breaking news
attack on house
-
మాజీ సీఎం జగన్ నివాసంపై దాడి చేసిన వారి గుర్తింపు
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంపై తరచూ దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం కూడా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి వైఎస్ జగన్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాటికాయలు విసిరి పారిపోయారు. ఈ ఘటనపై ఆదివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు ఆ కారును గుర్తించి తెనాలికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోమవారం వారి వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.‘తెనాలికి చెందిన కుమార్ వంశీ, ధరణిసాయి స్నేహితులు. కుమార్‌వంశీ చెన్నైలో, ధరణిసాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒక వీకెండ్లో తెనాలి వచ్చి ధరణిసాయికి చెందిన ఏపీ 39 బీక్యూ 1496 నంబరు గల కారులో తిరుగుతూ ఉంటారు. శనివారం కారుకు ఇంజిన్ ఆయిల్ మార్పించుకుని ఉండవల్లి సెంటర్ మీదుగా స్క్రూ బ్రిడ్జి దాటి సీతానగరం మీదుగా మంగళగిరిలోని మిత్ర దాబాకు వెళ్లారు. మార్గంమధ్యలో కారు దిగి మూత్రం పోసుకుని అక్కడున్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్లారు.మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గరకు వెళ్లిన తర్వాత ఆ తాటికాయలను విసిరేశారు. అది పొరపాటుగా జరిగింది. ఉద్దేశపూర్వకంగా చేయలేదు’ అని వీడియోలో పేర్కొన్నారు. అయితే, వారు మూత్రం పోసిన ప్రదేశంలోని తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని ఆడుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు చెప్పిన ప్రకారం డంపింగ్ యార్డు వద్ద మలమూత్రాలను విసర్జిస్తారు. అలాంటి ప్రాంతంలో పడి ఉన్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని పొరపాటున విసిరినట్లు పోలీసులు చక్కగా వారికి ట్రైనింగ్ ఇచ్చి కట్టుకథను చెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించకుండా వారిద్దరూ పొరపాటు అయ్యిందని చెప్పిన వీడియోను పోలీసులు విడుదల చేయడం గమనార్హం. వైఎస్ జగన్ నివాసం వద్ద ఎప్పుడూ సందర్శకులు ఉంటారు. అయినా అక్కడే కారు అద్దం దించి తాటికాయలు ఎలా లోపలికి విసిరేశారనే విషయాలను పోలీసులు ప్రశ్నించకుండానే, వారు చేసింది పొరపాటు, పోలీస్ డైరీలో నమోదు చేసి పొరపాటుగా నిర్ధారించి వదిలివేశామని చెప్పడం విశేషం. -
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా: ఎంపీ డీకే అరుణ
-
ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ అధికారిక నివాసంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని గురించి అసదుద్దీన్ శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తూ.. లేఖ రాశారు. తనను చంపేందుకు కుట్ర చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. ఎంపీల ఇళ్లపై దాడిని సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ లేఖలో కోరారు. చదవండి: ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి -
పోలీసులపై ముఖ్యమంత్రి అసహనం
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై గురువారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. 20 నుంచి 25 మంది దుండగులు తుపాకులతో తన ఇంటిపై దాడి చేశారని కౌన్సిలర్ (దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) జితేందర్ కుమార్ మీడియాకు తెలిపారు. ఇంటి బయటనున్న కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారనీ, ఇంట్లోకి దూరేందుకు యత్నించారని వెల్లడించారు. కొంత సేపటి తర్వాత ‘నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. (ఆయనకు మాత్రమే ఫ్రెష్ ఎయిర్ కావాలా..!!) ‘వ్యక్తిగతంగా నాకు ఎవరితో విభేదాలు లేవు. ఇది రాజకీయ ప్రత్యర్థులు నాపై చేసిన కుట్ర’ అని జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ‘అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది’ అని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో.. అదీ పట్టపగలు సాయుధుల గుంపు ఓ ప్రజా ప్రతినిధిని హత్య చేసేందుకు పూనుకోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. What is going on in Delhi? https://t.co/rTjUsyggKP — Arvind Kejriwal (@ArvindKejriwal) November 16, 2018 (చదవండి : 16 మందితో ఆప్ మూడో జాబితా) -
కూకట్‌పల్లిలో వంద మందితో ఇంట్లోకి దూరి దౌర్జన్యం
-
వివాదం చేయాలనుకోవడం లేదు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: తన ఇంటిపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి ఘటనపై వివాదం చేయాలనుకోవడం లేదని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చెప్పారు. ఈ ఘటనలో తమవారికి ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. తనపై నిందారోపణలు చేసిన తృణమూల్ నాయకులు సౌగతా రాయ్, తపస్ పాల్, నందిని పాల్ పై పరువునష్టం వేయనున్నట్టు చెప్పారు. దీనికోసం ఇప్పటికే న్యాయవాదులను సంప్రదించినట్టు తెలిపారు. కోల్‌కతా కైలాశ్ బోస్ ప్రాంతంలోని బాబుల్ సుప్రియో ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ స్కాంలో ఇద్దరు టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.