breaking news
Bangalore Metro Rail Corporation
-
ఆఫీస్‌కు వస్తున్నారా?.. ఎలా రావాలో చెప్పిన ఇన్ఫోసిస్
బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన నమ్మ మెట్రో ఎల్లో లైన్ సర్వీసులకు భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ మద్దతుగా నిలుస్తుంది. సుస్థిర ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి కంపెనీ ఉద్యోగులను రోడ్డు రవాణాకు బదులుగా మెట్రోలో ప్రయాణించాలని కోరింది. జయనగర్‌లోని ఆర్వీ రోడ్డు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ద్వారా బొమ్మసంద్రను కనెక్ట్ చేసేలా 19.14 కిలోమీటర్ల ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఇటీవల ప్రారంభించారు. రోడ్డు ప్రయాణానికి సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఈ మెట్రో మార్గాన్ని ప్రమోట్ చేస్తూ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపించింది.ఇదీ చదవండి: టెలికాం టారిఫ్‌లు పెంపు?భారీ ట్రెఫిక్ జామ్‌లతో సతమవుతున్న బెంగళూరులో పలు ప్రాంతాలకు సులువుగా ప్రయాణించేలా మెట్రో సర్వీసులు అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. కోనప్పన అగ్రహార స్టేషన్ తన ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌కు కీలక నోడ్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. స్టేషన్ నుంచి ఇన్ఫోసిస్ మెట్రో ప్లాజా వరకు ప్రత్యేకమైన స్కైవాక్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇది క్యాంపస్‌కు ప్రత్యక్ష, సురక్షితమైన ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొంది. ఉద్యోగుల కోసం మెట్రో ప్లాజా వద్ద ఐడీ ఆధారిత ఎంట్రీ ప్రోటోకాల్స్ పాటించనున్నట్లు స్పష్టం చేసింది. -
మిడ్నైట్ మెట్రో
సాక్షి, బెంగళూరు: రాత్రి వేళ్లలో పని చేసే కార్మికులు, వారంతపు సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే వారు, రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అనుకూలంగా ఉండేందుకు మెట్రో రైలు సేవలు రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉండాలనే డిమాండ్ నెరవేరింది. ఇప్పటివరకు తెల్లవారుజామున 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రజల డిమాండ్ల మేరకు అర్ధరాత్రి 12 గంటలు దాటే వరకు మెట్రో రైళ్లు నడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో రైలు సంచరిస్తే, రాత్రివేళ్లల్లో రద్దీ తక్కువ ఉంటుందని ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు సంచరిస్తుంది. లక్షలాది మందికి ఉపయోగం మెట్రోసేవలు రాత్రి 12 గంటల వరకు అందుబాటులోకి తేవడంతో బెంగళూరువాసులకు ప్రయాణం మరింత సులభమవుతుంది. ఐటీ బీటీ కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు రాత్రివేళ మెట్రో రైళ్లలో ఆఫీసులకు, ఇళ్లకు చేరుకోవచ్చు. రాజాజినగర, పీణ్య, దాసరహళ్లి, వైట్‌ఫీల్డ్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసే కార్మికులు, కంపెనీ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటోంది. రాజాజినగర, పీణ్యలో మహిళా కార్మికులు రాత్రి 10.30, 11 గంటల వరకు విధుల్లో ఉంటారు. డ్యూటీ అయ్యాక సొంత వాహనాలు, క్యాబ్‌లలో ఇంటికి వెళ్లేవారు. లేదా తెల్లవారుజాము వరకు వేచి ఉండి సిటీ బస్సుల్లో బయల్దేరేవారు. మెట్రోసేవలు అందుబాటులోకి రావడంతో పేదలకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వర్షాకాలంలో అనుకూలం వర్షాకాలం ఆరంభం కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. వర్షం వస్తే నగరంలోని రోడ్లన్నీ జలావృతమై ట్రాఫిక్ జామ్ అవుతోంది. చెట్లు కూలి రోడ్లపై వాహనాల సంచారానికి అంతరాయం ఏర్పడుతోంది. గంటలకొద్దీ రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మెట్రోలో సురక్షితంగా గమ్యం చేరవచ్చు. 3, 4 తేదీల్లో అంతరాయం మెట్రో నిర్వహణ పనుల కారణంగా ఈనెల 3వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఎంజీ రోడ్డు నుంచి బయప్పనహళ్లి వరకు మెట్రో సేవలు రద్దు చేస్తున్నట్లు బీఎంఆర్సీఎల్ అధికారులు తెలిపారు. ఎంజీ రోడ్డు నుంచి నాయుండనహళ్లి వరకు గ్రీన్లేన్లో నాగసంద్ర నుంచి యలచెనహళ్లి వరకు యథావిధిగా సర్వీసులు నడుస్తాయని చెప్పారు. -
ఉద్యోగాలు
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్లో 138 పోస్టులు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్. ఖాళీలు: 138 దరఖాస్తుకు చివరి తేది: మే 10 వెబ్సైట్: www.bmrc.co.in ఐఐఏపీలో 21 పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏపీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు: ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మెకానిక్, జూనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ ఖాళీలు: 21 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 13 వెబ్సైట్: www.iiap.res.in ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)-హైదరాబాద్.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (పీజీడీఆర్‌డీఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వ్యవధి: ఏడాది దరఖాస్తుకు చివరి తేది: మే 18 వెబ్సైట్: www.nird.org.in -
భూగర్భ ప్రయాణం సాకారం
18.01 కిలోమీటర్లు, 17 మెట్రో స్టేషన్లు ప్రయాణ సమయం 33 నిమిషాలు పది రోజుల్లో అందుబాటులోకి బెంగళూరు: భూగర్భంలో ప్రయాణించాలనే బెంగళూరు నగరవాసుల కల సాకారం కానుంది. ఈమేరకు బయ్యపనహళ్లి నుంచి మైసూరు రోడ్డు వరకూ భూగర్భం, భూ ఉపరితలంలో నిర్మించిన రైలు మార్గంగుండా ప్రయాణికులను తీసుకువెళ్లడానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్)కు రైల్వే సేఫ్టీ కమిషనర్ తన సంసిద్ధత వ్యక్తం చేశారు. బెంగళూరు నగరంలో ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి ప్రస్తుతం దాదాపు ముప్పావుగంట సమయం, రూ.120 ఖర్చవుతోంది. నమ్మ మెట్రో నిర్మించిన భూగర్భ మార్గంలో రూ.40 ఖర్చుతో 18.1 కిలోమీటర్లను 33 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈస్ట్ (బయ్యపనహళ్లి), వెస్ట్ (మైసూరు రోడ్డు) కారిడార్లను కలుపుతూ నిర్మించిన మెట్రో రైలు మార్గం మరో పదిరోజుల్లో అందుబాటులోకి రానుంది. మొత్తం 18.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ మార్గంలో మొత్తం 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఇందులో కబ్బన్‌పార్క్ (మానిస్క్ స్క్వెయర్), విధానసౌధ, విశ్వేశ్వరయ్య (సెంట్రల్ కాలేజ్), కెంపేగౌడ (మెజెస్టిక్), సీటీ రైల్వే స్టేషన్లు భూ గర్భంలో ఉన్నాయి. గరిష్టంగా 1.2 కిలోమీటర్ల మధ్య దూరం ఉన్న ఈ స్టేషన్ల మధ్య రైలు సగటున గంటకు 38 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరడానికి 1.5 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కొక్క స్టేషన్లలో 30 సెకెనుల పాటు రైలు ఆగుతుంది. ఈ దిశలో ఎనిమిది రైళ్లు నడువనున్నాయి. ప్రతి పది నిమిషాలకు ఒక ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఒక్కొక్క ట్రైన్లో మూడు కోచ్‌లు ఉండగా, ఒక్కొక్క కోచ్‌లో 50 సీట్లు ఉంటాయి. ఈ విషయమై బీఎంఆర్సీఎల్ ఫైనాన్స్ విభాగం జనరల్ మేనేజర్ యూ.ఏ వసంత్‌రావ్ మాట్లాడుతూ...ఈస్ట్, వెస్ట్ కారిడార్ మధ్య వ్యాపార కేంద్రమైన సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ ఉంది. ముఖ్యంగా అనేక షాపింగ్‌మాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలయాలతో పాటు ఈ మార్గంలోనే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. అందువల్ల ఈ ఏడాది చివరి నాటికి ఈస్ట్, వెస్ట్ కారిడార్ మార్గం ద్వారా ఐదు లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తారని భావిస్తున్నాం. అన్ని రకాల అనుమతులు లభించినందువల్ల మరో పదిరోజుల్లోపు ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నాం.’ అని పేర్కొన్నారు.