breaking news
astro neumorology
-
Horoscope Today: ఈ రాశి వారు అన్నీ శుభవార్తలే వింటారు
మేషం...పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.మిథునం : వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కర్కాటకం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.కన్య : కష్టానికి ఫలితం దక్కదు. వ్యవహారాలు నెమ్మదిస్తాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.తుల: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.వృశ్చికం:ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి.ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు.మకరం : కొత్త వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.కుంభం:పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.మీనం:శుభకార్యాలపై ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. -
అనుగ్రహం.....ఉండాలి మరి..
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్) : రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 12వ తేదీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఈ మేరకు ఇప్పటికే టికెట్లు ఖరారైన టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు మహాకూటమి నుంచి తప్పక టికెట్ లభిస్తుందని భావిస్తున్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా సోమవారం నుంచి జరగనున్న నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా నామినేషన్ల దాఖలకు ఎనిమిది రోజుల సమయం ఉండగా.. ఇందులో తమ పేరు, జాతకం ప్రకారం ఏ రోజు నామినేషన్ దాఖలు చేస్తే మంచిదనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం తమకు నమ్మకస్తులైన వారే కాకుండా ప్రముఖ జ్యోతిష్యులు, పండితులను ఆశ్రయిస్తున్నారు. గ్రహాలు అనుకూలిస్తేనే రాజయోగం సిద్ధిస్తుందనే నమ్మకం ఉన్న ఆశావహులు జ్యోతిష్యులను కలుస్తూ పేరుబలాలపై అంచనాలు వేసుకుంటున్నారు. నాలుగే మంచివి.. నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్న 12వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో కేవలం నాలుగు మంచి ముహూర్తాలే ఉన్నాయని పలువురు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నాలుగు ముహూర్తాల్లో మొదటి ప్రాధాన్యతగా ఈనెల 14వ తేదీ బుధవారం సప్తమి శ్రవణా నక్షత్రం బాగుంటుందని పలువురు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఇక రెండో ప్రాధాన్యత 17న శనివారం దశమి, మూడో ప్రాధాన్యత 18 ఆదివారం, చివరి ముహూర్తంగా 19వ తేదీ సోమవారం ద్వాదశిని గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు తమను ఆశ్రయించిన అభ్యర్థులందరికీ ఈ నాలుగు ముహూర్తాలనే సూచించినట్లు పలువురు పండితులు తెలిపారు. మంచి అనేది చూసుకోవాలి ఏ పని చేసినా మంచి అనేది చూసుకుని ముందుకు సాగాలి. ఇది అనాదిగా పెద్దలు మనకు నేర్పిన సంప్రదాయం. మంచి అనేది ఆలోచించుకుని చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అందుకే నామినేషన్లకు కూడా మంచి ముహూర్తాలు, దైవానుగ్రహం కోరుకోవాలి. దైవబలంతో పాటు పెద్దల ఆశీర్వాదం కూడా అవసరమే. ఇది మంచి సంప్రదాయం. – ఓరుగంటి సంపత్‌కుమార్ శర్మ, బ్రాహ్మణ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, నాగర్‌కర్నూల్ దైవబలమూ కలిసి రావాలి నామినేషన్లకు మంచి ముహూర్తాలు చూసుకోవడం ఎంత ముఖ్యమో రాజకీయ రణరంగంలో దైవబలం సంపాదించుకోవడం అంతకంటే ముఖ్యం. అభ్యర్థులందరూ జాతకరీత్యా దైవజ్ఞులను సంప్రదించి తమ గ్రహస్థితిలో ఉచ్చ, నీచ స్థానాలు చూసుకుని పరిహార మార్గాలు పాటించాలి. పరిహార మార్గాల ద్వారానే దైవ బలం చేకూరుతుంది. – జ్యోషి సత్యనారాయణ శర్మ. వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఉంద్యాల ముహూర్తం ముఖ్యం కాదు రాజకీయ రణరంగంలో ముందుకు వెళ్లాలనుకునే వారికి తిథి ప్రామాణికం కాదు. రాజకీయాలకు గురుబలం, శనిబలం, రాహు బలం బాగుండాలి. అమావాస్య నాడు పుట్టిన వారు కూడా రాజ్యాన్ని ఏలుతున్నారు కదా? ముహూర్తం కంటే జాతకంలోని దశలు, గ్రహస్థితులను సరిచూసుకోవాలి. అదే సరైనది. – ఓరుగంటి నాగరాజ శర్మ, సిద్ధాంతి, పంచాంగకర్త, వనపర్తి విశ్వాసానికి సంబంధించినది జాతకమనేది వారి వారి విశ్వాసాలకు సంబంధించిన విషయం. ఇందులో నాస్తిక వాదానిక తావు లేదు. శాస్త్రాలన్ని నూటికి నూరు శాతం సరైనవే. ఏ శాస్త్రమైనా వారి కోణాల్లో సరైనదేనేనని చెప్పాలి. మంచి పనితో పాటు జీవితాన్ని మలుపు తిప్పే కార్యాన్ని ప్రారంభించేటప్పుడు జాతక రీత్యా ముందుకు వెళ్లడం ఆమోదయోగ్యమనే చెప్పాలి. రాజకీయాలకు రాహుగ్రహాలకు తప్పక ప్రాధాన్యం ఉంటుంది. – జ్యోషి గోపాలశర్మ, బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర సభ్యుడు -
దేశం సుస్థిరం... రాష్ర్టం మహోజ్వలం
అంజనం దేశం సుస్థిరం... రాష్ర్టం మహోజ్వలం 2014లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందనీ, అన్ని రంగాలలోనూ రాష్ర్టం ప్రగతిపథంలో నడుస్తుందని ఆస్ట్రో న్యూమరాలజీ చెబుతోంది. రాష్ర్టంలో 2014లో బంజరు భూములు బంగారు భూములు అవుతాయి. మహిళలకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమౌతాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 2014 సంవత్సర సంఖ్య 7 వస్తుంది (2+0+1+4 = 7). ఇది కేతువుకి సంబంధించిన అంకె. అందు వల్ల 2014లో ప్రపంచవ్యాప్తంగా కేతుప్రభావంతో అందరూ ఆధ్యాత్మిక చింతన, త్యాగబుద్ధి కలిగి ఉంటారు. ప్రజలు, ప్రాంతాలు న్యాయసంబంధమైన చిక్కులు, ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలు ఎదుర్కొనవలసి వస్తుంది. రాజకీయంగా తీవ్రమైన ఎత్తుపల్లాలు చోటుచేసుకుంటాయి. 2014 సంవత్సరంలో ‘2’ చంద్రునికి సంబంధించినది. చంద్రుని ప్రభావం వల్ల ప్రజలందరూ పరస్పరం ప్రేమాభిమానాలతో మెలుగుతారు. పరమత సహనం కనబరుస్తారు. ఇక ఇదే సంవత్సరంలో ఉండే ‘1’ వలన సూర్యప్రభావం ఉంటుంది. నాయకులు శక్తిమంతం అవుతారు. ఇందులోనే ఉండే ‘4’ రాహుసంఖ్య. దీనివలన ఆధునిక సాంకేతికతలో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. 2014 సంవత్సర సంఖ్య ‘14’. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. దీనివలన అందరికీ వ్యాపారవృద్ధి జరుగుతుంది. ప్రజలు ప్రత్యామ్నాయ ఔషధాలవైపు అంటే యోగా, మెడిటేషన్, ఆయుర్వేదం, ప్రాణిక్ హీలింగ్, రేఖి, చక్ర లాంటివాటిపట్ల మొగ్గు చూపుతారు. అలాగే ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. సౌరశక్తిని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రజలలో దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలలో కొత్త కట్టడాలు మొదలుపెడతారు. కొత్త పుణ్యక్షేత్రాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు, దేశంలో ఆచార వ్యవహారాలకు ఆదరణ పెరుగుతుంది. ఇండియా ఇండియా పర్సనల్ ఇయర్ నం.3. అందువలన దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో చాలా అభివృద్ధి చెందుతుంది. కొత్త సాంకేతిక రంగాలలో విద్యాసంస్థలు నెలకొల్పబడతాయి. మరోవైపు కొత్త వైరస్ వల్ల ప్రజల ఆరోగ్యం కుంటుపడే అవకాశం ఉంది. అందువలన వైద్యరంగంలో పరిశోధనలకు బడ్జెట్ కేటాయింపులు బాగా జరుగుతాయి. రాజకీయాలలో యువజనుల పాత్ర బాగా పెరుగుతుంది. మతాల మీద గౌరవమున్నవారికి అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు ప్రభావం వలన దేశంలో పంటలు బాగా పండుతాయి. ఖనిజాలు బాగా దొరుకుతాయి. బంగారం మీద ప్రజలకు ప్రీతి ఎక్కువగా ఉన్నప్పటికీ, బంగారం రేటు స్థిరంగా ఉంటుంది. మనం ఎంత స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ చైనా వల్ల ముప్పు ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్‌కు పర్సనల్ ఇయర్ నం.1 అవటం వలన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీలు అవిర్భవిస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు వస్తాయి. 2013తో పోలిస్తే 2014లో సామాజికంగా, ఆర్థికంగా దేశంలోనే మంచి అభివృద్ధి సాధిస్తుంది. అపారమైన భూ నిక్షిప్త ఖనిజ సంపదతో అగ్రస్థానంలో నిలబడుతుంది. బంజరు భూములు బంగారు భూములవుతాయి. కొత్త టెక్నాలజీని కనుగొనే సంస్థలు నెలకొల్పబడతాయి. మహిళలకు ఉద్యోగావకాశాలు విస్తృతమౌతాయి. వారి క్షేమం కోసం మరిన్ని చట్టాలు వస్తాయి. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు పర్యాటకులతో కళకళలాడుతాయి. పాలిటిక్స్ రాజకీయాల్లో కొత్తవారికి ప్రజల పట్టం కడతారు. పాలిటిక్స్ లోకి బాగా చదువుకున్నవారు, ఉన్నత పదవులు అలంకరించినవారు ఎక్కువగా వస్తారు. ప్రజలు ఎక్కువగా కొత్తవారికే పట్టం కడతారు. ఏపీలో కొత్త రాజకీయ కూటములు ఏర్పడతాయి. కొత్త కొత్త చట్టాలు వస్తాయి. ఎడ్యుకేషన్ విద్యార్థులు కొత్త చదువులు చదువుతారు. సాంకేతిక విద్యకు ఆదరణ తగ్గుతుంది. ట్రెడిషనల్ వృత్తులపై ప్రజలలో మక్కువ ఏర్పడుతుంది. విద్యార్థులలో దైవభక్తి పెరుగుతుంది. చాలామంది వేదం చదవటానికి ఆసక్తి చూపుతారు. జ్యోతిష్యం లాంటి ప్రాచీన చదువులపై మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంది. వైద్యవిద్యపై విద్యార్థులలో మక్కువ పెరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి నివారణకు నూతన వైద్యవిధానాలు ఆవిష్కరింపబడతాయి. పరిశ్రమలు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నానో టెక్నాలజీకి ఆదరణ పెరుగుతుంది. ఖనిజ సంపద పెరుగుతుంది. అందువలన ఖనిజాలను సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పబడతాయి. సినీ పరిశ్రమలో కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తారు. భారీ సినిమాలను నిర్మిస్తారు. సినీ పరిశ్రమకి మంచి అవకాశాలు వస్తాయి. ఈరంగంలో చాలామంది ఉపాధి అవకాశం ఏర్పడుతుంది. టీవీ రంగంలో పనిచేసేవారికి ఆదరణ పెరుగుతుంది. ఈ రంగంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తారు. పత్రికా రంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త కొత్త పత్రికలు వస్తాయి. వ్యవసాయం ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. అదీకాక, రైతులు సంప్రదాయ పంటల కన్నా వాణిజ్య పంటలపై మక్కువ చూపుతారు. ప్రజలలో ఆహార అలవాట్లలో మార్పులు వస్తాయి. కొత్త గోశాలలు వెలుస్తాయి. గో పూజకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రజలు భూమి మీద మక్కువ చూపుతారు. బీడు భూములను పంట పొలాలుగా మారుస్తారు. రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్ పర్సనల్ నం.1 కాబట్టి ప్రజలలో కొత్త నివాస గృహాలు కొనాలని కోరిక పెరుగుతుంది. అందువలన రియల్ ఎస్టేట్‌కి ఆదరణ పెరుగుతుంది. బీడు భూములలో సైతం కొత్త కొత్త విల్లాలు వెలుస్తాయి. నిర్మాణ రంగంలో పనిచేసే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌కి 2014లో ఉజ్వల భవిష్యత్ ఉండి, అన్ని రంగాలలోను మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త కొత్త క్రీడాప్రాంగణాలు ఏర్పడతాయి. ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. డా. మహమ్మద్ దావూద్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ పర్సనల్ ఇయర్ పర్సనల్ ఇయర్ తెలుసు కోవాలంటే స్వాతంత్య్రదినాన్ని (15-8-1947) బర్త్‌డేగా తీసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ నంబర్ తెలుసుకోవాలంటే ఇండియా జన్మదినం+నెల+ఏ సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలో ఆ సంవత్సరం తీసుకోవాలి. ఇప్పుడు 2014లో ఇండియా పర్సనల్ ఇయర్ ఈ విధంగా నిర్ణయించవచ్చు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ = 15 స్వాతంత్య్రం సిద్ధించిన నెల = 8 2014లోని 2, 0, 1, 4 యొక్క మూల్యం (2+0+1+4) = 7 ఇవి మొత్తం కలిపితే = 30 అంటే 2014లో ఇండియా పర్సనల్ ఇయర్ నం.3 అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పర్సనల్ ఇయర్ తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అవతరించిన తేదీ+ నెల+ 2014 కలపాలి. అనగా 1+11+2014 = 10 =1 ఈ పర్సనల్ ఇయర్‌ను బట్టి ఆ సంవత్సరంలో జరిగే పరిణామాలను తెలియజేయవచ్చు. ఇది న్యూమరాలజీ ప్రకారం భవిష్యత్తును తెలుసుకునే విధానం.