిజికల్ క్యాష్, లెడ్జర్ ఎంట్రీల మధ్య వ్యత్యాసాలతో వాల్ట్ల్లోని నగదులో మోసం జరిగినట్లు ధ్రువీకరించింది. -
ఒక రాష్ట్రం.. ఒకే ఆర్ఆర్బీ అమలుకు డేట్ ఫిక్స్
న్యూఢిల్లీ: ఒక రాష్ట్రం–ఒకే ఆర్ఆర్బీ విధానం మే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బీ) కన్సాలిడేట్ చేయనున్నారు. దీంతో నాలుగో విడత కన్సాలిడేషన్‌లో భాగంగా మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య ప్రస్తుతమున్న 43 నుంచి 28కి తగ్గుతుంది.విలీన జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర 11 రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీలు ఉన్నాయి. విలీనం అమల్లోకి వచ్చే తేదీని మే 1గా నిర్ణయించారు. ఉదాహరణకు, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు స్పాన్సర్ చేస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మొదలైన వాటిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద ఏకీకృతం చేస్తారు. కొత్త బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. దీన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుంది. వ్యయాలను క్రమబద్ధీకరించేందుకు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు 10 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలోని ఆర్ఆర్బీలను విలీనం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకేగ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, కళాకారులకు రుణాలు, ఇతరత్రా బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో ఆర్ఆర్బీ యాక్ట్ 1976 కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం 26 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 43 ఆర్ఆర్బీలు ఉన్నాయి. విలీనానంతరం ఈ సంఖ్య 28 ఆర్ఆర్బీలకు తగ్గుతుంది. వీటికి 700 జిల్లాల్లో 22,000 శాఖలు ఉంటాయి. ఆర్ఆర్బీల విలీన ప్రక్రియలో ఇది నాలుగో దశ. 2006–2010 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో తొలి విడతగా 196 ఆర్ఆర్బీలను 82కి తగ్గించారు. -
నేడు అన్ని బ్యాంకుల ముందు ధర్నాలు
-
రుణాలు ఎగ్గొట్టేవారు మార్గదర్శకులా?
– మౌనంగా ఉంటే అన్ని బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం ఖాయం – చేతనైతే ఆర్ఆర్బీలు అన్నింటినీ విలీనం చేయాలి – యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు ఒంగోలు : బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు బ్యాంకు ఉద్యోగులకు మార్గదర్శకులా..? అని యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ శోభన్‌బాబు ప్రశ్నించారు. ఆదివారం స్థానిక యూనియన్ బ్యాంకు ఆవరణలో బ్యాంకు ఉద్యోగులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే ఎస్బీఐ, అనుబంధ బ్యాంకుల విలీనం వేగవంతమైందని, ఈ విషయంలో మిగిలిన బ్యాంకు ఉద్యోగులు మౌనంగా ఉంటే ఆ పరిస్థితి ఇతర బ్యాంకులకు కూడా చుట్టుకుంటుందని శోభన్‌బాబు హెచ్చరించారు. ప్రభుత్వరంగ బ్యాంకులైనందునే డ్వాక్రా రుణాలు, రుణమాఫీ పథకాలను విజయవంతం చేశామని, దేశవ్యాప్తంగా 3 నెలల్లో రూ.22 కోట్ల జీరో బ్యాలెన్స్ జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు లె రవగలిగామని చెప్పారు. ప్రైవేటు బ్యాంకుల్లో పొదుపు ఖాతా ప్రారంభించాలంటే కనీసంగా రూ.10 వేలు నిల్వ ఉండాలంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలను బ్యాంకులకు దగ్గర చేస్తున్నాయా.. దూరం చేస్తున్నాయా.. అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. చేతనైతే గ్రామీణ బ్యాంకులన్నింటినీ విలీనం చేసి అతి పెద్ద బ్యాంకుగా చేయాలని, అందుకు సంపూర్ణ సహకారం అందించేందుకు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉందన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో సంస్కరణల పేరుతో విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మెకు బెఫీ(బ్యాంకు ఎంప్లాÄæూస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) పిలుపునిచ్చిందన్నారు. బెఫీ నాయకుడు, ఏపీజీబీ ప్రకాశం రీజియన్ కోశాధికారి నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు ఎదుర్కొంటన్న సమస్యలపై ఈ నెల 27,28 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. వాణిజ్య బ్యాంకులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 29న గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు భాగస్వాములవుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో బెఫీ నాయకులు సురేంద్రకుమార్, సుధాకర్, టీఎల్ ప్రసాద్, సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు మాట్లాడారు.