breaking news
avenging
-
భర్తను చంపినట్టే చంపి.. ప్రతీకారం తీర్చుకుంది
కోయంబత్తూరు: ఓ మహిళ తన భర్తను చంపిన హంతకుడిని అందరూ చూస్తుండగానే, బస్టాండ్‌లో చంపి ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. రంగస్వామి, సుగంధమణి దంపతుల ఇంట్లో రవికుమార్ (50) అనే అతను పనిచేస్తుండేవాడు. ఏడాదిన్నర క్రితం రవికుమార్ గొడవపడి రంగస్వామిని బండరాయితో మోది చంపాడు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన రవికుమార్ గురువారం రాత్రి సుగంధమణి ఇంటికి వెళ్లి కేసు విషయంపై బెదిరించాడు. శుక్రవారం ఉదయం కోయంబత్తూరులోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న రవికుమార్‌ను సుగంధమణి పెద్ద రాయితో పలుమార్లు బాదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఆమె బస్సులో వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్
అమ్మన్: తమ దేశ పైలట్‌ను సజీవంగా దహనం చేసిన ఐఎస్ ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం ఉదయం ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. వీరిలో ఇరాక్‌కు చెందిన మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు సాజిద అల్ రిషావి(44), అల్‌ఖైదా సభ్యుడు జియాద్ అల్ కర్బోలి ఉన్నారు. రాజధాని అమ్మన్‌కు దక్షిణంగా ఉన్న స్వాకా జైలులో ఇస్లామిక్ న్యాయ అధికారి ఆధ్వర్యంలో ఉరిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. 2005లో అమ్మన్లో చోటుచేసుకున్న ఘోర దాడుల్లో భాగస్వామ్యం ఉండటంతో రిషావికి, ఉగ్రవాద ఆరోపణలతో పాటు ఇరాక్‌లో ఓ జోర్డాన్ జాతీయుడిని చంపినందుకు 2007లో కర్బోలికి మరణ శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పైలట్‌ను సజీవ దహనం చేయడాన్ని అమెరికా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. ఈ చర్య ఐఎస్ఐఎస్ క్రూరత్వానికి నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు.