breaking news
attacks on india
-
తుర్కియే సోంగర్లు
భారత త్రివిధ దళాల ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. కొత్త కుయుక్తులతో యుద్ధానికి దిగుతోంది. సంప్రదాయ ఆయుధాలకు బదులుగా అత్యాధునిక డ్రోన్లతో భారత్‌పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిలో పాక్ మిత్రదేశం తుర్కియే తయారుచేసిన అత్యంత ప్రమాదకరమైన అసిస్‌గార్డ్ సోంగర్ సాయుధ యూఏవీలు ఉండటం కాస్త కలవరపెడుతోంది. ఎందుకంటే ఆధునిక యుద్ధ పద్ధతుల్లో సోంగర్ డ్రోన్లు సమర్థవంతమైనవిగా నిరూపించుకున్నాయి. వీటిని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. గురువారం రాత్రి భారత్‌లోని 36 మిలిటరీ, పౌర లక్ష్యాలపై సోంగర్ డ్రోన్లతోనే పాక్ దాడిచేసినట్లు మన రక్షణ శాఖ ప్రకటించింది. వాటిని సమర్థంగా కూల్చేసినట్లు శుక్రవారం మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. సోంగర్ డ్రోన్లను సమర్థంగా అడ్డుకోగల గగనతల రక్షణ వ్యవస్థలు మనకు ఉన్నప్పటికీ.. వాటిని తక్కువగా అంచనా వేయకూడదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సోంగర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవీ.. → సోంగర్ డ్రోన్లను తుర్కియేలోని అంకారా కేంద్రంగా పనిచేస్తున్న అసిస్‌గార్డ్ సంస్థ తయారుచేసింది. వీటిని 2019 నుంచి వినియోగిస్తున్నారు. → ఈ డ్రోన్లు స్వయంచాలితంగా ప్రయాణించి లక్ష్యాలపై దాడులు చేసి తిరిగి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కు చేరుకోగలవు. రిమోట్ కంట్రోల్‌తో కూడా నియంత్రించవచ్చు. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇవి కీలకంగా పనిచేయగలవు. సరిహద్దులు దాటి దాడులు చేయటంలో వీటికి మంచి రికార్డు ఉంది. ప్రమాదకర సాయుధ డ్రోన్సోంగర్ డ్రోన్‌కు ఒక అత్యాధునిక ఆటోమేటిక్ మెషీన్ గన్ అమర్చబడి ఉంటుంది. చిన్నపాటి క్షిపణులను కూడా ఇది ప్రయోగించగలదు. 81 ఎంఎం మోరా్టర్ రౌండ్స్‌ను పేల్చగలదు. వ్యక్తులు, వాహనాలు, ఎంపికచేసిన చిన్నపాటి లక్ష్యాలపై సమర్థంగా దాడి చేయగలదు. ఫ్లైట్ పెర్ఫార్మెన్స్సోంగర్ డ్రోన్లు 45 కిలోల బరువును మోసుకెళ్లగలవు. పేలోడ్ లేకుండా ఏకబిగిన 25 నుంచి 30 నిమిషాల వరకు గగనతలంలో ఎగరగలవు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషననుంచి 3–5 కిలోమీటర్ల దూరం వరకు ఇవి దాడులు చేయగలవు. సముద్రమట్టం నుంచి 2,800 మీటర్లు, భూ మట్టం నుంచి 400 మీటర్ల ఎత్తువరకు ఇవి ఎగరగలవు. రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్లక్ష్యాలపై నిఘా పెట్టడంలో కూడా సోంగర్ డ్రోన్లది అందెవేసిన చెయ్యి. ఇవి గగనతలంలో ఎగురుతూ గ్రౌండ్ స్టేషన్‌కు రియల్‌టైమ్ (ప్రత్యక్షంగా)లో వీడియోలు, చిత్రాలను పంపగలవు. దాడుల తర్వాత జరిగిన నష్టాన్ని కూడా విశ్లేషించి వెంటనే గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతాయి. రాత్రి– పగలు అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా ఈ డ్రోన్లు నిఘా పెట్టగలవు. రాత్రిపూట వీడియోలు, చిత్రాలు తీసేందుకు వీటిలో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయి. స్వయంచాలితం ఈ డ్రోన్లను గ్రౌండ్ స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. అవసరమైతే వాటికవే స్వయంగా ఎగురుతూ నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేయగలవు. గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినా వాటికవే తిరిగి స్టేషన్‌ను వెతుక్కుంటూ తిరిగి రాగలవు. బ్యాటరీలో చార్జింగ్ తగ్గిపోయినా వెంటనే గ్రౌండ్ స్టేషన్‌కు వచ్చేస్తాయి. దీంతో వీటిని నియంత్రించేవారికి పని సులువు అవుతుంది. గుంపుగా దాడిచేయగల సామర్థ్యం సోంగర్ డ్రోన్లు ఒక్కొక్కటిగా నిర్దేశించిన లక్ష్యాలతోపాటు దాడులు చేయటంతోపాటు గుంపులుగా కూడా వెళ్లి దాడులు చేయగలవు. పదుల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు స్వయంగా సమన్వయం చేసుకుంటూ లక్ష్యంపై నలు దిక్కుల నుంచి దాడి చేస్తాయి. శత్రువు రక్షణ వ్యవస్థను గందరగోళపర్చి సమర్థంగా దాడులు చేయగల సత్తా వీటికి ఉంది. గురువారం భారత్‌లోని పలు లక్ష్యాలపై ఇలాగే దాడులు చేసినట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీనియస్.. లెక్కలేనంత ఇష్టం!
వాషింగ్టన్: పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకున్న ఉగ్ర ముఠాలు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్‌పై దాడులకు తెగబడుతున్న ఉగ్రసంస్థలపై తగు కఠిన చర్యలు తీసుకోకుండా పాక్ నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తోందని తన తాజా నివేదికలో అమెరికా తీవ్రంగా విమర్శించింది. మసూద్ అజర్, సాజిద్ మీర్ లాంటి ఉగ్రవాద నేతలు స్వేచ్ఛగా పాక్‌లో సంచరిస్తున్నా, వీరిని పాక్ అదుపులోకి తీసుకోవడంలేదని అమెరికా పేర్కొంది. ఉగ్రవాదానికి సంబంధించిన 2020–నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం విడుదలచేశారు. అఫ్గానిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకొని అఫ్గాన్ తాలిబన్లు, వాటి అనుబంధ హక్కానీ నెట్వర్క్ దాడులు చేస్తూనే ఉన్నాయని, మరోవైపు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌తో పాటు అనుబంధ సంస్థలు పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయని నివేదిక వెల్లడించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో కోర్టులు జైలు శిక్షను విధించాయని తెలిపింది. ఎఫ్ఏటీఏ గ్రేలిస్టు నుంచి తప్పించుకునేందుకు పాక్ కొన్ని చర్యలు చేపట్టిందని, కానీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్‌లోని కొన్ని మదర్సాలో తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారని నివేదిక తెలిపింది. ఐసిస్‌లో 66 మంది భారతీయ సంతతి! అంతర్జాతీయ ఉగ్రసంస్థ ఐసిస్‌లో 66మంది భారతీయ సంతతికి చెందినవారున్నారని ఉగ్రవాదంపై అమెరికా నివేదిక శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ, స్థానిక ఉగ్ర మూకలను గుర్తించి నిర్మూలించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏలాంటి భారత ఉగ్రవ్యతిరేక దళాలను నివేదిక ప్రశంసించింది. ఎయిర్‌పోర్టుల్లో కార్గో పరీక్షకు రెండు తెరల ఎక్స్రేతెరలను వాడేందుకు భారత్ అంగీకరించిందని నివేదిక తెలిపింది. అలాగే వాయుమార్గంలో ప్రయాణించే వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించే ఐరాస ప్రతిపాదన అమలకు కూడా ఇండియా సుముఖంగా ఉందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ తెలిపారు. పలు ఒప్పందాల ద్వారా ఉగ్రపోరులో భారత్‌తో బలమైన భాగస్వామ్యం పెంచుకుంటున్నామని వెల్లడించా రు. ఐసిస్‌కు సంబంధించిన 34 కేసులను ఎన్ఐఏ విచారించిందని, 160మందిని అరెస్టు చేసిందని, వీరిలో 10మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లని నివేదిక తెలిపింది. ఉగ్రసమాచారం అందించాలన్న యూఎస్ అభ్యర్థనకు భారత్ సానుకూలంగా స్పందిస్తోందని బ్లింకెన్ తెలిపారు. టెర్రరిస్టుల్లో టెక్నాలజీ వాడకంపై భారతీయ అధికారులు ఆందోళనగా ఉన్నారన్నారు. పలు దేశాలతో భారత్ ఉగ్ర కట్టడికి కలిసి పనిచేస్తోందని నివేదిక వెల్లడించింది. -
భారత్‌పై దాడికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు?
ఇటీవలి కాలంలో అత్యంత ప్రమాదకారిగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ భారత దేశం మీద కూడా దాడులు చేసేందుకు సిద్ధమవుతోందా? పాకిస్థానీ, అఫ్ఘాన్ తాలిబన్ వర్గాలను కూడా కలిపేసుకుని అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా మారేందుకు సన్నాహాలు చేసుకుంటోందా? 'యూఎస్ఏ టుడే' పత్రిక ప్రచురించిన కథనం అవుననే అంటోంది. పాకిస్థానీ తాలిబన్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న ఓ పాకిస్థానీ పౌరుడి నుంచి సేకరించిన 32 పేజీల ఉర్దూ డాక్యుమెంటులోని వివరాలను బట్టి చూస్తే ఇదంతా నిజమేనని తెలుస్తున్నట్లు ఆ కథనం తెలిపింది. భారతదేశంపై దాడి చేయడానికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు చేసుకుంటోందని పేర్కొంది. అమెరికా తన మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని దాడులు చేయడానికి ప్రయత్నించినా కూడా.. ముస్లిం శక్తులు అన్నీ ఏకమవుతాయని, దాంతో పెద్ద యుద్ధం తప్పదని యూఎస్ఏ టుడే కథనం వివరించింది. భారతదేశం మీద దాడి చేస్తే ఐఎస్ఐఎస్ స్థాయి పెరుగుతుందని, ఆ ప్రాంతంలో సుస్థిరతకు అది ముప్పుగా పరిణమిల్లుతుందని రిటైర్డ్ సీఐఏ అధికారి బ్రూస్ రీడెల్ తెలిపారు. ప్రస్తుతం వివిధ వర్గాలుగా చీలిపోయి ఉన్న పాకిస్థానీ, అఫ్ఘాన్ తాలిబన్లంతా కలిసి ఒక ఉగ్రసైన్యంగా రూపొందాలని కూడా ఆ డాక్యుమెంటులో పిలుపునిచ్చారు. ప్రపంచంలోని వందకోట్ల ముస్లింలు అంతా కలిసి ఒక 'ఖలీఫా' కిందకు రావాలని కూడా అందులో అభిలషించారు. అల్ కాయిదా కూడా తమ గ్రూపులో చేరాలన్నారు. ఈ పరిస్థితి మొత్తాన్ని వైట్ హౌస్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ డాక్యుమెంటులో ఉపయోగించిన భాష గానీ, పదాలు గానీ అన్నీ కూడా ఇంతకుముందు ఐఎస్ఐఎస్ విడుదల చేసిన పత్రాలను పోలి ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ చూస్తే భారతదేశం మీద దాడి చేయడానికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు చేసుకుంటోందనే అనుకోవాలి. అయితే.. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. ఇప్పటివరకు ఐఎస్ఐఎస్ తమ దేశం మీద దాడి చేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు.