breaking news
Bala Krishnudu
-
ఇద్దరు మిత్రుల సవాల్
నారా వారబ్బాయి రోహిత్, యంగ్ హీరో శ్రీవిష్ణుల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతీ సినిమాలో శ్రీవిష్ణుకు కీలక పాత్రలు ఇవ్వటంతో పాటు తానే స్వయంగా నిర్మాతగా మారి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న వీరభోగవసంత రాయలు సినిమాలో కూడా ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అయితే ఇంతటి స్నేహంగా ఉంటున్న ఈ ఇద్దరు యంగ్ హీరోలు బాక్సాఫీస్ ముందు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ఫ్యాక్షన్ మూవీ బాలకృష్ణుడు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన మెంటల్ మదిలో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య పోటీ తప్పేలాలేదు. రోహిత్ సిక్స్ప్యాక్లుక్లో కనిపిస్తుండటంతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ బాలకృష్ణుడు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాయి. పెళ్లిచూపులు లాంటి క్లాస్ హిట్ తరువాత రాజ్ కందుకూరి, సురేష్ బాబులు నిర్మిస్తున్న మెంటల్ మదిలో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ ఇద్దరు మిత్రుల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. -
దారిన పోయే రౌడీఫెలో : బాలకృష్ణుడు
-
రెజీనా కోసం రాశీఖన్నా..!
హీరోలే కాదు.. ఈ జనరేషన్ హీరోయిన్లు కూడా మల్టీ టాలెంటెడ్ గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. సినిమాల్లో నటనతో పాటు ఇతర విభాగాల్లోనూ సత్తా చాటేందుకు ఉత్సాహపడుతున్నారు. అదే బాటలో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా గాయనిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తను హీరోయిన్ గా నటించిన జోరు సినిమా కోసం తొలి సారిగా పాట పాడింది రాశీ. తరువాత మలయాళ చిత్రం విలన్ లోనూ గొంతు సవరించుకుంది. తాజాగా నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న బాలకృష్ణుడు సినిమాలో పాట పాడుతుంది. అయితే ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ కాదు. తొలి చిత్రాల్లో తన క్యారెక్టర్ కోసం పాట పాడిన రాశీ ఖన్నా, తొలిసారిగా రెజీనా పాత్ర కోసం పాడుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణం దశలో ఉంది.