
కొందరు సెలబ్రిటీలతో సెల్ఫీ వరకే ఆగరు.. నన్ను పెళ్లి చేసుకుంటావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా! అని సినిమా డైలాగులు కూడా పేలుస్తుంటారు. అలా చాలామంది హీరోయిన్లకు ఇలాంటి ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అందరూ ఇవి చూసి ఓ చిన్న నవ్వు నవ్వేసి లైట్ తీసుకుంటారు. తాజాగా మలయాళ హీరోయిన్ అవంతిక మోహన్ (Avantika Mohan)కు కూడా ఇలాంటి ప్రపోజలే వచ్చిందట! కాకపోతే ఆ కుర్రాడికింకా 17 ఏళ్లే!
నువ్వింకా పిల్లాడివి
పదేపదే పెళ్లి చేసుకోమని మెసేజ్‌లు చేస్తూ ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది అవంతిక. కొంతకాలంగా నాకు మెసేజ్‌లు చేస్తూ ఉన్న ఓ చిన్ని అభిమానికి నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకింకా 16 లేదా 17 ఏళ్లు ఉంటాయనుకుంటా.. జీవితమంటే ఏంటో నీకింకా పూర్తిగా తెలీదు. ఏడాదికాలంగా నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నావ్.. కానీ, నువ్వింకా చిన్నపిల్లాడివి. మ్యారేజ్‌కు బదులుగా పరీక్షల కోసం ఆలోచించాల్సిన వయసులో ఉన్నావ్!
నేను తల్లి అనుకుంటారు
నీకంటే నేను చాలా పెద్దదాన్ని. ఒకవేళ మనిద్దరం పెళ్లి చేసుకున్నామనుకో.. అందరూ నన్ను నీ భార్య అనుకోరు, నీ తల్లిగా పొరబడుతారు. కాబట్టి బుద్ధిగా చదువుకో.. సరైన సమయం వచ్చినప్పుడు నీ లైఫ్‌లోనూ మంచి లవ్‌స్టోరీ ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చింది. అవంతిక.. యక్షి- ఫేత్‌ఫుల్లీ యువర్స్, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన ధీరమ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈమె సినిమాలతో పాటు పలు సీరియల్స్ చేసింది. 2017లో అనిల్ కుమార్‌ను పెళ్లాడగా వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు సంతానం.
చదవండి: బిగ్‌బాస్ 9 లో యూట్యూబ్ సెన్సేషన్? ఒక్క పోస్ట్‌తో తేల్చేసిందిగా!