breaking news
balavikasa social charity
-
రెండోరోజూ ‘బాలవికాస’పై ఐటీ దాడులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: బాలవికాస స్వచ్ఛంద సంస్థ, దాని అనుబంధ సంస్థలపై వరంగల్‌వ్యాప్తంగా రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. సుమారు 15–20 వాహనాల్లో బుధవారం తెల్లవారుజామున హనుమకొండకు చేరుకున్న ఐటీ అధికారులు.. సీఆర్పిఎఫ్ భద్రత మధ్య తనిఖీలు మొదలుపెట్టారు. కాజీపేట ఫాతిమానగర్, హనుమకొండ సిద్ధార్థనగర్లలో ఉన్న బాలవికాస కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలో గురువారం రాత్రి వరకు 15 బృందాలుగా ఏర్పడిన అధికారులు సోదాలు నిర్వహించారు. తొలిరోజు తనిఖీల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్‌్కలతోపాటు కీలక ఉద్యోగులు, వ లంటీర్లకు చెందిన సె ల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సుమా రు నాలుగైదేళ్లకు సంబంధించిన బాలవికాస ఆదాయ వ్యయాల పత్రాలు, వార్షిక నివేదికలపై ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, బాలవికాస సంస్థపై ఐటీ దాడులను జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్రాజు ఖండించారు. 9 రాష్ట్రాలు, 7 వేల గ్రామాలకు సేవలు... భారత్‌లో సమాజాభివృద్ధి సేవల కోసం ఫ్రెంచ్–కెనడా జాతీయుడైన ఆండ్రే గింగ్రాస్, ఆయన సతీమణి బాలథెరిసా గింగ్రాస్ 1977లో కెనడాలో సోపర్ సంస్థను ప్రారంభించారు. సేవా కార్యకలాపాలను మరింత సమర్థంగా చేపట్టేందుకు వీలుగా సోపర్‌కు అనుబంధంగా కాజీపేటలోని ఫాతిమానగర్‌లో 1991లో బాలవికాస సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం బాలవికాసకు అనుబంధంగా 9 సంస్థలు పనిచేస్తున్నాయి. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లలోని 7 వేల గ్రామాలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి బాలవికాస సంస్థ తన సేవలు అందిస్తోంది. బాలవికాసలో సుమారు 300 మంది సిబ్బంది ఉండగా, క్షేత్రస్థాయిలో మరో 500 మంది పనిచేస్తున్నారు. గ్రామాల్లో నాణ్యమైన విద్య, సురక్షిత తాగునీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మహిళా సాధికారత, ఆదర్శగ్రామాల ఏర్పాటు అంశాలు ప్రధాన లక్ష్యాలుగా 30 వేల మంది వలంటీర్లు బాలవికాస ద్వారా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 60 లక్షల మంది పేదలకు మేలు కలిగేలా కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో ఘట్కేసర్ వద్ద సెంటర్ ఫర్ సోషల్ రెస్పాన్స్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించారు. సామాజిక వ్యవస్థాపకత, బాధ్యతాయుతమైన వ్యాపారాన్ని ప్రోత్సహించే శ్రేష్టత కేంద్రాలుగా 30 వినూత్న సోషల్ స్టార్టప్‌లను బాలవికాస ఏర్పాటు చేసింది. 125 మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేసింది. -
బాల వికాస కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేస్తాం
-
ప్రణాళికతో ముందుకు సాగితే విజయమే..
‘బాలవికాస’ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా కాజీపేటలో రాష్ట్రస్థాయి మహిళా వికాస పథకం సదస్సు కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : కుటుంబ నిర్వహణలో నైపుణ్యం కనబరిచే మహిళలు.. నిర్ధిష్టమైన ప్రణాళి కతో ముందుకు సాగితే వ్యాపార రంగంలో కూడా విజయం సాధించొచ్చని బాలవికాస సాంఘిక సేవాసంస్థ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా అన్నారు. కాజీపేటలోని బాల వికాస శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన ‘వ్యాపార రంగంలో మహిళా సాధికారత’ అంశంపై రాష్ట్రస్థాయి మహిళ వికాస పథ కం సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ర్ట నలుమూలల నుంచి హాజరైన మూడువేల మందికి పైగా మ హిళలను ఉద్దేశించి థెరిస్సా మాట్లాడా రు. వ్యాపారం చేసే వారు నీతి, నిజాయితీ పా టించాలని, ప్రతీ లావాదేవీని నమోదు చే సుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఏటా వచ్చే ఫలితాలను బేరీజు వేసుకుంటే జరిగిన తప్పుడు పునరావృతం కాకుండా చూసుకోవచ్చన్నారు. బాలవి కాస సహ వ్యవస్థాపకుడు ఆంధ్రె జింగ్రాస్ మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడం శుభపరిణామమన్నారు. వరంగల్ పీఠాధిపతి ఉడుముల బాల మాట్లాడుతూ బాలవికాస సంస్థ చేపడుతు న్న పలు పథకాల విజయవంతంలో జిం గ్రాస్, బాలథెరిస్సా కృషి అభినందనీయమన్నారు. సింగారెడ్డి శౌరిరెడ్డి, బాసాని మ ర్‌రెడ్డి కూడా మాట్లాడిన ఈ సమావేశం లో బాల వికాస సంస్థ పథకాలను పలువురు బుర్రకథల రూపంలో వివరించారు. కాగా, తొలుత మహిళలు కాజీపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాష్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, అతి రథ్, బాలక్క, వసంత, లూర్థు మర్రెడ్డితో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు.