breaking news
assamese
-
వారి గుండె అస్సాం కోసమే కొట్టుకుంది
ఒక గాయకుడు మరణిస్తే జనం సముద్రంలా పోటెత్తడం జుబీన్ గార్గ్ అంతిమ యాత్రలో దేశం చూసింది. ఎవరీ జుబీన్ గార్గ్ అని ఆరా తీసింది. అతడు అస్సాం గొంతుక, అస్సాం సంగీతానికి గుండెకాయ. అభిమానులు ‘కింగ్ ఆఫ్ హమ్మింగ్’ అని పిలుచుకునే జుబీన్ గార్గ్ ఈశాన్య రాష్ట్రాలన్నీ గర్వపడే సంగీత సముద్రం. గాయకుడు, సంగీత కారుడు, వాద్యకారుడు, సామాజిక సేవకుడు, దాత... ఇంకా మరెన్నో. ఇప్పటికి దాదాపు పదివేలకు పైగా పాటలు పాడి, రికార్డు చేసి స్థానిక గీతాలకు గొంతుకనిచ్చాడు. అంతేకాదు ప్రజల తరఫున అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి కూడా వెనుకాడలేదు. అందుకే అతణ్ణి జనం గుండెల్లో పెట్టుకున్నారు.చని పోతే గుండెలు పగిలేలా ఏడ్చారు. ఒకప్పుడు దేశాన్ని ఒక ఊపు ఊపిన ‘యాలీ... రహమ్ వాలీ’ పాట జుబిన్ పాడిందే.జుబీన్ మెహతా అంతటి వాడు కావాలని...జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నాడు. గార్గ్ అతని గోత్రనామం. తల్లి గాయని కావడం, తండ్రి కవి కావడంతో వారిద్దరి అంశతో వాగ్గేయకారుడు అయ్యాడు. క్షణాల్లో పాట కట్టి పాడగలడు. అందులో అస్సామీ సంస్కృతిని చూపిస్తాడు. హిందీ, బెంగాలీ, అస్సామీ తదితర భాషల్లోనే కాదు ఈశాన్య రాష్ట్రాల స్థానిక భాషల్లో కూడా పాడాడు.సింగపూర్‌లో జరుగుతున్న నార్త్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబిన్ సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. అతని పార్థివదేహం భారత్‌కు చేరుకోగానే వేలాది మంది అభిమానులు అతన్ని ఆఖరిసారి చూసేందుకు ఎయిర్ పోర్ట్‌కు తరలి వచ్చారు. సెప్టెంబర్ 23న జరిగిన అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అతని స్మారక స్థూపం కోసం మూడున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.అతని ప్రేమకథజుబీన్ గార్గ్‌కు వేలాది మంది అమ్మాయిలు ఫాన్స్‌గా ఉన్నారు. వారిలో ఒకమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు గరిమా సైకియా. జుబిన్ ఆల్బమ్స్ ‘అనామిక’, ‘మాయ’ విని గరిమ ఆయనకు అభిమానిగా మారారు. ఆ సమయంలో ఆమె ముంబయిలో ఉన్నారు. ఇంటి నుంచి దూరంగా ఉంటూ, హోమ్‌సిక్ అనుభవిస్తున్న ఆమెకు ఆ పాటలు ప్రశాంతతను అందించాయి. తన అభిమానాన్ని ఓ ఉత్తరం రూపంలో రాసి ఆయనకు పంపారు. జుబీన్ తన అభిమానులకు ఎప్పుడూ ప్రత్యుత్తరం రాయలేదు. మొదటిసారి గరిమ రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం రాశాడు.వారి ప్రేమకు అక్కడే బీజం పడింది. ఆ తర్వాత కొంతకాలం ఉత్తరాల ద్వారా ప్రేమ బలపడింది. అయితే అన్ని ప్రేమకథల్లాగే వీరి ప్రేమకూ ఆటంకాలు తప్పలేదు. గరిమ కుటుంబం ఈ ప్రేమను అంగీకరించలేదు. ఆమె తండ్రి ససేమిరా అన్నారు. గరిమ సైతం జుబీన్ ప్రవర్తనతో కొంత విసిగి పోయారు. ఆయనకు దూరంగా ఉండటమే మంచిదని భావించి దూరంగా వెళ్లారు. ఆ తర్వాత జుబీన్ పరిస్థితి తలకిందులైంది.దేని మీదా ఏకాగ్రత నిలవలేదు. ఆ ప్రభావం అతను చేస్తున్న పని మీద పడింది. పాటల్లో పస ఉండటం లేదని అభిమానులు పెదవి విరిచారు. డిప్రెషన్ చుట్టుముట్టింది. ఇదంతా విన్నాక గరిమ మనసు కరిగింది. ఒకరినొకరు విడిచి ఉండలేరని ఇద్దరికీ అర్థమై 2002 ఫిబ్రవరి 4న వివాహం చేసుకున్నారు. 23 ఏళ్లుగా వారి బంధం పటిష్ఠంగా ఉంది. ఉన్నట్టుండి జుబీన్ లేక పోవడాన్ని గరిమ జీర్ణించుకోలేక పోతున్నారు. వారిద్దరి ప్రేమ గురించి తెలిసినవారంతా కన్నీరు పెడుతున్నారు. సమాజం కోసం కలిసి నడిచారుజుబీన్ గార్గ్–గరిమ దంపతులకు సొంత పిల్లలు లేరు. కానీ 15 మంది నిరుపేద పిల్లల్ని వారు దత్తత తీసుకొని, వారి ఆలనా పాలనా చూశారు. వీరిలో ‘కాజలి’ అనే పాప వారిద్దరికీ ఎంతో ప్రియమైన బిడ్డ. ఓరోజు జుబీన్ కారులో ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఓ చిన్నారి కనిపించింది. చిన్నవయసులో కూలి పనులు చేస్తూ యజమాని చేత తిట్లు తింటోంది. వెంటనే స్పందించిన జుబీన్ ఆ పాపను అక్కున చేర్చుకున్నారు. తన బిడ్డగా దత్తత చేసుకున్నారు. అనంతరం ఆ పాపకు చదువు, పోషణ బాధ్యతంతా తానే తీసుకున్నారు. ఈ విషయంలో గరిమ ఆయనకు చేదోడుగా నిలిచారు. అలా తమ వద్దకు వచ్చి చేరిన 15 మంది పిల్లల్ని సొంత తల్లిలా పెంచుతున్నారు. ఇది మాత్రమే కాదు, అస్సామ్ వరదలు వచ్చినప్పుడు బాధితులకు సాయం అందించారు. కోవిడ్ సమయంలో జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి, తమ ఇంటినే చికిత్సాలయంగా మార్చారు. ఎంతోమందికి వ్యక్తిగతంగా సాయం అందించారు. తన కళతోనే కాక, తన మంచి గుణాలతో ప్రజల గుండెల్లో నిలిచిన జుబీన్ లేరన్న విషాద వార్త అందర్నీ కలచివేసింది. మళ్లీ అలాంటి వ్యక్తి పుట్టబోరంటూ ఆయన అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
Mur Ghurar Duronto Goti: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!
‘అవును... గుర్రం ఎగరావచ్చు’ అంటారు. ఈ గుర్రం మాత్రం ఎగరడమే కాదు... యంగ్ డైరెక్టర్ మహర్షి కశ్యప్‌ను కూర్చోబెట్టుకొని బెంగళూరు నుంచి జైపుర్ వరకు తిప్పింది. రేపు ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా తీసుకువెళ్లవచ్చు... ఆస్కార్ 2023 బరిలో ‘షార్ట్ ఫిల్మ్ ఫిక్షన్’ విభాగంలో మన దేశం నుంచి అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ది హార్స్ ఫ్రమ్ హెవెన్) ఎంపికైంది. 27 సంవత్సరాల మహర్షి తుహిన్ కశ్యప్ దీని దర్శకుడు. కథ విషయానికి వస్తే... ఒక పెద్దాయన ఎప్పుడూ పగటి కల కంటూ ఉంటాడు. నగరంలో జరిగే గుర్రపు పందేలలో తన గుర్రం కూడా ఉండాలి. ఆ గుర్రం ఎలాంటిదంటే, మెరుపు వేగంతో పరుగులు తీస్తుంది. ఎప్పుడు గుర్రపు పందేలు జరిగినా తానే విజేత. ‘మీ గుర్రానికి ఎంత బాగా శిక్షణ ఇచ్చారు’ అంటూ అందరూ తనను వేనోళ్లా పొగుడుతుంటారు. ‘ఇంతకీ నా గుర్రం ఏదీ?’ అని వెదుకుతాడు ఆ పెద్దాయన. కానీ ఆ గుర్రం ఊహాల్లో తప్ప వాస్తవప్రపంచంలో కనిపించదు. అక్కడ కనిపించేది తన గాడిద మాత్రమే! ‘కలా? నిజమా! అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ గురించి వింటూ, చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్ బరిలో నిలవడం అనేది గర్వంగా ఉంది’ అంటున్నాడు మహర్షి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన మహర్షి స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీశాడు. సర్రియలిజం, డార్క్ హ్యూమర్లతో కూడిన ఈ కథను చెప్పడానికి సంప్రదాయ కళ ‘ఒజపాలి’ని సమర్థవంతంగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరువందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న అస్సామీ కళారూపం ‘ఒజపాలి’లో కళాకారులు ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ పురాణాలలో నుంచి కథలు చెబుతుంటారు. ‘ది హార్స్ ఫ్రమ్ హెవెన్’ను ఎక్కువ భాగం క్యాంపస్‌లో చిత్రీకరించారు. కొంత భాగం కోల్‌కతా శివారులలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్, జైపుర్ ఫిల్మ్‌ఫెస్టివల్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీప్ ఫోకస్ స్టూడెంట్ ఫిల్మ్‌ఫెస్టివల్...మొదలైన ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎస్ఎఫ్ఎఫ్)లో ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్ అందుకొని ఆస్కార్ బరిలోకి దిగబోతుంది. ఫీచర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను ఆస్కార్‌కు పంపాలంటే అది ఆస్కార్ – క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ గెలుచుకోవాలి. మన దేశంలో అలాంటి ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ బీఐఎస్ఎఫ్ఎఫ్. ‘చిత్ర రూపకల్పన అనేది ఎంత క్లిషమైన విషయమో అందులో దిగాక కాని తెలియదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. స్వర్గం నుంచి దిగి వచ్చిన గుర్రం మమ్మల్ని ఎన్నో నగరాలు తిప్పింది. భవిష్యత్‌లో ఎన్ని చోట్లకు తీసుకువెళుతుందో తెలియదు’ అంటున్నాడు మహర్షి. కల్లోల ప్రాంతంలో పుట్టి పెరిగిన మహర్షికి ఎనిమిదవ తరగతిలో డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. చాలామందిలో ఆతరువాత కాలంలో ఆ కోరిక ఆవిరైపోతుంది. కానీ మహర్షి విషయంలో మాత్రం అది ఇంకా బలపడింది. (క్లిక్: హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత) సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టిన రోజు తన కలకు రెక్కలు దొరికినట్లుగా సంతోషపడ్డాడు. మహర్షిలో ఉన్న ప్రశంసనీయమైన ప్రత్యేకత ఏమిటంటే.. నేల విడిచి సాము చేయాలనుకోవడం లేదు. తన నేల మీద నడయాడిన కథలనే చిత్రాల్లోకి తీసుకురావాలకుంటున్నాడు. ఉత్తర, దక్షిణ భారతాలతో పోల్చితే వెండి తెర మీద కనిపించిన ఈశాన్య భారత ప్రాంత కథలు తక్కువ. ఇప్పుడు ఆ లోటు మహర్షి కశ్యప్ రూపంలో తీరబోతుంది. ఆస్కార్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే! (క్లిక్: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్) ప్రాంతీయ చిత్రాలు రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అస్సాం అనేది కొత్త కథలకు కేంద్రం కాబోతుంది. – మహర్షి -
కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి
దిస్పూర్: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అస్సాం ప్రముఖ రచయిత హోమెన్ బర్గోహెయిన్ (88) కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన మృతితో అసోం సాహిత్య లోకం మూగబోయింది. అతడి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతాపం ప్రకటించారు. అధికారికంగా అంత్యక్రియలు జరిపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అసోంకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అస్సాంలోని లక్ష్మీపూర్ జిల్లా దుకువాఖానాలో డిసెంబర్ 7, 1932న హోమెన్ జన్మించారు. అస్సామీలో రచించిన ‘పిటా పుత్రా’ అనే రచనకు 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ వరించింది. అయితే 2015లో జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా ఆయన ఆ అవార్డు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ‘సౌదర్ నవ్ మెలీ జయ్’, ‘హల్దోయా సొరయే బౌదన్ ఖాయ్’, ‘అస్తరాగ్’, ‘తిమిర్ తీర్థ’, ‘మత్స్యగంధ’, ‘సుబాల’, ‘నిసంగట’, ‘ఆత్మాన్సుకందన్’, ‘గద్యర్ సాధన’, ‘ప్రొగ్యర్ సాధన’ తదితర రచనలు చేశారు. అస్సాం భాషలో ఎంతో సాహిత్య సేవ చేశారు. హోమెన్ భార్య నిరుపమ తములీ కూడా ప్రముఖ రచయిత్రి. ఆమె కూడా ఎన్నో రచనలు చేశారు. హోమెన్ పాత్రికేయుడిగా కూడా పని చేశారు. అసోం సాహిత్య సభకు 2001లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లు అసోం సివిల్స్ సర్వీస్ అధికారిగా కూడా పని చేశారు. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య Shri Homen Borgohain will be remembered for his rich contributions to Assamese literature and journalism. His works reflected diverse aspects of Assamese life and culture. Saddened by his passing away. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 12, 2021 একশৰণ নামধৰ্মৰ বিশিষ্ট প্ৰৱৰ্তক মহাপুৰুষ শ্ৰীশ্ৰী দামোদৰদেৱ আছিল অসমৰ নৱবৈষ্ণৱ আন্দোলনৰ এগৰাকী অন্যতম বাটকটীয়া। আজি সেই পুণ্যাত্মাৰ পৱিত্ৰ তিৰোভাৱ তিথিত মোৰ সশ্ৰদ্ধ প্ৰণিপাত জনাইছোঁ। — Himanta Biswa Sarma (@himantabiswa) May 12, 2021 -
అస్సామీ నాటకం.. అదుర్స్
-
కర్ణాటకలో అసోం యువకుడి హత్య
మంగళూరు: కూలీ పనుల నిమిత్తం కర్ణాలకకు వలస వచ్చిన ఓ అసోమీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పనులకు ఎంత కూలీ తీసుకోవాలనే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన విబేధాలే హత్యకు దారితీశాయని పోలీసులు చెప్పారు. అసోంకు చెందిన మహేంద్రరాజ్ బొన్సి (22) తన బంధువులతో కలిసి ఉడిపి జిల్లాలోని శిరూరు, ముద్దుమనే గ్రామాల్లో నిర్మాణం పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా, వలస కూలీలు తక్కువ కూలీకే పనులు చేస్తుండటంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని స్థానిక కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. సోమవారం ఓ చోట కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నారు ఇరువర్గాలు. అయితే ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఆగ్రహానికి గురైన ప్రత్యర్ధులు.. అస్సామీ కూలీల ప్రతినిధులపై కర్రరతో దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, తీవ్రగాయాలపాలైన మహేంద్రరాజ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


