breaking news
Bangladesh border
-
బీజేపీ ప్రభుత్వంలోనే కంచె నిర్మాణానికి భూమి
సిలిగురి: సరిహద్దులు సురక్షితం కానంత వరకు రాష్ట్రం గానీ, దేశం గానీ సురక్షితంగా ఉండవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి భూమిని కేటాయించాలంటూ తాను పదేపదే విజ్ఞప్తి చేసినా బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయన వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) కార్యాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్ఎస్బీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి 1,129 ఎకరాల భూమిని కేటాయించాలని 2014 నుంచే కోరుతూ వచ్చానని తెలిపారు. కానీ, మమతా బెనర్జీ పాలనలో తన వినతిని తిరస్కరించారని ఆక్షేపించారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఆ భూమి లభించిందని స్పష్టంచేశారు. రాష్ట్రానికి చెందిన గత ముఖ్యమంత్రులెవరూ ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్ కార్యక్రమాలకు ఎన్నడూ హాజరుకాలేదని గుర్తుచేశారు. వేదికపై తన పక్కనున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారని ప్రశంసించారు. ఎస్ఎస్బీ అనేది రాజకీయ సంస్థ కాదని పేర్కొన్నారు. దేశ సరిహద్దులను కాపాడేవారి పట్ల ఉదాసీనత ప్రదర్శించడం తప్పుడు సంకేతాలను ఇస్తుందని వ్యాఖ్యానించారు. బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి అవసరమైనవన్నీ లభించాయని చెప్పారు. ఇప్పుడు అధికారిక లేఖలు పంపకముందే ప్రాజెక్టులకు రాష్ట్రం నుంచి ఆమోదాలు లభిస్తున్నాయని తెలిపారు. ఉత్తర బెంగాల్లోని సిలిగురిలో 80 ఎకరాల స్థలంలో సరిహద్దు భద్రతా యంత్రాంగ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు అమిత్ షా ప్రకటించారు. సిలిగురిలో మూడు క్రిమినల్ చట్టాలపై ఒక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. దేశమంతటా కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడం ప్రారంభించినప్పటికీ, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం వాటిని ఎన్నడూ నోటిఫై చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్లో చట్టబద్ధ పాలనను తీసుకొచి్చందని స్పష్టంచేశారు. -
బుల్లి రాష్ట్రం - భారీ ఓటింగ్
భారతదేశపు ఈశాన్యం మారుమూలన ఉన్న చిట్టి రాష్ట్రం త్రిపుర. నెలల తరబడి ఈ రాష్ట్రం పేరు కూడా తలుచుకోకుండా గడిపేయొచ్చు. అలాంటి అనామక రాష్ట్రం త్రిపుర. కానీ ఆ రాష్ట్రంలో ఎన్నికలైతే మాత్రం 93 శాతం పోలింగ్ జరుగుతుంది. అంత చైతన్యం ఉంది ఓటర్లలో. అయితే ఒక పెద్ద సమస్య కూడా ఉంది. అదేమిటంటే సరిహద్దుకు అటువైపు నుంచి బంగ్లాదేశీలు చొరబడి ఓటు వేసి వెళ్లిపోతూ ఉంటారట. రాష్ట్ర రాజధాని అగర్తలా పట్టణం మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. బహుశః ప్రపంచంలో ఇలా ఉన్న ఏకైక రాష్ట్రం త్రిపురయేనేమో! చాలా మంది బంగ్లాదేశీలు ఉదయమే అగర్తలాకి వచ్చి రిక్షాలు తొక్కుకుని, డబ్బులు సంపాదించుకుని, సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతూంటారు. అందుకే ఎన్నికలు రాగానే 856 కిమీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తారు. త్రిపురలో ఉన్నవి రెండు లోకసభ సీట్లు. కానీ రెండు విడతలలుగా ఎన్నికలు జరుగుతాయి. అక్కడ తూర్పు త్రిపుర, పశ్చిమ త్రిపుర అని రెండు లోకసభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రం మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. అందుకేనేమో వెస్ట్ త్రిపురలో ఏప్రిల్ 7న, తూర్పు త్రిపురలో ఏప్రిల్ 12 న ఎన్నికలు జరుగుతాయి. ఒకప్పుడు గిరిజన తీవ్రవాదం త్రిపుర అటవీప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు సమస్య కాసింత సద్దు మణిగింది. కానీ సరైన రోడ్లు, కమ్యూనికేషన్లు లేనందున పోలింగ్ నిర్వహించడంలో ఎన్నో సమస్యలుంటాయి. అందుకే రెండు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్నారు.


