నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

Surya Bandobasth Movie Pre Release Event - Sakshi

– సూర్య

‘‘మన దేశ భద్రత కోసం పాటుపడుతున్న ఎంతో మంది నిజమైన హీరోలు గుర్తింపుకు నోచుకోకుండా ఉండిపోతారు. ఈ నిజమైన హీరోలు దేశ సరిహద్దుల్లో ప్రతి రోజూ మనందరి కోసం నిలబడతారు. ఈ సినిమా కోసం వ్యక్తిగతంగా నేను వాళ్లను కలవటం గొప్ప అనుభూతి’’ అన్నారు సూర్య. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బందోబస్త్‌’. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్‌ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను యన్వీఆర్‌ సినిమాస్‌ పతాకంపై నిర్మాత యన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు.

ఈ నెల 20న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. నిర్మాత  డి. సురేశ్‌బాబు చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సూర్య మాకు ఫ్యామిలీ లాగానే. ఎందుకంటే వాళ్ల నాన్న (శివకుమార్‌) నటించిన చిత్రాలను మా నాన్న  (రామానాయుడు) నిర్మించారు. సూర్యతో నేను ఎప్పుడు సినిమా చేస్తానో తెలియదు. లవ్లీ ఫ్యామిలీ వాళ్లది’’ అన్నారు. సూర్య మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఇచ్చే కిక్, హై డిఫరెంట్‌గా ఉంటుంది. ‘బందోబస్త్‌’ కంప్లీట్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఫిల్మ్‌. జర్నలిస్ట్‌ బ్యాగ్రౌండ్‌ నుండి వచ్చిన కె.వి.

ఆనంద్‌ నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండి సినిమాలు తీస్తారు. నేనీ సినిమాలో ఎస్‌.పి.జి (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) కమాండోగా చేశాను. ఎవరైనా ఫైరింగ్‌ చేస్తే పారిపోకుండా భద్రతాధికారులు తమ గుండెలను చూపిస్తారు. కుటుంబాల్ని త్యాగం చేసే అలాంటి గొప్ప అధికారులకు నేను ఇచ్చే గౌరవమే ఈ సినిమా’’ అన్నారు. కె.వి. ఆనంద్‌ మాట్లాడుతూ– ‘‘సూర్యలో గొప్ప విషయం ఏంటంటే మనం 50 శాతం ప్లాన్‌ చేస్తే ఆయన నటనతో, యాక్షన్‌తో 100 శాతం చేస్తారు’’ అన్నారు.

‘‘సూర్య గారితో పని చేయటం అనేది లెర్నింగ్‌ ప్రాసెస్‌’’ అన్నారు ఆర్య. ‘‘సూర్య గారితో నటించటం నా డ్రీమ్‌. అది ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు సాయేషా. యన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ గారు మా కోసం ‘స్పైడర్‌’ సినిమాను తమిళనాడులో విడుదల చేసి బ్రహ్మాండమైన బిజినెస్‌ చేశారు. అప్పటినుండి వాళ్ల సినిమాలను తెలుగులో నేను విడుదల చేస్తున్నాను. లైకా బేనర్‌ పది కాలాల పాటు ఉండి ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top