breaking news
au proffesor
-
ఎన్నికల ప్రచారంలో ఏయూ ప్రొఫెసర్
విశాఖ సిటీ: ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్. కానీ నిబంధనలకు విరుద్ధంగా గాజువాకలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో రోడ్డెక్కారు. ఇంటింటికీ తిరుగుతూ టీడీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఒక ప్రొఫెసర్ అయి ఉండి బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో పొల్గొనడం విశేషం. ఆమె ఎవరో కాదు.. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సతీమణి పి.లావణ్యదేవి. గాజువాకలో గెలుపు కోసం పల్లా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు నెలల క్రితం వరకు ధీమాతో ఉన్న పల్లా శ్రీనివాసరావుకు.. మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి పోటీకి దిగడంతో చెమటలు పడుతున్నాయి. గుడివాడ అమర్ ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. దీంతో ప్రచారంలో వెనుకబడిన పల్లా తన కుటుంబ సభ్యులను అందరినీ ప్రచారంలోకి దింపారు. ఇందులో అతని సతీమణి ఏయూలో ప్రొఫెసర్ అయిన పి.లావణ్యదేవి కూడా ఉన్నారు.ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు సైతం రాజకీయ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి ఉంది. అయినప్పటికీ పల్లా సతీమణి లావణ్య మాత్రం గాజువాకలో బహిరంగంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. తన భర్తను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నారు. -
'ప్రజలే నన్ను రక్షించుకుంటారు'
-
బాక్సైట్ వ్యతిరేకించినందుకు ఏయూ ఫ్రొఫెసర్ పై కేసు
పాడేరు ( విశాఖపట్నం) : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆంధ్రయూనివర్సిటీ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెన్సీలో బాకై్సట్ తవ్వకాలపై టీడీపీ సర్కార్ ఇచ్చిన జీవోకి వ్యతిరేకంగా ఏయూలో ఫ్రొఫెసర్ పనిచేస్తున్న జెర్రా అప్పారావు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ తీరుపై ఘాటుగా స్పందించారు. పదిహేను రోజుల క్రింత జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు పరిశీలించారు. మంగళవారం రాత్రి ఫ్రొఫెసర్ అప్పారావుపై కేసు నమోదు చేశారు. మావోలకు సానుభూతి పరుడిగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విషయాన్ని పొక్కనీయకుండా ఉంచారు. ఆయన భార్య, ప్రజా సంఘాలు ఆందోళన చేయగా విడిచిపెట్టారు.