ATM limits
-
దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల అనుగుణంగానే ఈ ఛార్జీలను పెంచడం జరిగిందని స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2025 మే 1నుంచి అమలులోకి వస్తాయి.మే 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఈ ఛార్జ్ రూ. 21గా ఉండేది. ఈ ఛార్జీలు నెలవారీ ఫ్రీ విత్‌డ్రా లిమిట్ పూర్తయిన తరువాత మాత్రమే వర్తిస్తుంది. ఛార్జీల పెరుగుదల విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే.. కస్టమర్లకు మెయిల్స్ ద్వారా పంపింది.ఏటీఎంలలో నిర్వహించే ఆర్ధిక లావాదేవీలకు, ఆర్థికేతర లావాదేవీళ్లకులకు & కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లలో అయినా లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన మెషీన్లలో అయినా.. ఫ్రీ ఏటీఎం లావాదేవీల లిమిట్ దాటితే.. ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటికోసం వరుసగా రూ. 8.50, రూ. 10 ఛార్జీలు వసూలు చేయనున్నారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. -
మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు
కెనరా బ్యాంక్ ఖాతా దారులకు ముఖ్య గమనిక. ఖాతాదారులు నిర్వహించే రోజూ వారీ ఏటీఎం లావాదేవీలపై మార్పులు చేసింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఈకామర్స్ ట్రాన్సాక్షన్లలో ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది ► క్లాసిక్ డెబిట్ కార్డుల కోసం రోజువారీ ఏటీఎం విత్డ్రాల్ పరిమితిని ప్రస్తుతం రూ.40వేలు ఉండగా.. రూ.75వేలకు పెంచింది. ► ప్రస్తుతం ఉన్న పీఓఎస్,ఈ కామర్స్ పరిమితిని రూ.1 లక్ష నుండి రోజుకు రూ. 2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ► రూ.25వరకు లిమిట్ ఉన్న ఎన్ఎఫ్సీ (కాంటాక్ట్‌లెస్)ని తటస్థంగా ఉంచింది. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు ఒక్కో సందర్భంలో రూ. 5000 వరకు, రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిలో మార్పులు చేసింది. పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం.. ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్‌లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌ల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ పద్దతుల ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే..సదరు వినియోగదారులు చేసిన లావాదేవీ మొత్తంలో 1శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం? -
ఏటీఎం పరిమితుల అమలుకు బ్యాంకుల వెనుకంజ?
న్యూఢిల్లీ: మెట్రో నగరాల్లో సొంత కస్టమర్లకు ఏటీఎం లావాదేవీల పరిమితులపై బ్యాంకులు ఆలోచనలోపడ్డాయి. తమ సొంత కస్టమర్లకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితి విధింపును దిగ్గజ బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు వంటివి ఇంకా ప్రకటించలేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఏటీఎంల వాడకంపై పరిమితి విధిస్తే.. బ్యాంకు బ్రాంచీల్లో కస్టమర్ల తాకిడి పెరిగిపోతుందనే ఆందోళనే దీనికి కారణమని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి చెప్పారు. నగదు విత్‌డ్రాయల్స్ లేదా ఇతర సేవల కోసం బ్రాంచ్‌లకు కస్టమర్ పదేపదే రావడం వల్ల బ్యాంకులకు ఖర్చు కూడా ఎగబాకుతుందని... ఇది రూ.20 కంటే ఎక్కువే ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌తో సహా ఆరు మెట్రోల్లో సొంత బ్యాంకులకు సంబంధించి నెలకు ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను ఐదుకు పరిమితం చేసేలా ఆర్బీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంల వాడకాన్ని ఇప్పుడున్న ఐదు నుంచి మూడు లావాదేవీలకు తగ్గించేందుకు ఓకే చెప్పింది. ఈ మార్పులు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాలెన్స్ ఎంక్వయిరీ ఇతరత్రా ఏవైనాకూడా లావాదేవీల కిందే పరిగణిస్తారు. ఈ పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.20 చొప్పున ఫీజును బ్యాంకులు వసూలు చేసుకోవచ్చు. అయితే, సొంత బ్యాంకుల ఏటీఎంల విషయంలో నెలకు ఎన్ని ఉచిత లావాదేవీలను అనుమతించాలన్నది ఆయా బ్యాంకులే నిర్ణయించుకోవచ్చని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అనవసరంగా ఖర్చును పెంచుకునే బదులు... బ్యాంకులు తమ సొంత కస్టమర్లకు నెలకు ఐదు కంటే ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం లావాదేవీలను అనుమతించే అవకాశం ఉందని.. ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల ఏటీఎం వాడకంపై పరిమితుల్ని మాత్రం అమలుచేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామీణ బ్యాంకుల్లోనూ కేవైసీ కఠినం.. ఖాతాదారులు తమ చిరునామా ఇతరత్రా వివరాలకు(నో యువర్ కస్టమర్-కేవైసీ) సంబంధించి నిబంధనలను పాటించకపోతే వాళ్ల అకౌంట్లను పాక్షికంగా స్తంభింపజేయాలని రీజినల్ రూరల్ బ్యాంకులు, సెంట్రల్ కోపరేటివ్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆదేశించింది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.Follow @sakshinews