breaking news
Bandra East
-
బీజేపీలో చేరిన తృప్తి సావంత్
సాక్షి, ముంబై: తూర్పు బాంద్రా (కళానగర్) అసెంబ్లీ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే తృప్తి సావంత్ శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మంగళవారం ఆమె బీజేపీలో చేరారు. టికెట్ ఇవ్వకపోవడంతో.. తూర్పు బాంద్రా అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో దివంగత శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే నివాసమైన మాతోశ్రీ బంగ్లా ఇక్కడే ఉంది. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక సవాలుగా తీసుకుంటాయి. తూర్పు బాంద్రా అనేక సంవత్సరాలుగా శివసేనకు కంచుకోటగా ఉంది. కాగా, 2018 మార్చిలో బాంద్రా నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ అలియాస్ బాలాసావంత్ అకస్మాత్తుగా మృతి చెందారు. దీంతో తూర్పు బాంద్రాకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలో బాలాసావంత్ భార్య తృప్తి సావంత్ శివసేన టికెట్‌పై పోటీచేశారు. ఆ సమయంలో శివసేన, బీజేపీ ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్నాయి. దీంతో బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపలేదు. ప్రత్యర్థిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి నారాయణŠ రాణేపై తృప్తి గెలిచారు. ఆ సమయంలో రాణే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. అనంతరం 2019 అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తృప్తి సావంత్ ను పక్కన బెట్టి మేయర్ విశ్వనాథ్ మహాడేశ్వర్‌కు అభ్యర్థిత్వం కట్టబెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన తృప్తి సావంత్ తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఫలితంగా ఓట్లు చీలిపోయి విశ్వనాథ్ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జిషాన్ సిద్ధికికీ లభించడంతో విజయఢంకా మోగించారు. -
ప్రాపర్టీలపై బాలీవుడ్ స్టార్ల క్రేజ్
వంద కోట్ల సినిమాలతో దూసుకెడుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఎడాపెడా ప్రాపర్టీలను కొనేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం లాల్బాగ్ ప్రాంతంలోని 64 అంతస్తుల బిల్డింగ్‌లో షారుఖ్ ఖాన్ రెండు ఫ్లోర్లు కొన్నాడు. ఇందుకోసం రూ. 100 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేశాడు. అటు సల్మాన్ ఖాన్ కూడా ఖరీదైన బాంద్రా ప్రాంతంలో బంగళా కొనాలని చూస్తున్నాడు. ఇక, అమితాబ్ బచ్చన్‌కి ఇప్పటికే ముంబైలో నాలుగు ఇళ్లు ఉన్నాయి. తాజాగా అయిదో బంగళాను రూ. 50 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ఆయన కోడలు, నటి ఐశ్వర్యరాయ్ ముంబైలోనే రూ. 5-6 కోట్లు పెట్టి ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నారట. సొంతంగా ఉండటానికి కావొచ్చు.. ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా కావొచ్చు.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్‌పైనే దృష్టి పెడుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. రెండు ఇళ్లు తీసుకున్నాడు. ఆయుష్మాన్ ఖురానా రెండో ఇల్లు కొనుక్కున్నాడు. ముంబైలో ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో రియల్టీ పెట్టుబడులతో సెలబ్రిటీలు తమ సంపదను పెంచుకుంటున్నారు.