breaking news
Bando Bastu
-
ఫ్రాన్స్‌లో మళ్లీ నిరసనల సెగ.. 70 వేల మంది పోలీసులతో భద్రత!
ఫ్రాన్స్‌లో మరోసారి నిరసనలు ఉధృతమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు (శనివారం) పారిస్‌తో పాటు పలు నగరాల్లో నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో 70 వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విధ్వంసం, దోపిడీలు, హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ హెచ్చరించారు.పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, సిబ్బంది కొరతను పరిష్కరించాలని విద్యార్థులు తొలుత ఆందోళనలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, క్రమంగా ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరగడం, భవిష్యత్తులో ప్రభుత్వ ఖర్చులు తగ్గించే అవకాశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయని చెప్పారు. దీంతో విద్యార్థులు, కార్మిక సంఘాలతో పాటు ఇతర ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు కూడా నిరసనలకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.అయితే, నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినట్లు అధికారులు స్పష్ట చేశారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్వహించే ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రకటించారు. లియోన్, నీస్, మాంట్పెల్లియర్ వంటి నగరాల్లో బహిరంగ సమావేశాలపై నిషేధం విధించినప్పటికీ, దేశవ్యాప్తంగా వందలాది నిరసన కార్యక్రమాలకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.పారిస్‌లోని లూవ్రే, ఓర్సే, పికాసో మ్యూజియంలను మూసివేయడంతో పాటు పీఎస్జీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. గతవారం జరిగిన అల్లర్లలో పలు దుకాణాలు లూటీ అయ్యాయని, భవనాలకు నిప్పంటించారని అధికారులు తెలిపారు. అలాగే, లిమోజ్ నగరంలోని పురాతన టౌన్‌హాల్ కూడా దగ్ధమైనట్లు పేర్కొన్నారు. ఈ అల్లర్లకు సంబంధించి 232 మందిని జైలుకు పంపినట్లు న్యాయశాఖ మంత్రి జెరాల్డ్ డార్మనిన్ తెలిపారు. మరో 1,100 మందికి పైగా కోర్టు విచారణను ఎదుర్కొన్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం విద్యార్థి ప్రతినిధులతో సమావేశమైనట్లు ఆయన సలహాదారులు తెలిపారు. పాఠశాల విద్యను మెరుగుపరిచేందుకు ఇకపై పలు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని విద్యార్థులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, మరోవైపు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గతంలో ఉద్యమించిన ‘ఎల్లో వెస్ట్స్’ బృందం కూడా నిరసనల్లో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో మాక్రాన్ రాజీనామా చేయాలని ఈ బృందం డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో రాజకీయ విభేదాలు కూడా ఆందోళనలకు కారణమవుతున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మాక్రాన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాజకీయంగా మార్పు చోటుచేసుకోగా, అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్ష, కుడిపక్ష పార్టీల నేతలు విమర్శించసాగాయి. మరోవైపు, ఓర్లియాన్స్ నగరంలో కుడిపక్ష నేషనల్ ర్యాలీ పార్టీ సమావేశం జరగనుండటంతో అక్కడ ఘర్షణలు తలెత్తకుండా వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు ఏ స్థాయికి చేరతాయన్నది ఉత్కంఠగా మారింది.ఇదీ చదవండి: వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్ -
నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్’
‘‘మన దేశ భద్రత కోసం పాటుపడుతున్న ఎంతో మంది నిజమైన హీరోలు గుర్తింపుకు నోచుకోకుండా ఉండిపోతారు. ఈ నిజమైన హీరోలు దేశ సరిహద్దుల్లో ప్రతి రోజూ మనందరి కోసం నిలబడతారు. ఈ సినిమా కోసం వ్యక్తిగతంగా నేను వాళ్లను కలవటం గొప్ప అనుభూతి’’ అన్నారు సూర్య. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బందోబస్త్’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను యన్వీఆర్ సినిమాస్ పతాకంపై నిర్మాత యన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 20న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత డి. సురేశ్‌బాబు చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సూర్య మాకు ఫ్యామిలీ లాగానే. ఎందుకంటే వాళ్ల నాన్న (శివకుమార్) నటించిన చిత్రాలను మా నాన్న (రామానాయుడు) నిర్మించారు. సూర్యతో నేను ఎప్పుడు సినిమా చేస్తానో తెలియదు. లవ్లీ ఫ్యామిలీ వాళ్లది’’ అన్నారు. సూర్య మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఇచ్చే కిక్, హై డిఫరెంట్‌గా ఉంటుంది. ‘బందోబస్త్’ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన కె.వి. ఆనంద్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండి సినిమాలు తీస్తారు. నేనీ సినిమాలో ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కమాండోగా చేశాను. ఎవరైనా ఫైరింగ్ చేస్తే పారిపోకుండా భద్రతాధికారులు తమ గుండెలను చూపిస్తారు. కుటుంబాల్ని త్యాగం చేసే అలాంటి గొప్ప అధికారులకు నేను ఇచ్చే గౌరవమే ఈ సినిమా’’ అన్నారు. కె.వి. ఆనంద్ మాట్లాడుతూ– ‘‘సూర్యలో గొప్ప విషయం ఏంటంటే మనం 50 శాతం ప్లాన్ చేస్తే ఆయన నటనతో, యాక్షన్‌తో 100 శాతం చేస్తారు’’ అన్నారు. ‘‘సూర్య గారితో పని చేయటం అనేది లెర్నింగ్ ప్రాసెస్’’ అన్నారు ఆర్య. ‘‘సూర్య గారితో నటించటం నా డ్రీమ్. అది ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు సాయేషా. యన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు మా కోసం ‘స్పైడర్’ సినిమాను తమిళనాడులో విడుదల చేసి బ్రహ్మాండమైన బిజినెస్ చేశారు. అప్పటినుండి వాళ్ల సినిమాలను తెలుగులో నేను విడుదల చేస్తున్నాను. లైకా బేనర్ పది కాలాల పాటు ఉండి ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలీసు శాఖ సిద్ధమైంది. తొలి విడత ఈ నెల 6న విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు మండలాల్లోని 149 ఎంపీటీసీ, ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.ఇందుకోసం 161 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా వాటిలో 67 సమస్యాత్మక, 84 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ జరిగే మండలాల్లో సెక్షన్ 144 విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1,100మందితో బందోబస్తు తొలి విడత ఎన్నికలకు ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు/ఏసీపీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 79 మంది ఎస్ఐలు, 61 మంది ఏఎస్ఐ/హెడ్‌కానిస్టేబుళ్లు, 608 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 265మంది హోంగార్డులు, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్‌డ్‌కు చెందిన సాయుధ బలగాల సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని గస్తీ కోసం 42 మొబైల్ పార్టీలు, 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 15 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను కేటాయించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ(స్టాటిక్ సర్వలెన్స్), ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్) టీములను ఏర్పాటు చేశారు. 2,167 మందిపై బైండోవర్ కేసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 2,167మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 276 లెసైన్స్డు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనావళి ఉల్లంఘన కింద 66 కేసులు, మద్యం విక్రయూలకు సంబంధించి 85 కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర సామగ్రి పంపిణీ కట్టడి చేసేం దుకు కమిషనరేట్ పరిధిలో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తగిన లెక్కలు చూపని రూ.1.37 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.


