breaking news
asram medical college
-
ఆశ్రం వ్యవహారం: కానిస్టేబుల్‌పై వేటు
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో ఆందోళనకు దిగిన మెడికోల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. కానిస్టేబుల్ మోహన్‌ను వీఆర్‌కు పంపాలని ఎస్పీ రవిప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రద్దు చేసిన క్రిస్మస్ సెలవులను వేసవి సెలవులతో కలిపి ఇవ్వాలని మెడికోలు అందోళనకు దిగారు. వేసవి సెలవులను పదిహేను రోజులకు బదులు నెలరోజులు ఇవ్వమని కాలేజీలో ఆందోళన చేస్తున్న మెడికోలను కానిస్టేబుల్ వీడియో తీయడమే గాకుండా.. వారిని లాక్కెళుతూ అనుచితంగా ప్రవర్తించారు. ఈ దారుణాన్ని అడ్డుకున్న విద్యార్థులపై కూడా దురుసుగా ప్రవర్తించాడు కానిస్టేబుల్. దీనిపై సీరియస్ అయిన ఎస్పీ... సంబంధిత కానిస్టేబుల్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. మరోవైపు విద్యార్థినులను జుట్టుపట్టుకుని దౌర్జన్యంగా లాక్కువెళుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారాలు చేయరాదని సూచించారు. -
ఆశ్రం వ్యవహారం: కానిస్టేబుల్‌పై వేటు
-
లారీ, బైక్ ఢీ: ఒకరు మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆశ్రమ్ వైద్య కళాశాల వద్ద లారీని బైక్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఏలూరు నగరంలోని జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రికి తరలించారు అయితే క్షతగాత్రల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.