breaking news
Avanthika Mohan
-
కారులో వెంబడించాడు.. అలాంటి సైకోని చూడలేదు : హీరోయిన్
సినిమా తారలంటే అందరికీ క్రేజ్. అభిమాన హీరో, హీరోయిన్లను ఒక్కసారి దగ్గరగా చూడాలని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, ఫోటో దిగాలని అభిమానులు ఉత్సాహం చూపించడం సహజమే. కానీ ఓ అభిమాని మాత్రం ఫోన్ నెంబర్ ఇవ్వమంటూ మలయాళ నటి అవంతిక మోహన్ని కారులో వెంబడించాడు. ‘మీరంటే ఇష్టం..ఇన్‌స్టాలో రిప్లై ఇవ్వండి’అంటూ ఆమెను ఇబ్బందికి గురిచేశాడు. అతను ఏం చేస్తాడోనన్న భయంతో నవ్వుతూ మాట్లాడుతూ.. ఇన్‌స్టాలో రిప్లై ఇస్తానని చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. వ్యక్తిగత పరిమితులను గౌరవించాలని కోరింది.‘ఇటీవల నాకు చాలా విచిత్రమైన అనుభవం ఎదురైంది. నేను బయట మాస్క్ ధరించి ఉన్నప్పుడు, ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ‘మీరు అవంతికనేనా?’ అని అడిగాడు. నేను కాదని చెప్పినా, నా ఫోన్ నెంబర్ కావాలని పట్టుబట్టాడు. నేను మర్యాదగా తిరస్కరించినా, అతను వెనక్కి తగ్గలేదు. నా స్నేహితురాలు అతనిని వెళ్ళమని కోరగా, అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, అతని కారు మమ్మల్ని వెంటాడుతుందని నేను గుర్తించాను. వెంటనే, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లి, తమను ఫాలో అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాను. వెంటనే అతను ఏడవడం ప్రారంభించాడు, 'నాకు మీరంటే ఇష్టం, మేడం' అని చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై ఇవ్వండి అని కూడా అడిగాడు. ఆ సమయంలో నా భద్రత కోసం నేను అంగీకరించడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నా జీవితంలో చాలా మంది సైకోలను చూశాను, కానీ అతని ప్రవర్తన అంతుకు మించి ఉంది. దయచేసి ఒకరు వద్దంటే గౌరవించండి, పరిమితులను దాటి ప్రవర్తించొద్దు. అభిమాన నటీనటుల పట్ల మర్యాదగా ఉండండి. వారి వ్యక్తిగత జీవితాలను కూడా గౌరవించండి’ అని అనంతిక కోరింది. అవంతిక.. యక్షి- ఫేత్‌ఫుల్లీ యువర్స్, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది.ఇంద్రజిత్ ప్రధాన పాత్రలో నటించిన 'ధీరం' సినిమాలో కూడా అవంతిక ముఖ్య పాత్ర పోషించారు. -
నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్ కౌంటర్
కొందరు సెలబ్రిటీలతో సెల్ఫీ వరకే ఆగరు.. నన్ను పెళ్లి చేసుకుంటావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా! అని సినిమా డైలాగులు కూడా పేలుస్తుంటారు. అలా చాలామంది హీరోయిన్లకు ఇలాంటి ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అందరూ ఇవి చూసి ఓ చిన్న నవ్వు నవ్వేసి లైట్ తీసుకుంటారు. తాజాగా మలయాళ హీరోయిన్ అవంతిక మోహన్ (Avantika Mohan)కు కూడా ఇలాంటి ప్రపోజలే వచ్చిందట! కాకపోతే ఆ కుర్రాడికింకా 17 ఏళ్లే! నువ్వింకా పిల్లాడివిపదేపదే పెళ్లి చేసుకోమని మెసేజ్‌లు చేస్తూ ఉండటంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది అవంతిక. కొంతకాలంగా నాకు మెసేజ్‌లు చేస్తూ ఉన్న ఓ చిన్ని అభిమానికి నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకింకా 16 లేదా 17 ఏళ్లు ఉంటాయనుకుంటా.. జీవితమంటే ఏంటో నీకింకా పూర్తిగా తెలీదు. ఏడాదికాలంగా నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నావ్.. కానీ, నువ్వింకా చిన్నపిల్లాడివి. మ్యారేజ్‌కు బదులుగా పరీక్షల కోసం ఆలోచించాల్సిన వయసులో ఉన్నావ్!నేను తల్లి అనుకుంటారునీకంటే నేను చాలా పెద్దదాన్ని. ఒకవేళ మనిద్దరం పెళ్లి చేసుకున్నామనుకో.. అందరూ నన్ను నీ భార్య అనుకోరు, నీ తల్లిగా పొరబడుతారు. కాబట్టి బుద్ధిగా చదువుకో.. సరైన సమయం వచ్చినప్పుడు నీ లైఫ్‌లోనూ మంచి లవ్‌స్టోరీ ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చింది. అవంతిక.. యక్షి- ఫేత్‌ఫుల్లీ యువర్స్, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన ధీరమ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈమె సినిమాలతో పాటు పలు సీరియల్స్ చేసింది. 2017లో అనిల్ కుమార్‌ను పెళ్లాడగా వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు సంతానం.చదవండి: బిగ్‌బాస్ 9 లో యూట్యూబ్ సెన్సేషన్? ఒక్క పోస్ట్‌తో తేల్చేసిందిగా! -
సుధాకర్‌కి ఉందిలే మంచి కాలం ముందు ముందునా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న పాత్రల్లో సుధాకర్‌ది ఒకటి. మాస్ టచ్ ఉన్న ఆ పాత్రలో సుధాకర్ కోమాకుల చక్కగా ఒదిగిపోయారు. దాంతో కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని చాలామంది జోస్యం చెప్పారు. బహుశా సుధాకర్ కూడా ఆ సినిమా చేస్తున్నప్పుడు మంచి కాలం ముందుంది అని ఊహించి ఉండరు. కానీ, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ విడుదల తర్వాత తనకు మంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఓ చక్కని రొమాంటిక్ ఎంటర్టైనర్ని ఎంపిక చేసుకున్నారు సుధాకర్. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ దాస్యం దర్శకుడు. ఈ నెల 17 నుంచి వైజాగ్‌లో ఈ చిత్రం షెడ్యూల్ జరుపుతున్నారు. అలాగే ఈ చిత్రానికి ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక పాజిటివ్ ఫీల్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ. యువతీ యువకుల కలల్నీ కలవరాల్నీ ఇందులో నిజాయితీగా ఆవిష్కరిస్తున్నాం. సీనియర్ కథానాయికలు రాధిక, పూర్ణిమ చాలా విరామం తర్వాత చేస్తున్న తెలుగు సినిమా మాదే కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూలు నవంబర్ 23 వరకూ జరుగుతుంది’’ అని తెలిపారు. అవంతికా మోహన్, రాధిక, నరేష్, పూర్ణిమ, షకలక శంకర్, కార్తీక్ జీఎస్, నీతూ చౌదరి, దయానంద్, సంతోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్, కెమరా: ఈశ్వర్, ఫైట్స్: ప్రకాష్, నిర్మాణం ఆమ్ టీమ్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అరుణ్ దాస్యం.


